ఎన్నిక(ల)లు

4
8

[dropcap]ఎ[/dropcap]న్నికలు వస్తే-
జనావళికి ఎన్ని కలలో?
పేరు తెలియని
నాయకులందరు
పుట్టలోని చీమలదండులా-
జనాలపై వరాల
దండయాత్రతో
ఆశలపల్లకీని
మోస్తారు!!

అభివృద్ది అనే
ఊతపదం
నాయకుల నాలుకపై
నాని, నాని-
చెమ్మగిల్లి
సొమ్మసిల్లేలా
నాయకులు వాడుతారు
పాత హామీలకు
చెదలు దులుపుతారు!!

నిరంతర మంచినీరు-
స్థానంలో మద్యం
ప్రవహించి, జనాలను
చిత్తడిచేస్తుంది-
నాయకుల గత హామీలు మరచేలా
జనుల మస్తిష్కం
సారా సందడిలో
మునిగితేలడం
తథ్యమవుతుంది!!

ఎన్నికల ముగింపుతో
జనావళి మత్తుమాయం,
దండాలు పెట్టి
దండలు వేయించుకున్న
నాయకులు పలాయనం.
ఇదీనేటి ఎన్నికలతీరు-
ప్రజాస్వామ్యాన్ని
పరిహసిస్తున్న
ఓటు అనే ఆయుధం!!

పార్టీలను ఎండగట్టి-
నాయకులను శపించి-
ప్రయోజనం శూన్యం.
ఓటరులోని జడత్వం-
సాగినంతకాలం-
ఎన్నికలు ఎన్ని వచ్చినా-
అవి ఎన్నోకలలు గా
మిగిలిపోవడం-
భవిష్యభారతదృశ్యం!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here