[యూరప్లో పలు దేశాలను సందర్శించి, తమ యాత్రానుభవాలను వివరిస్తున్నారు డి. చాముండేశ్వరి.]
పారిస్ – సేక్రే కోయర్
[dropcap]మే[/dropcap]ము పారిస్‌లో చూసిన ఇంకో ముఖ్య పర్యాటక ప్రాంతం సేక్రే కోయర్. పారిస్ లోనే రెండవ ఎత్తైన ప్రదేశంగా చెప్పారు. అక్కడ నుండి న్యూ సిటీని, దూరంగా కనిపించే ఈఫిల్ టవర్‌ని చూడొచ్చు. సాధారణంగా విదేశీ పర్యాటకులు తక్కువగా వస్తారని హోటల్ వాళ్ళు అన్నారు.
మేము మా హోటల్ నుండి ఉబెర్ బిగ్ వెహికల్‌లో అక్కడకి వెళ్ళాము. ఆ దేశాల్లో మనతో పాటుగా చిన్న పిల్లలు ఉంటే తప్పక కార్ సీట్ ఉండాలి లేదా సీట్ బెల్ట్ వేసి కూర్చోపెట్టాలి.
స్మాల్ usual టాక్సీస్‍లో ఎక్కించుకోరు. ఫైన్ పడుతుంది. చెప్పాలంటే అఫెన్సు. సో మేము నలుగురం, మనమరాలు ఉండటంతో టాక్సీ 7 సీటర్ బుక్ చెయ్యాల్సి వచ్చేది.
యూరోపు చాలా కాస్టలీ అండి. 30-50 నిముషాల ప్రయాణం తరువాత క్యాబ్ డ్రైవర్ మమ్మల్ని ఒక చోట దింపి ఇక్కడే మీ డెస్టినేషన్ అన్నాడు. అదొక సన్నని రహదారి. మేము వెళ్ళాల్సింది కొండ ప్రాంతం. ఇదికాదు అన్నాము. ఇదే. ముందుకు వెళ్లి లెఫ్ట్ తిరిగి వెళితే మీరు వెళ్లాల్సిన చోటు వస్తుందని వెళ్ళిపోయాడు. పైగా హిల్ మీదకు టాక్సీస్ అవి వెళ్లవు అన్నాడు.
చాల అయోమయం, కోపం, చిరాకు వచ్చాయి. కానీ ఏం చేస్తాము? అలవి గాని చోట అధికులం అనరాదు, స్థానబలిమి లేదు. సో టాక్సీ డ్రైవర్ చెప్పినట్లే ముందుకు నడుస్తూ, గూగుల్ మ్యాప్‌ని సంప్రదించాము. ఆ సూచనల ప్రకారం నడుస్తూ వెళితే ఎదురుగా ఆకాశానికి నిచ్చన వేసినట్లున్న వందల steep మెట్లు కనిపించాయి. మళ్ళీ అయోమయం? ఇవా? మేము చూడాల్సినవి? అని. గూగుల్ మ్యాప్ మెట్లు ఎక్కి వెళ్ళండి అంది. మంత్రసానితనం ఒప్పుకున్నాక తప్పదుగా! ఒకటి రెండు అంటూ అందరం చిన్న పిల్ల సహా ఎక్కటం స్టార్ట్ చేసాము. నేను ఇబ్బంది పడ్డాను. నా కోసం మిగతావారు ఆగి ఆగి ఎక్కారు. చివరికి సన్‍సెట్ వేళకి పైకి చేరాము.
మా శ్రమను మరిపించేలా తెల్లగా ఉన్న పెద్ద చర్చి సూర్యుని కిరణాలతో బంగారు రంగులో మెరిసి పోతూ కనిపించింది. పచ్చని బయళ్లు, పెద్ద ఓల్డ్ చర్చ్ ఆవరణ. మేము మెట్లు ఎక్కి చర్చి మెయిన్ ఎంట్రెన్స్ దగ్గరకు వెళ్ళాము. అక్కడ నుండి కొంచం కిందకు దిగటానికి పదుల సంఖ్యలో మెట్లు కనిపించాయి. వందల సంఖ్యలో పర్యాటకులు ఉన్నారు.
