యూరప్ పర్యటనలో అందాలూ అనుభవాలూ ఆనందాలూ-3

0
10

[యూరప్‍లో పలు దేశాలను సందర్శించి, తమ యాత్రానుభవాలను వివరిస్తున్నారు డి. చాముండేశ్వరి.]

పారిస్ – ఓపెరా గ్రాండ్

[dropcap]పా[/dropcap]రిస్ సిటీలో చూసిన ఇతర ప్రదేశాల్లో నాకు నచ్చిన ప్రదేశం ఒపేరా గ్రాండ్. దీన్ని ఒపెరా గార్నియర్ అని కూడా పిలుస్తారు. పారిస్‌లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ connectivity చాలా బాగుంటుంది. మేము సులువుగానే ప్రయాణించాము. బస్సులో నెక్స్ట్ స్టాప్ ఏమిటీ? అనేది సులువుగా తెలిసేలా మ్యాప్, announcements ఉన్నాయి.

ఓపెరా భవనం లోకి వెళ్లి చూడటానికి ప్రవేశరుసుము ఉంది. అనేక ముఖ్యభాషల్లో వివరించే పరికరాలు ఇస్తారు. భవంతి పక్కన బస్సు దిగాము. ఎదురుగా అందమైన భవనం ఠీవిగా ఉంది.

భవనం వెలుపలి భాగాన్ని చూస్తూ ‘అబ్బో! ఎంత బాగుంది’ అనుకున్నాము. నెపోలియన్ III యొక్క ఆదేశాల మేరకు 1861 నుండి 1875 వరకు ఈ భవనం పారిస్ ఒపేరా కోసం నిర్మించబడింది. లోపలి అడుగుపెడితే ఇంద్రభవనంలా ఉందనిపించింది. అక్కడికి మేము ఇంద్రుడి భవనానికి వెళ్లినట్లు! అని నవ్వుకున్నాము. టికెట్ కౌంటర్‌లో టికెట్స్ కొని లోపల తిరిగి చూడటానికి అందరితో కలిసి బయలుదేరాము. ఎటునుండి మొదలుపెట్టాలో అర్థం కానీ పరిస్థితి, Arrow మార్క్ ఉన్నప్పటికీ.

‘అదిగదిగో అటు చూడు, కాదు కాదు. ఇటు చూడు. ఆ మెట్లు చూడు. శిల్పాలు చూడు’ అనుకుంటూ హడావుడి పడ్డాము. కానీ చేతిలోని యంత్రం ఎలా వెళ్లాలో చెప్పింది.

అదొక అద్భుత కళల ప్రపంచం. నిజజీవితంలో ఇంత అందమైన కట్టడాలు ఉన్నాయా? అనిపించింది. రెండు ప్రపంచ యుద్ధాలు, ఇంతకూ మునుపటి రాజరిక యుద్ధాలు తట్టుకుని ప్రదర్శనలో ఆర్ట్‌తో వావ్ అనిపించింది. గ్రేట్. తల ఎత్తి చూస్తే అన్నివైపులా కనుచూపు మేరలో పైకప్పు మీద ప్రకృతిలోని రంగులన్నీ మేళవించి వేసిన అద్భుత చిత్రాలు కళ్ళు తిప్పనివ్వవు.

చిన్నచిన్న డీటెయిల్స్‌తో భలే ఉన్నాయి, సజీవంగా. అందమైన శాండిలియార్లు, దీపాలు, ఫ్లోరింగ్, సీలింగ్ ఒకటేమిటి అన్ని అందంగా ఉన్నాయి. లెక్కకు మించిన ఫోటోలు తీసాము.

భవంతిలో, వెలుపల ఉన్న నిలువెత్తు శిల్పాలు సజీవంగా వాటి స్టోరీని చెబుతాము వినండి అనేలా ఉన్నాయి. 14 మంది చిత్రకారులు, మొజాయిక్‌లు మరియు 73 శిల్పులు దాని అలంకరణలో పాల్గొన్నారు. 1860 ఉత్తమ డిజైన్ కోసం ఒక పోటీలో చార్లెస్ గార్నియర్ అనే యువ వాస్తుశిల్పి గెలుపొందాడు.

