[dropcap]‘సం[/dropcap]చిక’ – తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు వందనాలు. సంచికను ఆదరిస్తున్న వారందరికి నమస్సులు.
పాఠకులకు విభిన్నమయిన రచనలను అందించాలని ‘సంచిక’ పత్రిక నిరంతరం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో భాగంగా ఇటీవలే భారతరత్న డా. మోక్షగుండం విశ్వేశ్వరాయ జీవితచరిత్ర అనువాదాన్ని, ప్రముఖ గాంధేయవాది డా. హెచ్. నరసింహయ్య ఆత్మకథ అనువాదాన్ని పాఠకులకు అందిస్తోంది. పరిశోధనాత్మక రచనలను పాఠకులకు అందించే లక్ష్యంలో భాగంగా డా. మంత్రవాది గీతా గాయత్రి గారు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి పిహెచ్‍డి పట్టా కోసం సమర్పించిన సిద్ధాంత వ్యాసం ‘కాకతీయ యుగంలో స్త్రీల సామాజిక స్థితిగతులు – ఒక పరిశీలన’ ను ధారావాహికంగా అందిస్తోంది. మరొకొన్ని సాంఘిక నవలలు కూడా త్వరలో ధారావాహికంగా రానున్నాయి.
చదువరుల ఆదరణను మరింతగా పొందేందుకు కొత్త కొత్త ఫీచర్లు, సీరియల్స్, కథలకు ఆహ్వానం పలుకుతోంది ‘సంచిక’.
సంచిక స్వాధ్యాయ సంయుక్తంగా ఇటీవల రచయితల సమావేశం నిర్వహించి – ‘సంచిక’ను మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి ‘సంచిక’ చేపట్టబోయే కొత్త కార్యాచరణలను చర్చించి, వారి సహకారం కోరింది. వీలైనంత తరచుగా రచయితలతో సమావేశం అవుతూ కార్యక్రమాల గురించి చర్చిస్తూండాలని ‘సంచిక’ భావిస్తోంది.
‘సంచిక’ ప్రచురించిన ‘రామకథాసుధ’ కథా సంకలనం విడుదలై పాఠకాదరణ పొందుతున్నందకు రచయితలకు, పాఠకులకు సంచిక ధన్యవాదాలు తెలుపుతోంది.
ఎప్పటిలానే వ్యాసాలు, కాలమ్స్, కథలు, కవితలు, పుస్తక సమీక్ష, గళ్ళనుడి కట్టు, ఇంటర్వ్యూ, పిల్లల కథ లతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ 1 మే 2023 సంచిక.
1 మే 2023 నాటి ‘సంచిక’లోని రచనలు:
సంభాషణం:
- కవి శ్రీ మోకా రత్నరాజు అంతరంగ ఆవిష్కరణ – డా. కె.ఎల్.వి. ప్రసాద్
కాలమ్స్:
- సంచిక విశ్వవేదిక – విశ్వవీధుల్లో…13 – వి. శాంతిప్రబోధ – సారధి మోటమఱ్ఱి
- సంచిక విశ్వవేదిక – తెలుగు అసోసియేషన్, సిడ్నీ వారి 30 సంవత్సరాల వార్షికోత్సవ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ – సారధి మోటమఱ్ఱి
గళ్ళ నుడికట్టు:
- సంచిక-పదప్రహేళిక- మే 2023 – దినవహి సత్యవతి
వ్యాసాలు:
- అమ్మ కడుపు చల్లగా -38 – ఆర్. లక్ష్మి
కథలు:
- నగరంలో మరమానవి-8 – చిత్తర్వు మధు
- కేశ సునామీ తైలం – గంగాధర్ వడ్లమాన్నాటి
- బుచ్చిబాబు – నల్ల భూమయ్య
- కృష్ణ లీలలు – శ్యామ్ కుమార్ చాగల్
కవితలు:
- ఆశల దీపం – శ్రీధర్ చౌడారపు
- అయినా సరే! – డా. విజయ్ కోగంటి
- మరాళి – డా. బాలాజీ దీక్షితులు పి.వి.
- రైతన్న పంటకు లేదా R.P.? – ఆర్.వి. చారి
బాలసంచిక:
- పౌర్ణమి వంట – కంచనపల్లి వేంకటకృష్ణారావు
పుస్తకాలు:
- ఆధ్యాత్మిక తృప్తిని కలిగించే ‘కుంభకోణం యాత్ర’ – పుస్తక సమీక్ష – కొల్లూరి సోమ శంకర్
సంచిక ప్రకటనలు:
- విభిన్నమయిన రచనలు చేయాలనుకునేవారికి ఆహ్వానం – సంచిక టీమ్
అవీ ఇవీ:
- జడ భరతుని కథ – అంబడిపూడి శ్యామసుందర రావు
- సాగర్ – సోర్ పుస్తకావిష్కరణ సభకు ఆహ్వానం – సంచిక టీమ్
- బాల సాహిత్య మేటి కవయిత్రి – డా. చీదెళ్ళ సీతాలక్ష్మి
- ఇయర్‌హుక్-వ్యాఖ్య-రైటర్స్ వర్క్‌షాప్ 5 – ప్రకటన – సంచిక టీమ్
సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము.
సంపాదక బృందం.