[dropcap]కా[/dropcap]వలిలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు ‘కులం కథ’ పుస్తకం చదివి తమకి నచ్చిన కథను విశ్లేషించి, ఆ కథ తమకెందుకు నచ్చించో పేర్కొన్నారు. సీనియర్ ఇంటర్ చదువుతున్న పి.మానస ఈ పుస్తకంలోని ‘ఏవిట్లు’ కథను విశ్లేషిస్తోంది.
***
ప్రస్తుత కథ ఏవిట్లు దీనిలో రచయిత్రి బొమ్మదేవర నాగకుమారి రిజర్వేషన్ మరియు కులవివక్ష గురించి వివరించారు. మనం సమాజంలో మంచి వ్యక్తులుగా మారడానికి ఈ కథలోని చాలా అంశాలు ఉపయగపడతాయి. దానిలో నచ్చే అంశాలు, నచ్చని అంశాలు ఎన్నో ఉన్నాయి.
నచ్చని అంశాలు
- ఒక వ్యక్తిని వారి కులంతో హేళన చేయడం.
- ఒక వ్యక్తి ప్రవర్తన మరియు మంచితనం చూసి కాకుండా వారి కులం చూసి స్నేహం చేయడం.
- దేశ భక్తి లేకపోవడం.
నచ్చిన అంశాలు
- ఎన్ని సార్లు ఓడిపోయినా నిరుత్సాహ పడకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించడం.
- ఒక మహిళ మగవారితో సమానంగా మాట్లాడగలగడం
దీని నుంచి నేర్చుకున్న అంశాలు
- మనం ఎంత చదువుకున్నప్పటికీ గొప్పవారి మయ్యామని అర్థం కాదు నలుగురినీ సమానంగా చూసినప్పుడే గొప్పవారిమయ్యామని అర్థం.
- ఇండియన్ అనే భావన ఉండాలి.
ఈ పుస్తకం చదివిన తరువాత నాకు అర్థమైన విషయాలు
పి.మానస