యూరప్ పర్యటనలో అందాలూ అనుభవాలూ ఆనందాలూ-6

0
8

[యూరప్‍లో పలు దేశాలను సందర్శించి, తమ యాత్రానుభవాలను వివరిస్తున్నారు డి. చాముండేశ్వరి.]

పారిస్ – ఫ్లీ మార్కెట్

[dropcap]మే[/dropcap]ము మా పారిస్ ట్రిప్‍లో చూసిన ఇంకో ప్రదేశం ఫ్లీ మార్కెట్. Paris Flea market in Saint-Ouen area. అనుకోకుండా వెళ్ళాము. మేము ఎయిర్‍పోర్ట్ నుండి హోటల్‌కి టాక్సీలో వెళ్తుంటే హోటల్‌కి దగ్గర్లో గల్లీల్లో రోడ్‌కి పక్కగా పెట్టిన మన వీక్లీ మార్కెట్ లాంటి shopping area చూసాము. డ్రైవర్‌ని అడిగితే ఫ్లీ మార్కెట్ అన్నాడు.

పారిస్ ట్రిప్ అయ్యాక next destination దేశానికి వెళ్ళే ట్రైన్ కి టైం చాలా ఉంది. హోటల్ చెకౌట్ చేశాక బ్యాగ్స్ హోటల్ క్లోక్ ఏరియాలో ఉంచి ఫ్లీ మార్కెట్ చూడాలని ప్లాన్.

హోటల్ వాళ్ళు మార్కెట్ దగ్గర్లో ఉంది, చాలా పెద్దది. రెండు రోజులు కూడా చాలవు చూడటానికి అన్నారు. అతిశయోక్తిలే అనుకున్నాము. పర్స్ లాంటివి జాగ్రత్త అన్నారు.

టైం పాస్ కోసం వెళ్దాము అనుకొని తగిన జాగ్రత్తలు తీసుకుని వెళ్ళాము. ముఖ్యంగా Phones, passports, money.

మా హోటల్‌కి దగ్గర్లో మొదలైన మార్కెట్ అనేక దారుల్లో చీలిపోయింది. అదొక పద్మ వ్యూహం. నిజం. మాకు కొద్దిగా భయం వేసింది. దారి తప్పితే? టైంకి హోటల్‌కి అక్కడ నుండి ట్రైన్ స్టేషన్‌కి చేరలేకపోతే?

అందుకని మేము ఫ్లే మార్కెట్ మెయిన్ రోడ్‍లో ఉన్నవే చూడాలని దూరం వెళ్లకూడదని డిసైడ్ అయ్యాం.

ఆ మార్కెట్‌లో మీకు దొరకని కొత్త పాత వస్తువంటూ లేదుట. లెక్కకు మించిన వస్తువులు. షాప్స్. పురాతన వస్తువులు చూస్తే అబ్బో అనిపించింది. అక్కడొక టైం ట్రావెల్ మెషీన్ చూసాం. అచ్చం ఆదిత్య 360 సినిమాలో లాగా అనిపించింది.

ఇప్పటి పిల్లలకు of course మన పిల్లలకు తెలియని చూడని వినని very old gramophones, ఇంకా records వేల సంఖ్యలో కనపడ్డాయి. వాటిని పట్టుకుని చిన్నప్పటి రోజులు గుర్తు చేసుకున్నాము. అప్పట్లో వాటిని కలిగి ఉండటం గొప్ప విషయం.

బొమ్మలు, cutlery సెట్స్, పెయింటింగ్స్, Furniture, cloths, jewellery అబ్బో  టైం చాలదు చెప్పటానికి.. అన్ని చూసాము

బహుశా one two km area లో అది ఒక అణువు మాత్రమేట. ఇది ఏడు హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద పురాతన మార్కెట్, ప్రతి వారాంతంలో 120,000 నుండి 180,000 మంది సందర్శకులు వస్తారని చెప్పారు.

ప్రతి శనివారం 9 గంటల నుండి 18గంటల వరకు, ప్రతి ఆదివారం 10 గంటల నుండి 18గంటల వరకు, ప్రతి సోమవారం 11 గంటల నుండి 17గంటల వరకు.

