ఎవరి కెరుక?

0
7

[box type=’note’ fontsize=’16’] మానవుడి మనస్సు, తనువు చేసే అద్భుతాలకు అబ్బురపడుతూ తనలో రేగిన ప్రశ్నలకు జవాబులు ఎవరి కెరుక? అని ప్రశ్నిస్తున్నారు చల్లా సరోజినీదేవి ఈ కవితలో. [/box]

[dropcap]గు[/dropcap]ప్పెడంత గుండె లోతుల్లో
కడలిని మించిన ఆశలేమిటో?
అనంతమైన ఆకాశపుటంచుల్లోనూ,
అంతమేలేని ఆలోచనలెన్నెన్నో!
పెదవి మాటున దాగిన
చెప్పలేని మాటలు మరెన్నో,
కరిగిపోయిన కలనే మరల – మరల
గాంచాలనే తపన ఈ కన్నుల కెందుకనో?
మరలిరాని నిన్నటి కోసం
పిచ్చి మనసు ఎదురు చూచుటేలనో?
చిల్లు పడిన ఈ జీవితనౌక.
ఏ తీరున తీరం చేరునో ఎవరి కెరుక?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here