ఈ మట్టిలో..

0
12

[డా.టి.రాధాకృష్ణమాచార్యులు రచించిన ‘ఈ మట్టిలో..’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ఇ[/dropcap]న్నాళకుగాని తెలిసింది
ఈ మట్టిని ముద్దాడే నాకు

సకల కళలకు
ఊపిరి అందాల కళానిధి ఈ మట్టి గాలి
సర్వ శాస్త్ర సంపదలకు విజ్ఞాన గని
జీవికని

అక్షరం నేర్పిన స్పర్శ
వైద్యం చేసిన దయానిధి చెయ్యి
కవితా వైద్యసేవనే పయోనిధి

చూపుల కనుగవ జాడ ఇక్కడ
సుందర ప్రకృతి పరిచిన
చెట్టూ చేమల ఆనందం మట్టి మనసే

ఈ మట్టి మహిమ గొప్ప
వినగలిగే కనుల అంబర సంబరం
కనగలిగే చెవుల ఉత్తుంగ తరంగం

త్యాగాల అంతరాత్మ
మట్టి పుట్టుకదే
మనిషి వచ్చాకే మాలిన్యం మచ్చ పడెలే

మనిషిగా మనిషి బతికితేనే
స్వచ్ఛమైన గాలి స్వేచ్ఛ జీవించు
ఈ భూమి పొరల్లో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here