Site icon Sanchika

సంపాదకీయం మే 2022

[dropcap]‘సం[/dropcap]చిక’ – తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు నమస్కారాలు. సంచికను అమితంగా అభిమానిస్తున్న వారందరికి కృతజ్ఞతలు.

‘సంచిక’కు సాహిత్యం తప్ప మరొకటి పట్టదు. ‘సంచిక’ దృష్టిలో రచయితే రాజు. రచనకే ప్రాధాన్యం. పాఠకులకు మరింత మెరుగైన రచనలను అందించేందుకు రచయితల సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తోంది ‘సంచిక’. అందుకే రచయితల సమావేశాలని నిర్వహించాలని తలచింది ‘సంచిక’.

సంచిక – స్వాధ్యాయ సంయుక్తంగా నిర్వహించబోయే రచయితల సమావేశాలలో మొదటి సమావేశం 01-మే-2022 నాడు నారపల్లి లోని స్వాధ్యాయ రీసెర్చ్ సెంటర్‍లో జరుగుతుంది. ఈ సమావేశంలో రచనలలోని సాధక బాధకాలు, రచనలను ఆసక్తికరంగా రచించటం, పాఠకులను ఆకర్షించి, ఆమోదం పొందటం వంటి విషయాల గురించి చర్చలు జరుగుతాయి.

రాబోయే కాలంలో కూడా విశిష్టమయిన రచనలతో, వినూత్నమయిన శీర్షికలతో, ఉన్నత ప్రామాణికాలు పాటిస్తూ ‘సంచిక’ ముందుకు సాగుతుంది. ఇందుకు, సాహిత్యాభిమానులందరి సహాయ సహకారాలను అభ్యర్థిస్తోంది.

~

ఎప్పటిలానే వ్యాసాలు, కాలమ్స్, కథలు, కవితలు, గళ్ళనుడి కట్టు, పిల్లల కథలు, ఇతర రచనలతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ మే 2022 సంచిక.

1 మే 2022 నాటి ‘సంచిక’లోని రచనలు:

సంభాషణం:

సీరియల్స్:

కాలమ్స్:

భక్తి:

గళ్ళ నుడికట్టు:

వ్యాసాలు:

కవితలు:

కథలు:

పుస్తకాలు:

సినిమాలు/వెబ్ సిరీస్:

బాల సంచిక:

అవీ ఇవీ:

సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము.

సంపాదక బృందం.

Exit mobile version