సంపాదకీయం సెప్టెంబరు 2020

0
7

[dropcap]తె[/dropcap]లుగు సాహిత్య ప్రపంచంలో తనదైన ప్రత్యేక స్థానాన్ని, గుర్తింపును సాధించుకోవటంలో సంచికకు దోహదపడిన రచయితలకు, పాఠకులకు, శ్రేయోభిలాషులందరికీ బహు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇతర పత్రికల్లో ప్రచురితమయ్యేటటువంటి రచనలు సంచికలోనూ ప్రచురితమవుతాయి, కానీ, సంచికలో ప్రచురితమయ్యేటటువంటి రచనలు ఒక్క సంచికకే ప్రత్యేకం.. అన్న మాట వినబడటం.. సంచిక బాధ్యతను మరింతగా పెంచుతున్న అంశం.

సంచికకు పెరుగుతున్న పాఠకాదరణ, సంచిక అనగానే నాణ్యము, విభిన్నము అయిన విలువయిన రచనలుంటాయన్న విశ్వాసాన్ని నిలుపునేందుకు సంచిక చేస్తున్న ప్రయత్నంలో భాగమే త్వరలో ప్రచురితమయ్యే పలు విభిన్నమయిన రచనలు, శీర్షికలు.

విహారి సాహిత్య విశ్లేషణ శీర్షికకు లభిస్తున్న ఆదరణను పురస్కరించుకుని, త్వరలో రచయిత బీవీఎన్ స్వామి కథావిశ్లేషణ శీర్షికను కూడా ఆరంభిస్తున్నాము. ఈ శీర్షిక కూడా సాహిత్య పిపాసుల దాహార్తిని కొంతవరకయినా తీరుస్తుందని ఆశిస్తున్నాము. అలాగే, పాఠకాదరణ పొందుతున్న నీలమత పురాణం త్వరలో ముగుస్తోంది. ఆ స్థానంలో నీలమత పురాణానికి దీటయిన మరో రచన అనువాదాన్ని అందిస్తున్నాము. ఇంతవరకూ మనకు తెలియని మన చరిత్రను మనకు పరిచయంచేసే రచన అది.

ఈ నెల సంచికలో ప్రచురితమవుతున్న రచనల వివరాలివి

ప్రత్యేక వ్యాసం:

  • పివి నరసింహారావు – సృజనాత్మక రచన – విశ్లేషణలు – కస్తూరి మురళీకృష్ణ

కాలమ్:

  • రంగుల హేల 30 – అల్లూరి గౌరిలక్ష్మి

గళ్ళ నుడికట్టు:

  • పదప్రహేళిక -9- దినవహి సత్యవతి

వ్యాసాలు:

  • అమ్మ కడుపు చల్లగా -6 – ఆర్. లక్ష్మి
  • ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన హిందూ దేవాలయాలు – అంబడిపూడి శ్యామసుందరరావు

కథలు:

  • ఊరికిచ్చిన మాట – దాసరి శివకుమారి
  • తరంగాలు – డా. చెంగల్వ రామలక్ష్మి
  • ప్రసాదం – పినిశెట్టి శ్రీనివాసరావు
  • కనువిప్పు – ఝాన్సీ కొప్పిశెట్టి
  • హిమజ – నారుమంచి వాణీ ప్రభాకరి

కవితలు:

  • విలయ రహదారి – శ్రీధర్ చౌడారపు
  • ఎందుకని? – డా. కోగంటి విజయ్
  • మంచితనమే మనకు శ్రీరామరక్ష – గొర్రెపాటి శ్రీను
  • కట్టడితో మట్టు పెడదాం – పి.వి.ఎల్. సుజాత

నాటిక:

  • నా నవ్వు నాకు కావాలి – యలమర్తి అనూరాధ

బాలసంచిక:

  • ఒంటరితనం- కంచనపల్లి వేంకటకృష్ణారావు

ఇలా, పలు విభిన్నమయిన, కానీ, అత్యంత విలువయిన రచనలతో తెలుగు సాహిత్య లోకాన్ని మరింత పరిపుష్టం చేయాలన్న తపనతో సాగుతున్న సంచికకు, రచనల ద్వారా, సలహాలు, సూచనల ద్వారా, ఇతర పాఠకులను పరిచయం చేయటం ద్వారా సంచికను మరింతగా పాఠకులకు చేరువచేసే వీలు కల్పించాలని అభ్యర్ధిస్తున్నది సంచిక.

– సంపాదక బృందం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here