ఏం తెలుస్తుంది?

0
6

[dropcap]కృ[/dropcap]త్రిమ గర్భం నుండి
పుట్టిన ఆ అక్షరాలకి
ప్రకృతి గర్భం నుండి
జనించిన నా అక్షరాల
విలువ ఏం తెలుస్తుంది?

సిజేరియన్ నుండి
బైటొచ్చిన ఆ అక్షరాలకి
పురిటినొప్పులనుండి
ఉద్భవించిన నా అక్షరాల
బాధ ఏం తెలుస్తుంది?

కరెన్సీతో చదువు’కొన్న’
అహంకారపు ఆ అక్షరాలకి
స్వేచ్ఛతో చదువుకున్న
మమకారపు నా అక్షరాల
విధేయత ఏం తెలుస్తుంది?

ఆ అక్షరాలు
కార్పో’రేట్’వి అయితే
నా అక్షరాలు
సర్కార్‌వి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here