‘కులం కథ’ పుస్తకం – ‘ఎర్ర లచ్చుప్ప’ – కథా విశ్లేషణ

0
10

[dropcap]కా[/dropcap]వలిలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు ‘కులం కథ‘ పుస్తకం చదివి తమకి నచ్చిన కథను విశ్లేషించి, ఆ కథ తమకెందుకు నచ్చించో పేర్కొన్నారు. సీనియర్ ఇంటర్ ఎంపిసి చదువుతున్న యమ్.సుజిత ఈ పుస్తకంలోని ‘ఎర్ర లచ్చుప్ప’ కథను విశ్లేషిస్తోంది.

***

‘ఎర్ర లచ్చుప్ప’ అనే కథను నంబూరి పరిపూర్ణ ఎంతో అద్భుతంగా ‘కులం కథ’ అనే పుస్తకం ద్వారా మనకి అందజేసారు.

ఈ కథ నాకు బాగా నచ్చింది. ఎందుకనగా లక్ష్మమ్మ చదువు లేకపోయిన సర్పంచ్ అయినది. ఆమె ఆ ఊరిని ఎంతో అభివృద్ధి చేసింది. ఆమెకి జిల్లా కలక్టర్ లక్షరూపాయల బహుమతిని అందించారు. ఆమె ఆ డబ్బుని గ్రామ అభివృద్ధి కోసం ఖర్చు చేసింది.

కాని ఆమె ఎన్ని చేసినా, చిన్నతనం నుండి కష్టాలు అనుభవించింది. ఆమెకు ఆరవ సంవత్సరంలోనే బాల్యవివాహం జరిగింది. ఎనిమిది ఏళ్ళ వయస్సులోనే భర్త చనిపోయాడు. చిన్న వయసు నుండే కష్టాలు అనుభవిస్తూ పెరగసాగింది. ఆమె పనులు కోసం పొరుగు ఊరు పోయి నాగభూషణం అనే వ్యక్తితో ప్రేమలో పడింది. చివరికి వాళ్ళు ఇద్దరు ఎన్నో సమస్యల తరువాత కలిసి ఉంటారు. నాగభూషణం డబ్బు మీద వ్యామోహంతో మరొక పెళ్ళి చేసుకోవాలి అని అనుకుంటాడు. అయిన లక్ష్మమ్మ మీద ప్రేమతో మరో పెళ్లి చేసుకోడు.

లక్ష్మమ్మ, నాగభూషణం కలసి ఉండగా ఒక రోజు నాగభూషణం సరుకులు కోసం వెళ్ళగా వేరే అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఈ విషయం కొన్ని రోజులకు లక్ష్మమ్మకి తెలిసింది. తరువాత ఆమె ఎంతో బాధపడి నాగభూషణం అసలు భార్య తానే అని తెలుసుకుని వాళ్ళ ఇద్దరిని వదిలి తన గ్రామానికి వెళ్ళుతుండగా నాగభూషణం ఎంతో బాధపడ్డాడు. అలాగే లక్ష్మమ్మ తన ఒంటరి జీవితాన్ని సాగించింది. తరువాత తన ఊరిని అభివృద్ది చేస్తూ ఉండగా నాగభూషణం మరణవార్త ఆమెకు తెలిసింది. తన చివరి చూపు కోసం ఆమె ఆ ఊరికి వెళ్ళి తన ఊరికి తిరిగి వచ్చింది.

ఇలా ఆమె జీవితంలో ఎన్న కష్టాలు ఎదుర్కుంటూ తన జీవితానికి ఒక సందేశం ఇచ్చింది. తను బాధపడినట్టు ఎవరు బాధపడకుండా గ్రామ అభివృద్ధి చేసింది. ఆమెకి బాల్యవివాహం జరగకపోతే తన జీవితం బాగా వుంటుంది అని అనిపించింది. కాబట్టి నేను బాల్యవివాహాన్ని వ్యతిరేకిస్తున్నాను.

యమ్.సుజిత  

Sr (MPC)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here