సంపాదకీయం నవంబర్ 2024

1
14

[dropcap]‘సం[/dropcap]చిక’ – తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు వందనాలు. సంచికను ఆదరిస్తున్న వారందరికి కృతజ్ఞతలు.

పాఠకులకు విశిష్టమైన, విభిన్నమైన రచనలు అందించేందుకు ‘సంచిక’ చేస్తున్న నిరంతర కృషి కొనసాగుతోంది.

దీపావళి సందర్భంగా ‘సంచిక’ – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీని విజయవంతం చేసిన రచయితలందరికి పేరు పేరునా ధన్యవాదాలు. బహుమతులకి ఎంపికైన కథలు, సాధారణ ప్రచురణకు ఎంపికైన కథల జాబితా ప్రకటించాము. విజేతలకు ప్రైజ్ మనీ పంపేశాము. ఈ కథలను త్వరలో ‘సంచిక’లో ప్రచురిస్తాము.

కథల పోటీలు విజయవంతమైన నేపథ్యంలో, ‘సంచిక’ – డా. అమృతలత, సాహితీ ప్రచురణల సహకారంతో మరో పోటీని త్వరలో ప్రకటించనుంది. పద్యకావ్యాలకు, వచనకావ్యాలకు సంబంధించిన ఈ పోటీ వివరాలు త్వరలో వెల్లడిస్తాము.

‘సంచిక’ ప్రచురించి, సంకలనం చేయదలచిన ‘సైనిక కథలు’ పుస్తకం పని మొదలయింది. కొత్తగా రాసిన కథలు, ఇప్పటికే ప్రచురితమైన సైనిక కథలు అందాయి. ఎంపిక ప్రక్రియ ప్రారంభమయింది. వీలైనంత తొందరలో ఈ సంకలనంలోని కథల జాబితాను ప్రకటిస్తాము.

‘సంచిక’లో ప్రచురితమయ్యే రచనలు విభిన్న దృక్కోణాలకు, భిన్న స్వరాలకు వేదిక లవుతున్న సంగతి పాఠకులకు తెలిసిందే. ఈ నెల రెండో వారం నుంచి ‘సంచిక’ వారపత్రికలో శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన నవల ‘శ్రీమద్రమారమణ’ ధారావాహికంగా ప్రచురితమవనుంది. డల్లాస్ లోని సిరికోన సంస్థ నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా నిర్వహించిన పోటీలలో (2023) బహుమతి పొందిన ఈ నవల  పాఠకులను ఆకట్టుకుంటుందని భావిస్తున్నాము.

త్వరలోనే ఒక హిస్టారికల్ ఫిక్షన్‍ను ధారావాహికంగా ప్రచురించనున్నాము. వివరాలు అతి త్వరలో.

పాఠకుల ఆదరణను మరింతగా పొందేందుకు కొత్త కొత్త ఫీచర్లు, సీరియల్స్, కథలకు ఆహ్వానం పలుకుతోంది ‘సంచిక’.

ఆంగ్ల విభాగంలో ఈ నెల – ముగ్గురు కవుల మూడు కవితలను అందిస్తున్నాము.

ఎప్పటిలానే ఇంటర్వ్యూ, కాలమ్స్, వ్యాసాలు, కథలు, కవితలు, పుస్తక సమీక్ష, గళ్ళనుడి కట్టు, పిల్లల కథ, పరిశోధనా రచన, ఇతర రచనలతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ 1 నవంబర్ 2024 సంచిక.

1 నవంబర్ 2024 నాటి ‘సంచిక మాసపత్రిక’లోని రచనలు:

సంభాషణం

  • వైద్యులు, కవి, అనువాదకులు డా. టి.రాధాకృష్ణమాచార్యులు అంతరంగ ఆవిష్కరణ – డా. ప్రసాద్ కె. ఎల్. వి.

ధారావాహిక:

  • ఆరోహణ-3 – ఆంగ్ల మూలం: సాధనా శంకర్, అనువాదం: కొల్లూరి సోమ శంకర్

కాలమ్స్:

  • శ్రీ మహా భారతంలో మంచి కథలు-15 – కుంతి
  • సగటు మనిషి స్వగతం-6 – సగటు మనిషి
  • వందే గురు పరంపరామ్ – 3 – చివుకుల శ్రీలక్ష్మి

పరిశోధనా గ్రంథం:

  • శతసహస్ర నరనారీ హృదయనేత్రి, భరత ధాత్రి!-7 – పాణ్యం దత్తశర్మ

గళ్ళ నుడికట్టు:

  • సంచిక-పదప్రహేళిక- నవంబర్ 2024 – టి. రామలింగయ్య

వ్యాసాలు:

  • అమ్మ కడుపు చల్లగా – 56 – ఆర్. లక్ష్మి
  • కాటూరివారి పౌలస్త్య హృదయము -ఎం.వి.ఎస్. రంగనాధం

కథలు:

  • తామరాకు మీద నీటిబొట్టు – శ్రీపతి లలిత
  • కొంచెం మసాలాతో – గంగాధర్ వడ్లమన్నాటి

కవితలు:

  • కంచికెళ్ళిన కొత్తకథ – శ్రీధర్ చౌడారపు
  • కొత్త కలం – ప్రొఫెసర్ నరసయ్య పంజాల
  • ఇదేకదా జీవితం – డా. మైలవరం చంద్ర శేఖర్

పుస్తకాలు:

  • నీరజ్ జ్ఞాపకాల బిడారు – పుస్తక సమీక్ష – డా. వసంత టి. సి.
  • సంక్లిష్టమైన జీవనయానానికి ప్రతీక హరీష్ కవిత – పుస్తక సమీక్ష – గోపగాని రవీందర్
  • పరిమళ భరితంగా వీచే మాండలికపు సొబగులు ప్రొ. మహాసముద్రం దేవకి గారి రచనలు – పుస్తక పరిచయం – శీలా సుభద్రాదేవి

బాలసంచిక:

  • కథల పుస్తకం – కంచనపల్లి వేంకటకృష్ణారావు

అవీ ఇవీ:

  • యువభారతి సంస్థ తలపెట్టిన ‘తెలుగు వెలుగు’ సమాఖ్య కార్యక్రమాలు – ప్రకటన – డా. ఆచార్య ఫణీంద్ర

English Section:

  • The Life is.. – Poem – Dr. T. Radhakrishnamacharyulu
  • The Celestial Theatre – Poem – Samudrala Hariskrishna
  • You Can Sleep 😴 – Poem – T. S. S. Murty

~

సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము.

సంపాదక బృందం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here