‘కులం కథ’ పుస్తకం – ‘ఏవిట్లు’ – కథా విశ్లేషణ

0
10

[dropcap]కా[/dropcap]వలిలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు ‘కులం కథ’ పుస్తకం చదివి తమకి నచ్చిన కథను విశ్లేషించి, ఆ కథ తమకెందుకు నచ్చించో పేర్కొన్నారు. సీనియర్ ఇంటర్ చదువుతున్న పి.మానస ఈ పుస్తకంలోని ‘ఏవిట్లు’ కథను విశ్లేషిస్తోంది.

***

ప్రస్తుత కథ ఏవిట్లు దీనిలో రచయిత్రి బొమ్మదేవర నాగకుమారి రిజర్వేషన్ మరియు కులవివక్ష గురించి వివరించారు. మనం సమాజంలో మంచి వ్యక్తులుగా మారడానికి ఈ కథలోని చాలా అంశాలు ఉపయగపడతాయి. దానిలో నచ్చే అంశాలు, నచ్చని అంశాలు ఎన్నో ఉన్నాయి.

నచ్చని అంశాలు

  • ఒక వ్యక్తిని వారి కులంతో హేళన చేయడం.
  • ఒక వ్యక్తి ప్రవర్తన మరియు మంచితనం చూసి కాకుండా వారి కులం చూసి స్నేహం చేయడం.
  • దేశ భక్తి లేకపోవడం.

నచ్చిన అంశాలు

  • ఎన్ని సార్లు ఓడిపోయినా నిరుత్సాహ పడకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించడం.
  • ఒక మహిళ మగవారితో సమానంగా మాట్లాడగలగడం

దీని నుంచి నేర్చుకున్న అంశాలు

  • మనం ఎంత చదువుకున్నప్పటికీ గొప్పవారి మయ్యామని అర్థం కాదు నలుగురినీ సమానంగా చూసినప్పుడే గొప్పవారిమయ్యామని అర్థం.
  • ఇండియన్ అనే భావన ఉండాలి.

ఈ పుస్తకం చదివిన తరువాత నాకు అర్థమైన విషయాలు

రిజర్వేషన్ అనేది ఎంతమంది బలహీనవర్గాలకు ఆర్థికంగా మరియు చదువు పరంగా ఎదగడానికి ఉపయగపడుతుంది. కాని రిజర్వేషన్ కారణంగా ఎంతమంది ప్రతిభావంతులు తమ అవకాశాలను చేజార్చుకున్నారు. రిజర్వేషన్ ఒక విధంగా మంచి దైనప్పటికీ ఒక విధంగా ప్రతిభ కలిగిన వారిని నిరుత్సాహపరుస్తుంది. దీని వలన ప్రజలకు దేశం మీద కంటే ఇతర దేశాల మీద ఇష్టం పెంచుకుంటున్నారు. ప్రేమ అనేది రెండు మనసుల మధ్య ఉండాలి కాని కులం చూసి ప్రేమించడం వలన ఆ ప్రేమ ఎంత కాలం నిలవదు. చివరగా నేను నేర్చుకున్న అంశం కులవివక్షతను తొలగించు, ఇండియన్ అనే భావనలో దేశాన్ని వెలిగించు.

పి.మానస

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here