సంపాదకీయం జూన్ 2022

1
6

[dropcap]‘సం[/dropcap]చిక’ – తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు వందనాలు. సంచికను అమితంగా అభిమానిస్తున్న వారందరికి అభివందనాలు.

రచయితలను ప్రోత్సహించేందుకు మరో కథల పోటీ నిర్వాహించాలనీ, పాఠకులకు చేరేందుకు సంచిక రచనల లింక్‌లను ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలని సంచిక నిర్ణయించింది.

ఉత్తమ కథా సంపుటాలకు, ఉత్తమ కవితా సంపుటాలకు, ఉత్తమ నవలలకు వార్షిక పురస్కారాలు అందజేయాలని తలుస్తోంది సంచిక. అలాగే సంచిక రచయితల పుస్తకావిష్కరణ సభలను కూడా నిర్వహించదలచింది.

ఇవే కాకుండా సంచికలో ప్రచురితమైన కథలు, కవితలతో సంపుటాలు వెలువరించనుంది.

రచయితల సమావేశాలు కొనసాగించేందుకు గాను – ప్రతీ నెలా ఆఫ్ లైన్ మీటింగ్ ఏర్పాటు చేయాలని, ప్రతీ వారం జూమ్ ద్వారా ఆన్‌లైన్ సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తోంది. మరిన్ని వివరాలు త్వరలో.

రాబోయే కాలంలో కూడా విశిష్టమయిన రచనలతో, వినూత్నమయిన శీర్షికలతో, ఉన్నత ప్రామాణికాలు పాటిస్తూ ‘సంచిక’ ముందుకు సాగుతుంది. ఇందుకు, సాహిత్యాభిమానులందరి సహాయ సహకారాలను అభ్యర్థిస్తోంది.

~

ఎప్పటిలానే వ్యాసాలు, ఇంటర్వ్యూ, కాలమ్స్, కథలు, కవితలు, గళ్ళనుడి కట్టు, పిల్లల కథలు, ఇతర రచనలతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ జూన్ 2022 సంచిక.

1 జూన్ 2022 నాటి ‘సంచిక’లోని రచనలు:

ప్రత్యేక వ్యాసం:

  • రేడియో కబుర్లు – భమిడిపాటి కామేశ్వరరావు – సంచిక టీమ్

సంభాషణం:

  • శ్రీమతి నాగజ్యోతి శేఖర్ అంతరంగ ఆవిష్కరణ – డా. కె.ఎల్.వి. ప్రసాద్

కాలమ్స్:

  • రంగుల హేల 51: ఇంటిలోన పోరు ఇంతింత కాదయా! – అల్లూరి గౌరిలక్ష్మి
  • సంచిక విశ్వవేదిక – విశ్వవీధుల్లో…3 – వి. శాంతిప్రబోధ – సారధి మోటమఱ్ఱి
  • సంచిక విశ్వవేదిక – అనుకోని ఘటనలు – సారధి మోటమఱ్ఱి

గళ్ళ నుడికట్టు:

  • సంచిక-పదప్రహేళిక- జూన్ 2022- దినవహి సత్యవతి

వ్యాసాలు:

  • అమ్మ కడుపు చల్లగా -27 – ఆర్. లక్ష్మి

కవితలు:

  • నమ్మకు… నన్ను నమ్మకు – శ్రీధర్ చౌడారపు
  • అవును, ఇప్పుడైనా – డా. విజయ్ కోగంటి
  • ఒక ప్రేమ కథ – అన్నపూర్ణ ఏ.

కథలు:

  • ఆల్గోరిథమ్ – డా. మధు చిత్తర్వు
  • దరి చేరిన హృదయాలు – శ్యామ్ కుమార్ చాగల్
  • నా రాత గుండ్రం – గంగాధర్ వడ్లమాన్నాటి

పుస్తకాలు:

  • శ్రీరస్తు – ‘చంపకాలోచనమ్’ పుస్తకానికి ముందుమాట – పుస్తక పరిచయం – సంచిక టీమ్

బాల సంచిక:

  • చెట్టు చేసిన మేలు – కంచనపల్లి వేంకటకృష్ణారావు

అవీ ఇవీ:

  • లోకాయత సిద్ధాంత కర్త ‘చార్వాకుడు’ – అంబడిపూడి శ్యామసుందర రావు
  • ‘సిరికోన’ చర్చా కదంబం 11 – ‘జీవితం చిగురిస్తూనే ఉంటుంది’ – డా. గంగిశెట్టి లక్ష్మీ నారాయణ
  • తెలుగునాట ఆధునిక సంఘ సంస్కర్తలు – డా. సి. భవానీదేవి
  • వినయ విధేయతలే శ్రేయోదాయకం – సి. హెచ్. ప్రతాప్

సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము.

సంపాదక బృందం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here