ఈ కుర్రోడు వెర్రోడు

0
5

[dropcap]ఈ [/dropcap]కుర్రోడు ఒక వెర్రోడు
తిడితే ముసి ముసిగా నవ్వుతాడు
తోటి పిల్లలు ఆటలాడుతుంటే
తను మాత్రం గట్డు మీద కూర్చుంటాడు
ఈ కుర్రోడు ఒక వెర్రోడు

అందరూ నిద్రించే వేళలో
వీడు మైదానంలో తిరుగుతాడు
అందరూ బయట గుమికూడే వేళ
ఇంటిలో ఒంటరిగా కూర్చుంటాడు
ఈ కుర్రోడు ఒక వెర్రోడు

జనాలు గుండెలవిసేలా ఏడుస్తుంటే
తను మాత్రం శిలలా కదలక ఉంటాడు
బయట జోరువాన కురుస్తుంటే
ఊరి చెరువులో ఈత కొడతాడు
ఈ కుర్రోడు ఒక వెర్రోడు

ఎప్పుడూ ఏడవడు, బెదరడు
ఎవరినీ ఏమీ అడగడు
అందరికీ అడిగినవి ఇస్తాడు
ఈ కుర్రోడు ఒక వెర్రోడు

ఎవరి మీద నిందలు మోపడు
ఏదీ ముందుగా చెప్పడు
ఎక్కువగా ఎవరితో మాట్లాడడు
ఎప్పుడూ మౌనంగా ఉంటాడు
ఈ కుర్రోడు ఒక వెర్రోడు…..

నీదీ నాదీ అని భేదం చూపడు
అన్నీ నాకే కావాలి అనడు
ఎవరితోనూ గొడవలు పడడు
ఈ కుర్రోడు ఒక వెర్రోడు

అమ్మా నాన్న ఎవరూ లేకపోయినా
ఆకాశం వైపు చూస్తూ ఎవరితోనో
మాట్లాడినట్టుగా కనిపిస్తుంటాడు
ఈ కుర్రోడు ఒక వెర్రోడు….

గుడికి ఎప్పుడూ వెళ్ళడు
గుడిసెలో ఒంటరిగా ఉంటాడు
బడిలో చదువుకో లేదు వీడు
ఈ కుర్రోడు ఒక వెర్రోడు….

ఆకాశమే తండ్రి అనుకుంటాడు
భూమాతను తన తల్లి అంటాడు
అన్ని జీవాలు సమానమే అంటాడు
ఈ కుర్రోడు ఒక వెర్రోడు….

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here