సెయింట్-ఓవెన్ ఫ్లీ మార్కెట్ 7 హెక్టార్లలో విస్తరించి ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద పురాతన మార్కెట్‌గా అభివర్ణిస్తారు. నగల నుండి ఫర్నిచర్ వరకు మరియు దుస్తులు నుండి గృహోపకరణాల వరకు, సెకండ్ హ్యాండ్ వస్తువుల జాబితా కొనసాగుతుంది. దీన్ని క్లుప్తంగా చెప్పాలంటే, Saint-Ouen Flea Market అనేది బేరం చెయ్యగలిగే వారి skill కి పరీక్ష.

ఫ్లీ మార్కెట్ చరిత్ర అనేక శతాబ్దాల నాటిది. ఇది రాగ్-అండ్-బోన్ మనుషుల చరిత్ర నుండి విడదీయరానిది, వీరు పారిస్ చుట్టూ ఉన్న కోటలు లేదా కోటలు అని పిలవబడే చోట్లలో చెత్తలో పాతవని పడేసిన వస్తువుల్లో పనికి వచ్చే వాటిని వెతుకుతూ రాత్రిపూట నగరంలో తిరిగేవారట. చెత్తతో విసిరివేయబడిన వస్తువులు, వారు స్థానిక మార్కెట్లలో తిరిగి అమ్మేవారట.

1832లో కలరా వ్యాప్తికి ప్రతిస్పందనగా, నగరం యొక్క అధికారులు రాజధానిలో మార్కెట్లను నిషేధించారు.

1880 మరియు 1890 మధ్యకాలంలో 130 కంటే తక్కువ మంది వ్యాపారులను తీసుకువచ్చిన ఒక సాధారణ స్క్రాప్-మెటల్ మార్కెట్ ఆదివారాల్లో నిర్వహించబడేది. అయితే ఇది 1885 సంవత్సరంలో మార్కెట్ అధికారికంగా పుట్టుకొచ్చింది – సెయింట్-ఓవెన్ అధికారులు ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి మరియు సురక్షితంగా చేయడానికి చర్యలు తీసుకున్నారు.

మార్కెట్ ఉనికిని సులభతరం చేయడానికి పని జరిగింది. వ్యాపారులు తమ స్టాల్స్‌ను ఏర్పాటు చేసుకోవడానికి మరియు తమను తాము మెరుగ్గా నిర్వహించడానికి సహాయపడటానికి ప్రధాన వీధుల వెంట రహదారులు మరియు నడక మార్గాలు సృష్టించబడ్డాయి. వ్యాపారులు తమ స్టాల్స్‌ను ఏర్పాటు చేసుకునే హక్కును పొందేందుకు ఇప్పుడు రుసుము చెల్లించాల్సి వచ్చింది.

ఫ్లీ మార్కెట్ పారిస్ సెయింట్-ఓవెన్ ఫ్లీ మార్కెట్ 1985లో శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంది. 2500 మంది డీలర్‌లకు ఆతిథ్యం ఇస్తోంది.  17 ఎకరాల (7 హెక్టార్లు) కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉంది, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పురాతన వస్తువుల మార్కెట్. మార్కెట్ స్థానికులకు మరియు పర్యాటకులకు ఒకే విధంగా ప్యారిస్ భారీ విక్రయదారుల సముదాయం గుండా షికారు చేయడం ఆనందంగా ఉంది.

2001లో, మొత్తం ఫ్లీ మార్కెట్ రక్షిత ఆర్కిటెక్చరల్ హెరిటేజ్ సైట్‌గా ప్రకటించబడింది – జోన్ డి ప్రొటెక్షన్ డు ప్యాట్రిమోయిన్ ఆర్కిటెక్చరల్ అర్బైన్ ఎట్ పేసేజర్ (ZPPAUP). అధికారిక ఆర్కిటెక్చరల్ ఇంజనీర్ అయిన ఆర్కిటెక్ట్ డెస్ బాటిమెంట్స్ సంప్రదింపులు లేకుండా సైట్‌లోని ఏ భాగాన్ని నాశనం చేయకూడదు లేదా మార్చకూడదు.

ఇదండీ మేము అనుకోకుండా చూసిన ఫ్లీ మార్కెట్ చరిత్ర.

Photos: Mr. D. Nagarjuna

(వచ్చే వారం కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here