Site icon Sanchika

సంపాదకీయం అక్టోబరు 2023

[dropcap]‘సం[/dropcap]చిక’ – తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు ప్రణామాలు. సంచికను ఆదరిస్తున్న వారందరికి ధన్యవాదాలు.

పాఠకులకు విభిన్నమయిన రచనలను అందించాలని ‘సంచిక’ పత్రిక నిరంతరం ప్రయత్నిస్తోంది.

ఇందులో భాగంలో ఇటీవల ఆంగ్లంలో కథలను, ప్రత్యేక ఇంటర్వ్యూలను అందించడం జరిగింది. 24 సెప్టెంబరు 2023 నాటి సంచికలో ఒక చక్కని తెలుగు కవితని, ఆంగ్లంలోకీ,  హిందీ లోని అనువదింపజేసి – మూడు భాషలలోనూ ఒకేసారి ప్రచురించాము. ఈ ప్రయోగం పాఠకులను ఆకట్టుకున్నందున భవిష్యత్తులో హిందీ లోనూ రచనలు అందించాలని ఆలోచిస్తున్నాము. ఆంగ్లంలో కథలు మాత్రమే కాకుండా వైవిధ్యభరితమైన రచనలను ప్రచురించదలచాము. ఈ క్రమంలో భాగంగా ఈ నెల సంచికలో కె. శ్రీనివాస రాఘవ – దక్షిణామూర్తి శ్లోకంపై ఆంగ్లంలో రచించిన విశ్లేషణా వ్యాసాన్ని అందిస్తున్నాము.

సంచికలో పుస్తక సమీక్షలతో పాటుగా – రచయిత/ప్రచురణకర్తల ప్రత్యేక ఇంటర్వ్యూలని కొనసాగిస్తూ – ఈ సంచికలో శ్రీ జోశ్యుల సూర్యప్రకాశ్ గారి ఇంటర్వ్యూని అందిస్తున్నాము.

పాఠకుల ఆదరణను మరింతగా పొందేందుకు గాను కొత్త కొత్త ఫీచర్లు, సీరియల్స్, కథలకు ఆహ్వానం పలుకుతోంది ‘సంచిక’.

ఉత్తమ సాహిత్యాన్ని ఉత్తమరీతిలో పాఠకులకు చేరువ చేయాలన్న సంచిక ప్రయత్నాన్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాము.

ఎప్పటిలానే సీరియల్స్, వ్యాసాలు, కాలమ్స్, కథలు, కవితలు, పుస్తక సమీక్ష, గళ్ళనుడి కట్టు, ఇంటర్వ్యూ, సినిమాలు, ఆత్మకథ, పరిశోధనా గ్రంథాలు, ట్రావెలాగ్, పిల్లల కథలు, ప్రకటనలు, పురస్కారాల వార్తలతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ 1 అక్టోబర్ 2023 సంచిక.

1 అక్టోబర్ 2023 నాటి ‘సంచిక’లోని రచనలు:

ప్రత్యేక ఇంటర్వ్యూ:

ప్రత్యేక వ్యాసం:

సంభాషణం:

సీరియల్స్:

కాలమ్స్:

స్వీయ చరిత్ర/ఆత్మకథ:

భక్తి:

గళ్ళ నుడికట్టు:

వ్యాసాలు:

కవితలు:

పద్య కావ్యం:

కథలు:

పరిశోధనా గ్రంథం/థీసిస్:

పుస్తకాలు:

ప్రయాణం:

సినిమాలు/వెబ్ సిరీస్:

బాల సంచిక:

అవీ ఇవీ:

సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము.

సంపాదక బృందం.

Exit mobile version