ఎవరు గొప్ప?

0
10

[box type=’note’ fontsize=’16’] కావలి లోని రెడ్‌ఫీల్డ్స్ హైస్కూల్‍లో తొమ్మిదవ తరగతి చదువుతున్న వై. మోక్షజ్ఞ సాయి రెడ్డి వ్రాసిన కథ “ఎవరు గొప్ప”. ఒక్కో జీవికి ఒక్కో మంచి గుణం, ఒక్కో లోపం ఉంటాయనీ, ఒకరితో ఒకరిని పోల్చకూడదని చెప్పే కథ ఇది. [/box]

[dropcap]అ[/dropcap]నగా అనగా ఒక అడవిలో ఒక కోకిల, ఒక నెమలి ఉండేవి. ఆ రెండు చక్కగా కలిసిమెలసి ఉండేవి. ఒకసారి నెమలి అడవిలో ఉన్న ఒక సరస్సు దగ్గరకు నీళ్ళ త్రాగడానికి వెళ్ళింది. ఇంతలో వర్షం పడసాగింది. నెమలి నాట్యం చేయడం మొదలు పెట్టింది. అడవిలో ఉండే నెమలి మిత్రులు అందరు నెమలి నాట్యం చూసి నెమలిని ఇలా పొగడసాగారు. “నెమలి అంత అందంగా ఎవ్వరు ఉండరు” అని ఒకరు, “నెమలి మామూలుగానే అందంగా ఉంటుంది. ఇక నెమలి నాట్యం చేసిందంటే ఆ అందానికి మనం కుళ్ళుకోవాల్సిందే. నేను కూడా నెమలిగా పుట్టుంటే ఎంత బాగుండేదో ఎంత అందంగా ఉంటుందో” అని ఇంకొకరు. ఇలా నెమలిని పొగడ్తూ ఉండగా నెమలి ఆ పొగడ్తలకు పొంగిపోయి నెమలికి నేనే అందంగా ఉంటాను అనే అంహంకారం కలిగింది. అయితే ఒక రోజు నెమలి కోకిల దగ్గరకు వెళ్ళి కోకిల రంగు గురించి హేళన చేసి తనను కించపరచింది. కోకిల సరస్సు దగ్గరకెళ్ళి బాధపడుతూ ఉంది.

అప్పుడు హంస కోకిల దగ్గరకు వెళ్ళి “ఏమైంది మిత్రమా ఎందుకు బాధగా కూర్చుని ఉన్నావు? నీ బాధకు కారణమేమిటి?” అని అడిగింది. అప్పుడు కోకిల జరిగిందంతా చెప్పి “నెమలి నన్ను ఎప్పుడు కించపరచలేదు. ఎప్పుడూ నాతో మంచిగా మాట్లాడుతూండేది. కాని  ఈ రోజు నా రంగు గురించి హేళన చేసింది” అని బాధపడసాగింది.

నెమలి ఎందుకు కోకిలను హేళను చేసిందో తెలుసుకుందాం అని హంస మరియు కోకిల నెమలి దగ్గరకు వెళ్ళారు. అప్పుడు నెమలి తాను అందంగా ఉంటుందన్న అహంభావంతో ప్రతి జంతువును వాటి శరీరాకృతి గురించో లేదా వాటి రూపం గురించో హెళన చేస్తూ వాటిని కించపరుస్తూ ఉన్నది.

అప్పుడు హంస నెమలి దగ్గరికెళ్ళి ఇలా ప్రశ్నంచింది. “ఎందుకు కోకిల రంగు గురించి హేళన చేస్తూ మాట్లాడావు?” అప్పుడు నెమలి “నేను చాలా అందంగా ఉంటాను. నా లాంటి అందమైన నెమలికి కోకిల లాంటి నలుపు రంగు పక్షి స్నేహితురాలా” అని కోకిలను ఇంకోకసారి హేళన చేసి మాట్లాడింది.

అప్పుడు హంస కోకిల కూడా అందంగా ఉంటుందని నెమలితో వాదించింది. హంస నెమలితో “నీకు మతి భ్రమించింది. అందుకే నువ్వు కోకిల అందంగా ఉండదు అని అంటున్నావు” అని అన్నది. అప్పుడు నెమలి “నాకేం మతి భ్రమించలేదు నీకే మతి భ్రమించింది. ఆ నల్లటి కురూపి పక్షిని అందంగా ఉందని అంటున్నావు” అంది. ఇలా ఆ రెండూ వాదించుకుంటాయి.

అప్పుడు హంసకి ఒక ఉపాయం తడుతుంది. హంస నెమలితో “నువ్వు అందంగా ఉంటావో లేదా కోకిల అందంగా ఉంటుందో తెలుసుకోవడానికి నీకొక పరీక్ష పెడతాను” అని అన్నది. నెమలి ఆ పరీక్షకి ‘సై’ అని అంటుంది. అప్పుడు హంస కోకిలని పాట పాడమంటుంది. అప్పుడు కోకిల ఎంతో మధురంగా పాడుతుంది. ఇప్పుడు హంస నెమలిని పాట పాడమని చెప్పింది. అప్పుడు నెమలి తన గొంతుతో అసహ్యంగా పాట పాడుతుంది. ఇంకోసారి నెమలి ప్రయత్నించింది. ఎన్నిసార్లు ప్రయత్నించినా నెమలి కోకిలలా అందంగా పాడలేక పోయింది. హంస నెమలితో ఇలా అంటుంది. “నెమలీ, ఇప్పటికైనా నీ తప్పు తెలిసి వచ్చిందా! నువ్వు ఎంత మందిని వాటి శరీరాకృతి గురించి మరియు వారి రూపం గురించి హేళన చేసి కించపరిచావు. ఇంకెప్పుడూ నువ్వు ఎవ్వరినీ నీ గుణాలతో పొల్చవద్దు. ఒకొక్క జంతువుకి ఒకొక్క మంచి గుణం ఉంటుంది. అలాగే ఒక లోపం ఉంటుంది. దేవుడు అందరికి మంచి గుణాలు ఇస్తాడు. అలాగే ఏదో ఒక లోపం పెడతాడు. కోకిల గొంతు అందమైనది, నీ రూపం అందమైనది. కోకిలలో తన రంగు తన లోపం. నీలో నీ గంతు లోపం” అని చెప్పింది. ఇప్పుడు నెమలికి మూసుకున్న కళ్ళు తెరుచుకున్నాయి. నెమలి హేళన చేసిన వారిని క్షమాపణ అడిగింది. మళ్ళీ కోకిల, నెమలి మరియు ఇతర జంతువులు కలసి మెలసి ఉండసాగాయి. చివరికి హంస నెమలి అహంకారం పోగొట్టింది.

నీతి- ఎవరినైనా హేళన చేసే ముందు తమలో ఉండే లోపాలను తెలుసుకొని ప్రవర్తించాలి.

వై. మోక్షజ్ఞ సాయి రెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here