ఈ ఐకానిక్ పారిసియన్ భవనం యొక్క అసలు పేరు Le Nouvel Opéra de Pa. కొత్త ఒపెరా హౌస్ ఎందుకంటే పాత ఒపెరా హౌస్ అగ్నిప్రమాదంలో కాలిపోయిన తర్వాత కట్టారట.. నెపోలియన్ III చక్రవర్తి, నెపోలియన్ బోనపార్టే మేనల్లుడు చాలా మంది విరోధులు మరియు శత్రువులను కలిగి ఉన్నాడు. 14 జనవరి 1858న సల్లే లే పెలెటియర్ ఒపెరా హౌస్ సమీపంలో చక్రవర్తి మరియు అతని భార్యపై హత్యాయత్నం జరిగిందట. వారి భద్రతా కోసం ప్రత్యేకంగా కట్టారట. ఒపెరా హౌస్‌లో 1,979 మంది కూర్చునే సామర్థ్యం మరియు 450 మంది ప్రదర్శకులు సరిపోయే వేదిక ఉంది.

చక్రవర్తి ఒపెరా హౌస్‌ను ఎప్పుడూ చూడలేదు లేదా దానిలో ఏ కచేరీకి హాజరు కాలేదు. కారణం యుద్ధం, బందీగా ఉండటం. నిర్మాణం చక్రవర్తి మరణం తరువాత 2 సం పూర్తి అయిందట.

నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ఒక సంపన్న ఫైనాన్షియర్ నుండి రుణం తీసుకోవలసి వచ్చింది, 4.9 మిలియన్ల బంగారు ఫ్రాంక్‌ల అప్పు అనుకుని మొదలుపెడితే 36 మిలియన్ ఫ్రాంక్‌ల బడ్జెట్ అయి సామ్రాజ్యం దాదాపు దివాళా తీసిందని విన్నాము.

రెండువైపులా ఎంట్రీ ఉన్న మెట్లు, అందమైన పెద్ద బాల్కనీలు, విశాలమైన హాల్స్, పెద్ద పెద్ద కిటికీలు. పారిస్ నగర వీధులు కనిపిస్తాయి.

ఇంకా లోపలి వెళితే సువిశాలమైన ఓపెరా ప్రదర్శన స్టేజి, సీటింగ్ ఉంది. గేట్స్ దగ్గర్లో గాజు బాక్స్‌ల్లో భద్రపరచిన అప్పటి నటీనటుల కాస్ట్యూమ్స్, నగలు, అప్పటి ఎంబ్రాయిడరీ, డిజైన్స్ అబ్బురపరిచాయి. ఓపెరా స్టేజి మినీ మోడల్స్ కనిపిస్తాయి.

ఇప్పటి OTT తరానికి స్టేజి మీద ప్రదర్శించిన నృత్యాలు, నాటికలు, బుర్రకథలు లాంటివి తెలియకపోవచ్చు. అలాంటిది దాదాపు 100+ సంవత్సరాల క్రితం 450కి పైగా కళాకారులు ఆర్టిస్ట్‌లు సువిశాలమైన స్టేజి మీద నాటకాలు, నృత్య నాటికలు, నృత్యాలు, సంగీతం ప్రదర్శించారట. వివిధ దశల్లో అలనాటి స్పెషల్ ఎఫెక్ట్స్‌తో ప్రదర్శనలు జరిగేవి. వందలమంది వాటిని చూసి, ఆర్టిస్ట్‌ని ప్రోత్సహించేవారు. అలాంటిది కాలక్రమేణా వాటికి కాలం చెల్లి, ప్రదర్శనకు మిగిలాయి. ఇప్పటికి విదేశాల్లో కొన్ని నగరాల్లో థియేటర్ షోస్‌కి ఆదరణ ఉంది.

మనం టైం మెషిన్ ఎక్కి అప్పటి కాలంలోకి వెళ్లిపోవచ్చు ఊహల్లో.

తరువాత పెద్ద లైబ్రరీ. అప్పటి గ్రంథాలూ, మ్యూజిక్ నోట్స్, స్క్రిప్ట్స్ కాబోలు ఉన్నాయి. ఒక రోజు పడుతుంది సావధానం చూస్తే. చివరిగా జ్ఞాపికలు అమ్మే షాప్ ఉంది. నాకు ఆ భవనం వదిలి రావాలనిపించలేదు. చూడాల్సిన బకెట్ లిస్ట్ పెద్దదే ఉంది. సమయం తక్కువ.

అన్నింటికన్నా మాకు ఎప్పటిలా నచ్చింది విదేశీయానంలో అక్కడి ప్రజలు తమ దేశం లోని చారిత్రక, పర్యాటక కట్టడాలను భద్రంగా చూసుకోవటం.

Photos: Mr. D. Nagarjuna

(వచ్చే వారం కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here