Site icon Sanchika

సంపాదకీయం అక్టోబర్ 2024

[dropcap]‘సం[/dropcap]చిక’ – తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు ప్రణామాలు. సంచికను ఆదరిస్తున్న వారందరికి కృతజ్ఞతలు.

పాఠకులకు విశిష్టమైన, విభిన్నమైన రచనలు అందించేందుకు ‘సంచిక’ చేస్తున్న నిరంతర కృషి కొనసాగుతోంది.

‘సంచిక’లో ప్రచురితమయ్యే రచనలు విభిన్న దృక్కోణాలకు, భిన్న స్వరాలకు వేదిక లవుతున్నాయి.

పాఠకుల ఆదరణను మరింతగా పొందేందుకు కొత్త కొత్త ఫీచర్లు, సీరియల్స్, కథలకు ఆహ్వానం పలుకుతోంది ‘సంచిక’.

‘సంచిక’ ప్రచురించి, సంకలనం చేయదలచిన ‘సైనిక కథలు’ పుస్తకానికి కథలు పంపపల్సిన గడువు ముగిసింది. కొత్తగా రాసిన కథలు, ఇప్పటికే ప్రచురితమైన సైనిక కథలు అందాయి. ఎంపిక ప్రక్రియ ప్రారంభమయింది..

అలాగే, డా. అమృతలత-సంచిక సంయుక్తంగా నిర్వహిస్తున్న దీపావళి కథల పోటీకి కథలు పంపపల్సిన గడువు ముగిసింది. ఈ పోటీకి అనూహ్య స్పందన వచ్చింది. వర్ధమాన, సీనియర్ రచయితలు తమ తమ కథలను పంపారు. కథలను ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతోంది.

వచ్చే వారం నుంచి ‘సంచిక’ వారపత్రికలో శ్రీ సలీం రచించిన సైన్స్ ఫిక్షన్ మినీ నవల ‘చంద్రునికో నూలుపోగు’ ధారావాహికంగా ప్రచురితమవనుంది. పిల్లల సైన్స్ ఫిక్షన్ పోటీలలో బహుమతి పొందిన ఈ నవలిక పెద్దలను సైతం ఆకట్టుకుంటుందని భావిస్తున్నాము.

ఆంగ్ల విభాగంలో ఈ నెల – ముగ్గురు కవుల మూడు కవితలను అందిస్తున్నాము.

ఎప్పటిలానే ఇంటర్వ్యూ, కాలమ్స్, వ్యాసాలు, కథలు, కవితలు, పుస్తక సమీక్ష, గళ్ళనుడి కట్టు, పిల్లల కథ, పరిశోధనా రచన, ఇతర రచనలతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ 1 అక్టోబర్ 2024 సంచిక.

1 అక్టోబర్ 2024 నాటి ‘సంచిక మాసపత్రిక’లోని రచనలు:

ధారావాహిక:

కాలమ్స్:

పరిశోధనా గ్రంథం:

గళ్ళ నుడికట్టు:

వ్యాసాలు:

కథలు:

కవితలు:

పుస్తకాలు:

బాలసంచిక:

అవీ ఇవీ:

English Section:

~

సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము.

సంపాదక బృందం.

Exit mobile version