మాకు టాక్సీ డ్రైవర్ అబద్ధం చెప్పాడని అర్థం అయింది. ఆ మెట్ల స్టార్టింగ్ పాయింట్‌లో చక్కని రోడ్ మార్గం ఉంది. టాక్సీలు బస్సులు ఇతర ప్రైవేట్ వాహనాలు వస్తూ పోతూ కనిపించాయి.
ఊరికి కొత్తవారిని ఏమార్చటం మనమే కాదు అందరు చేసేదే అనుకున్నాము. చర్చి నుండి కిందకు దిగటానికి ఒక rope way ఉంది. మేము చర్చ్ బైట వైపు తిరిగి చూస్తూ, పరిసరాలు, ప్రజలను గమనిస్తూ కొద్దిసేపు గడిపాము.
చర్చ్ బైట పెద్ద క్యూ ఉంది. అది లోపలి దైవ దర్శనం కోసం. లోపలికి వెళ్ళాము. నిర్మాణం చూడటానికి అద్భుతంగా ఉంది.
బైటకు వచ్చాక పడమటింటికి వెళ్తున్న సూర్యుని బంగారు వెలుగుల్లో తడిసిముద్ద అయ్యాము.
వెళ్ళటానికి ఇబ్బంది పడ్డా ఫలితం హ్యాపీ. అదర్ సైడ్ అఫ్ పారిస్ సిటీని చూసాము.
కనుచూపు మేర అంతా బిల్డింగ్స్.
అక్కడి ఇనుప ఫెన్స్‌కి వేల సంఖ్యలో తాళాలు వేసి ఉన్నాయి. యూరప్‌లో ఇలాంటి ఇతర ప్రదేశాల్లో కనిపిస్తాయి. తాళాలు అమ్ముతున్నారు. మనమరాలు ముచ్చట తీర్చటం కోసం మేము ఒకటి కొన్నాము. ఎందుకు? అని అమ్మే వ్యక్తిని అడిగితే ఏదైనా కోరిక తీరటం కోసం అన్నాడు.
తాళం వేసాక కీస్ పడెయ్యాలట. అంటే పూర్తి విశ్వాసంతో అని. మా పాప ఆనందంగా లాక్ చేసి కీస్ విసిరేసింది.
ఎందుకబ్బా ఇంతమంది people ఉన్నారు? అనుకున్నాము. అప్పుడు గుర్తుకువచ్చింది ప్రేమికుల రోజని. నెక్స్ట్ లెవెల్లో కూడా చాలా మెట్లు ఉన్నాయి. ఇరుపక్కలా పార్క్ లాంటిది ఉంది. దూరంగా రోడ్ మీద సిటీ బస్సులు కనపడ్డాయి.
అప్పటికే చీకటి పడింది. ఫిబ్రవరి నెల చలి వణికిస్తోంది. రోప్‍వేలో కిందకు దిగాలనుకున్నాము. మెట్లు ఎక్కి అలసిపోయాము. పాప ఉంది కదా. Rope way కి చివరి టికెట్స్ మావే. అందులో ఎక్కి డోర్ క్లోజ్ అయింది. కిందకు చూస్తున్నాము. ఒక్క నిముషంలో డోర్ ఓపెన్ అయింది. ఆ నిముషంలో మా ఫీలింగ్? గెస్ చెయ్యండి.
గూగుల్ మ్యాప్ చెప్పినట్లు మా హోటల్‌కి వెళ్లే సిటీ బస్సు కోసం ఇక్కడే ఇక్కడే రైట్ లెఫ్ట్ అనుకుంటూ నడిచి నడిచి చివరికి ఉబెర్ జిందాబాద్ అని హోటల్ చేరాము. హమ్మయ్య! అనుకున్నాము. మేము తెలుసుకున్న ప్రదేశపు విశేషాలు మీకోసం.
ఆసక్తికరమైన విషయాలు
700 అడుగులు ఎత్తుతో, సాక్రే కోయర్ పారిస్‌లో రెండవ ఎత్తైన ప్రదేశం. దీనిని మోంట్‌మార్ట్రే కొండపై కట్టారు. ఇది 426 అడుగులు.
