Site icon Sanchika

సంపాదకీయం నవంబర్ 2024

[dropcap]‘సం[/dropcap]చిక’ – తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు వందనాలు. సంచికను ఆదరిస్తున్న వారందరికి కృతజ్ఞతలు.

పాఠకులకు విశిష్టమైన, విభిన్నమైన రచనలు అందించేందుకు ‘సంచిక’ చేస్తున్న నిరంతర కృషి కొనసాగుతోంది.

దీపావళి సందర్భంగా ‘సంచిక’ – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీని విజయవంతం చేసిన రచయితలందరికి పేరు పేరునా ధన్యవాదాలు. బహుమతులకి ఎంపికైన కథలు, సాధారణ ప్రచురణకు ఎంపికైన కథల జాబితా ప్రకటించాము. విజేతలకు ప్రైజ్ మనీ పంపేశాము. ఈ కథలను త్వరలో ‘సంచిక’లో ప్రచురిస్తాము.

కథల పోటీలు విజయవంతమైన నేపథ్యంలో, ‘సంచిక’ – డా. అమృతలత, సాహితీ ప్రచురణల సహకారంతో మరో పోటీని త్వరలో ప్రకటించనుంది. పద్యకావ్యాలకు, వచనకావ్యాలకు సంబంధించిన ఈ పోటీ వివరాలు త్వరలో వెల్లడిస్తాము.

‘సంచిక’ ప్రచురించి, సంకలనం చేయదలచిన ‘సైనిక కథలు’ పుస్తకం పని మొదలయింది. కొత్తగా రాసిన కథలు, ఇప్పటికే ప్రచురితమైన సైనిక కథలు అందాయి. ఎంపిక ప్రక్రియ ప్రారంభమయింది. వీలైనంత తొందరలో ఈ సంకలనంలోని కథల జాబితాను ప్రకటిస్తాము.

‘సంచిక’లో ప్రచురితమయ్యే రచనలు విభిన్న దృక్కోణాలకు, భిన్న స్వరాలకు వేదిక లవుతున్న సంగతి పాఠకులకు తెలిసిందే. ఈ నెల రెండో వారం నుంచి ‘సంచిక’ వారపత్రికలో శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన నవల ‘శ్రీమద్రమారమణ’ ధారావాహికంగా ప్రచురితమవనుంది. డల్లాస్ లోని సిరికోన సంస్థ నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా నిర్వహించిన పోటీలలో (2023) బహుమతి పొందిన ఈ నవల  పాఠకులను ఆకట్టుకుంటుందని భావిస్తున్నాము.

త్వరలోనే ఒక హిస్టారికల్ ఫిక్షన్‍ను ధారావాహికంగా ప్రచురించనున్నాము. వివరాలు అతి త్వరలో.

పాఠకుల ఆదరణను మరింతగా పొందేందుకు కొత్త కొత్త ఫీచర్లు, సీరియల్స్, కథలకు ఆహ్వానం పలుకుతోంది ‘సంచిక’.

ఆంగ్ల విభాగంలో ఈ నెల – ముగ్గురు కవుల మూడు కవితలను అందిస్తున్నాము.

ఎప్పటిలానే ఇంటర్వ్యూ, కాలమ్స్, వ్యాసాలు, కథలు, కవితలు, పుస్తక సమీక్ష, గళ్ళనుడి కట్టు, పిల్లల కథ, పరిశోధనా రచన, ఇతర రచనలతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ 1 నవంబర్ 2024 సంచిక.

1 నవంబర్ 2024 నాటి ‘సంచిక మాసపత్రిక’లోని రచనలు:

సంభాషణం

ధారావాహిక:

కాలమ్స్:

పరిశోధనా గ్రంథం:

గళ్ళ నుడికట్టు:

వ్యాసాలు:

కథలు:

కవితలు:

పుస్తకాలు:

బాలసంచిక:

అవీ ఇవీ:

English Section:

~

సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము.

సంపాదక బృందం.

Exit mobile version