సంపాదకీయం అక్టోబరు 2018

2
5

సంచిక వెబ్ పత్రికకు అమితమైన ఆదరణ లభిస్తోంది. కొత్త కొత్త శీర్షికలతో, రచనలతో పాఠకులకు ఆనందం కలిగిస్తూ, ఆలోచింపచేయాలన్న తపనను సంచిక బృందంలో కలిగిస్తోంది ఈ పాఠకాదరణ.

సంచిక ప్రకటించిన కవితల పోటీకి మంచి స్పందన వచ్చింది. అక్టోబరు రెండో వారం నుంచి ఈ కవితలు సంచికలో ప్రచురితమవుతాయి. న్యాయ నిర్ణేతలు ఎంపికచేసిన కవితలకీ, పాఠకులు ఎంపికచేసిన కవితలకీ బహుమతులుంటాయి. పోటీకి వచ్చిన ప్రతి కవితను పాఠకులకు రచయిత పేరు లేకుండా నెంబరుతో అందించడం జరుగుతుంది. పాఠకులు తమకు నచ్చిన  కవిత నెంబరు ఎంచుకోవాల్సి ఉంటుంది. పాఠకులు ఎలా ఓటింగ్‌లో పాల్గొనాలో త్వరగా తెలియజేస్తాము. ఓటింగ్ చేసే పాఠకులు విధిగా సంచికను సబ్‌స్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా ఉచితం. సబ్‌స్క్రైబ్ చేయని పాఠకులు ఓటింగ్‍కి అనర్హులు.

కథల పోటీకి కూడా చక్కని స్పందన వచ్చింది. వివరాలు త్వరలో.

ఈనెల రెండో వారం నుంచి యువ రచయిత వేటూరి ఆనంద్ రాసిన సీరియల్ ప్రారంభమవుతుంది.

బలభద్రపాత్రుని రమణి, సినీ గేయరచయిత భువనచంద్ర, చావా శివకోటి సంచిక కోసం ప్రత్యేకంగా రాసిన సీరియల్స్ త్వరలో ఆరంభమవుతాయి. ఘండికోట బ్రహ్మాజీరావు గారి చివరి రచన అముద్రితము అయిన చరిత్రాత్మక నవల ‘శ్రీపర్వతం’ కూడా త్వరలో ఆరంభమవుతుంది.

అక్టోబరు 2018 లోని రచనలు

సంపాదకీయం

ప్రత్యేక వ్యాసం:

స్వామీ వివేకానంద, మహాత్మా గాంధీల దృక్పథంలో ‘మనిషి’ – శౌరిబంధు కర్, కొల్లూరి సోమ శంకర్

ధారావాహికలు:

జీవన రమణీయం-26 – బలభద్రపాత్రుని రమణి

భూమి నుంచి ప్లూటో దాకా… – 18 – మధు చిత్తర్వు

అంతరం-2 – స్వాతీ శ్రీపాద

తమసోమా జ్యోతిర్గమయ -3 – గంటి భానుమతి

నీలమత పురాణం-4- కస్తూరి మురళీకృష్ణ

వ్యాసాలు:

“విశ్వనాథ వాఙ్మయాధ్యయనం – సమన్విత దృక్పథం” – కోవెల సుప్రసన్నాచార్య

“యుగపురుషుడు జాతిపిత” – ఎ. మోహన్ మురళి కుమార్

ఐరన్ లేడీ థాచర్ – ఎన్.వి.ఎస్.ఎస్. ప్రకాశరావు

తెలుగు కవుల కుకవినిందలు – దాసరి సుబ్రహ్మణ్యేశ్వర రావు

కాలమ్స్:

ఆకాశవాణి పరిమళాలు-26 – డా. రేవూరు అనంతపద్మనాభ రావు

మనసులో మనసా – 9 – మన్నెం శారద

కాజాల్లాంటి బాజాలు-13 – జి.ఎస్.లక్ష్మి

రంగుల హేల-7: సువాసనలూ – జ్ఞాపకాలూ – అల్లూరి గౌరి లక్ష్మి

ఫోన్ నెంబర్ ఇవ్వకండి ప్లీజ్ – సలీం కల్పిక – సలీం

మానస సంచరరే-6 – జె. శ్యామల

ప్రయాణం:

అండమాన్ అనుభూతులు -7- ఎన్.వి. హనుమంతరావు

భక్తి పర్యటన:

గుంటూరు జిల్లా యాత్ర – 11: అందాల అమరారామం – పి.యస్.యమ్. లక్ష్మి

భక్తి:

దివి నుంచి భువికి దిగివచ్చిన దేవతలు -2 – డా. ఎం. ప్రభావతి దేవి

కథలు:

పార్ధల  – అత్తలూరి విజయలక్ష్మి

అంతరాత్మ తీర్పు – డా. తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం

అంతర్వేగం – ఆర్. దమయంతి

స్నేహితునికి లేఖ – చివుకుల శ్రీలక్ష్మి

కవితలు:

ఎంత మధురం… ఎంతెంత మధురం – శ్రీధర్ చౌడారపు

ఈ సాయంత్రపు వేళ – డా. విజయ్ కోగంటి

ఆ కళ్ళు – సుజాత తిమ్మన

తెలిసొచ్చింది – జయంతి వాసరచెట్ల

బాలసంచిక:

పిల్ల నక్క తెలివి – కైపు ఆదిశేషా రెడ్డి

కుందేలు – పెసరట్లు : శంకరప్రసాద్

అర్హత మేరకు ఆదరణ – ఆదూరి హైమవతి

సీతాకోకచిలుకలు – డి. చాముండేశ్వరి

అర్జునుడి తీర్ధయాత్ర -డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

పుస్తక పరిచయాలు:

మాయ జలతారు

‘చక్కా’ వారి వ్యతిరేకార్థక పదకోశము

అవీ ఇవీ:

నేడే చూడండి – పొన్నాడ సత్యప్రకాశరావు

చిత్రం భళారే విచిత్రం – ఆనందరావు పట్నాయక్

ఆమె మన హృదయాలనూ, ఆత్మనూ అల్లుకుంది – పరేష్ ఎన్. దోషి

సభలు:

గాంధీజీ విగ్రహావిష్కరణ సభ – ఎన్.కె. బాబు

కార్టూన్లు:

కె.వి. సుబ్రహ్మణ్యం

ఎం. ఎం. మురళి

‘సంచిక’కు రచయితలు తమ విభిన్నమైన, విశిష్టమైన రచనలు విస్తృతంగా పంపి ‘సంచిక’ పాఠకులను అలరించడంలో తోడ్పడుతారని ఆశిస్తున్నాము. పాఠకులు తమ అభిప్రాయాలు, సలహాలు, సూచనలతో ‘సంచిక’ను మరింత ఆకర్షణీయం చేసి పాఠకులకు మరింత చేరువ చేయడంలో తోడ్పడాలని విన్నపం.

ఈ నెల ‘సంచిక’ మిమ్మల్ని అలరిస్తుందన్న ఆశతో…

సంపాదక వర్గం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here