కొత్త కట్టడపు గోడల మీద కూడా మనం వేలిముద్రలు, మరకలు చూస్తాము. అలాంటిది ఈ 100 సంవత్సరాల పురాతన కేథడ్రల్ తెల్లగా మెరుస్తోంది. దానికి కారణం ఉంది. పాల్ అబాడీ, వాస్తుశిల్పి, సెయిన్-ఎట్-మార్నేలోని సూప్పెస్ క్వారీలలో కనుగొనబడిన ఒక ప్రత్యేక రాయిని వాడాడట. వర్షం పడినప్పుడు, రాయి ‘కాల్సైట్’ అనే పదార్థాన్ని విడుదల చేస్తుంది, ఇది రాయిని శుభ్రపరిచి తెల్లగా ఉంచుతుంది. The Arc de Triomphe మరియు Alexandre II వంతెన కూడా ఇలాంటి రాతి తోనే కట్టరట.
ఇది ఫ్రాన్స్ యొక్క అతిపెద్ద గంటకు నిలయం. Sacré Coeur నిర్మాణం జాతీయ ప్రయత్నం – దేశవ్యాప్తంగా ప్రజలు దీనికి సహకరించారు. ఆల్ప్స్‌లోని ఫ్రెంచ్ పట్టణం సవోయి, ‘సవోయార్డే’ అని పిలువబడే ఒక భారీ గంటను అందించింది. దీని బరువు 19 టన్నులు మరియు మూడు మీటర్ల కంటే ఎక్కువ వ్యాసం కలిగి ఉంటుంది. దాని బేస్ వద్ద 22 సెం.మీ.దీనిని 1895లో, మోంట్‌మార్ట్రే కొండపైకి లాగడానికి 21 గుర్రాలు బలం కావాల్సి వచ్చిందిట. ఇది ఇప్పటికీ ప్రపంచంలోని అతిపెద్ద మరియు భారీ గంటలలో ఒకటి.
ఇక్కడ చర్చి కూడా ఉండకముందు ఇది ప్రార్థనా స్థలం. 19వ శతాబ్దంలో దీని నిర్మాణానికి ముందు, మోంట్‌మార్ట్రే కొండ పైభాగం అప్పటికే ప్రార్థనా స్థలంగా ఉండేది. ఇక్కడ పూజలు జరిగాయట. పురావస్తు శాస్త్రవేత్తలు మెర్క్యూర్ మరియు మార్స్‌కు కూడా అంకితం చేయబడిన గాలో-రోమన్ దేవాలయాల ఆధారాలను కనుగొన్నారు.
ఇది పాతదిగా అనిపించవచ్చు, కానీ ఈఫిల్ టవర్ పూర్తయిన ముప్పై సంవత్సరాల తర్వాత సాక్రే కోయర్ తెరవబడింది. 1875లో నిర్మాణం ప్రారంభమైంది, అయితే దీన్ని నిర్మించడానికి 39 ఏళ్లు పట్టింది. 1914లో తొలిసారిగా ప్రజల సందర్శనానికి తలుపులు తెరిచారు.
విదేశీ పర్యాటకంలో ముచ్చటగొలిపేది అక్కడి చారిత్రక ప్రదేశాలను ఎంతో చక్కగా శుభ్రంగా ఉంచుతారు. పరిరక్షిస్తారు. మన దేశంలో కూడా అలాంటి క్రమశిక్షణని పాటిస్తే ఎంతో బాగుండు. మా యూరోప్ యాత్రలో పారిస్ పర్యటన ముగిసింది.
మరుసటి రోజు ఉదయాన్నే పారిస్ గ్రాండ్ స్టేషన్ నుండి స్విస్ రైల్వేస్‌లో ముందుగానే బుక్ చేసుకున్న టికెట్స్‌తో స్విజర్లాండ్ లోని ఒక పెద్ద నగరం బాసెల్‌కి బయలుదేరాము.
Photos: Mr. D. Nagarjuna
(వచ్చే వారం కలుద్దాం)