ఎక్కుపెట్టిన గన్

0
14

[మేజర్ శైతాన్ సింగ్ గారికి నివాళిగా ఈ కవితని అందిస్తున్నారు డా. సి. భవానీదేవి.]

[dropcap]ఆ[/dropcap] పరమవీరుని నుదుటి అరుణతిలకం
కుమాయూ రెజిమెంట్ హృదయంలా
కణకణలాడుతూనే ఉంది
ఆ సైనిక యూనిఫాంని తడిపేసిన రుధిరం
భరతపౌరుషానికి అంజలించిన చైనా దోసిలిలాఉంది
లడఖ్ రిజంగ్లా గుట్టలమాటున
పటిమ చాటిన మూడుసింహాల టోపీ
యావద్భారతాన్నీ
మోకరిల్లజేసుకుంది
ఉయ్యాల్లో ఉగ్గుతాగే పాలనవ్వులు
సరసనిశిలో కాలంపట్టని నవదంపతులు
వ్యాపారులు.. విద్యార్థులు.. పౌరులంతా
ఆ కనురెప్పలకింద కంటిపాపలౌతున్నప్పుడు
పదిహేనువేల అడుగుల ఎత్తున పోరాటంలో
కునుకెరుగని మన శైతాన్ సింగ్
తోటి జవాన్లను మళ్ళీ మళ్ళీ ఉత్తేజపరుస్తూ
ఎక్కుపెట్టిన గన్ లోకే ప్రాణం ధారపోసిన సింహవిక్రముడు
ఆ ధీశాలి కాళ్ళలో.. గుండెలో.. పొట్టలో
దిగబడిన పగవారి తూటాలకు
ఎన్ని గౌరవ పతకాలు ప్రకటిస్తే మాత్రం
ఆ దీపదానానికి సరితూగుతాయా!
ఎన్ని సెల్యూట్‌లు సమర్పిస్తే మాత్రం
ఆ మాతృరక్షకుడికి మహానివాళి అవుతుందా!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here