సంపాదకీయం అక్టోబర్ 2024

0
14

[dropcap]‘సం[/dropcap]చిక’ – తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు ప్రణామాలు. సంచికను ఆదరిస్తున్న వారందరికి కృతజ్ఞతలు.

పాఠకులకు విశిష్టమైన, విభిన్నమైన రచనలు అందించేందుకు ‘సంచిక’ చేస్తున్న నిరంతర కృషి కొనసాగుతోంది.

‘సంచిక’లో ప్రచురితమయ్యే రచనలు విభిన్న దృక్కోణాలకు, భిన్న స్వరాలకు వేదిక లవుతున్నాయి.

పాఠకుల ఆదరణను మరింతగా పొందేందుకు కొత్త కొత్త ఫీచర్లు, సీరియల్స్, కథలకు ఆహ్వానం పలుకుతోంది ‘సంచిక’.

‘సంచిక’ ప్రచురించి, సంకలనం చేయదలచిన ‘సైనిక కథలు’ పుస్తకానికి కథలు పంపపల్సిన గడువు ముగిసింది. కొత్తగా రాసిన కథలు, ఇప్పటికే ప్రచురితమైన సైనిక కథలు అందాయి. ఎంపిక ప్రక్రియ ప్రారంభమయింది..

అలాగే, డా. అమృతలత-సంచిక సంయుక్తంగా నిర్వహిస్తున్న దీపావళి కథల పోటీకి కథలు పంపపల్సిన గడువు ముగిసింది. ఈ పోటీకి అనూహ్య స్పందన వచ్చింది. వర్ధమాన, సీనియర్ రచయితలు తమ తమ కథలను పంపారు. కథలను ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతోంది.

వచ్చే వారం నుంచి ‘సంచిక’ వారపత్రికలో శ్రీ సలీం రచించిన సైన్స్ ఫిక్షన్ మినీ నవల ‘చంద్రునికో నూలుపోగు’ ధారావాహికంగా ప్రచురితమవనుంది. పిల్లల సైన్స్ ఫిక్షన్ పోటీలలో బహుమతి పొందిన ఈ నవలిక పెద్దలను సైతం ఆకట్టుకుంటుందని భావిస్తున్నాము.

ఆంగ్ల విభాగంలో ఈ నెల – ముగ్గురు కవుల మూడు కవితలను అందిస్తున్నాము.

ఎప్పటిలానే ఇంటర్వ్యూ, కాలమ్స్, వ్యాసాలు, కథలు, కవితలు, పుస్తక సమీక్ష, గళ్ళనుడి కట్టు, పిల్లల కథ, పరిశోధనా రచన, ఇతర రచనలతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ 1 అక్టోబర్ 2024 సంచిక.

1 అక్టోబర్ 2024 నాటి ‘సంచిక మాసపత్రిక’లోని రచనలు:

ధారావాహిక:

  • ఆరోహణ-3 – ఆంగ్ల మూలం: సాధనా శంకర్, అనువాదం: కొల్లూరి సోమ శంకర్

కాలమ్స్:

  • శ్రీ మహా భారతంలో మంచి కథలు-14 – కుంతి
  • సగటు మనిషి స్వగతం-5 – సగటు మనిషి
  • వందే గురు పరంపరా – 2 – చివుకుల శ్రీలక్ష్మి

పరిశోధనా గ్రంథం:

  • శతసహస్ర నరనారీ హృదయనేత్రి, భరత ధాత్రి!-6 – పాణ్యం దత్తశర్మ

గళ్ళ నుడికట్టు:

  • సంచిక-పదప్రహేళిక- అక్టోబర్ 2024 – టి. రామలింగయ్య

వ్యాసాలు:

  • అమ్మ కడుపు చల్లగా – 55 – ఆర్. లక్ష్మి

కథలు:

  • బీ ఐ – ఆసూరి హనుమత్ సూరి
  • ఆ మాట కోసం – గంగాధర్ వడ్లమన్నాటి

కవితలు:

  • రైలూ.. జీవితమే – శ్రీధర్ చౌడారపు
  • జన్మదిన కానుక – ప్రొఫెసర్ నరసయ్య పంజాల
  • ఎప్పుడు? ఎప్పుడు? – కల్లూరు జానకిరామరావు

పుస్తకాలు:

  • ‘భవబంధాలు’ పంచే కథా మకరందాలు – పుస్తక సమీక్ష – వారణాసి నాగలక్ష్మి
  • అసామాన్యమైన అద్భుతం అమృతలత – పుస్తక పరిచయం – శీలా సుభద్రాదేవి

బాలసంచిక:

  • అనంతుడి వీణ – కంచనపల్లి వేంకటకృష్ణారావు

అవీ ఇవీ:

  • భావ కవితల పాలవెల్లి.. ఆంధ్రా షెల్లీ – చంద్రకళ దీకొండ

English Section:

  • Me the Traveller – Poem – Dr. T. Radhakrishnamacharyulu
  • Cost of Dying! – Poem – Samudrala Hariskrishna
  • They Have Lived Their Life! – Poem – T. S. S. Murty

~

సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము.

సంపాదక బృందం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here