ఎక్స్‌పైర్డ్ టాబ్లెట్లతో అలంకారాలు

0
12

[డా. కందేపి రాణీప్రసాద్ గారి ‘ఎక్స్‌పైర్డ్ టాబ్లెట్లతో అలంకారాలు’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]త[/dropcap]లనొప్పి, జలుబు, దగ్గు ఏది వచ్చినా టాబ్లెట్లు మింగడం అలవాటయ్యింది కదా! పూర్వం లాగా కషాయాలు తాగడం, కరక్కాయలు బుగ్గన పెట్టుకోవడం వంటివి ఎప్పుడో పోయాయి కదా! కాబట్టి ప్రతి ఇంట్లో చాలా టాబ్లెట్లు ఉoటున్నాయి. ఇంకా మందుల షాపు వాళ్ళను అడిగి చాలా కొని పెట్టుకుంటున్నారు అర్ధరాత్రి అవసరమైతే ఎలా అనే ముందు జాగ్రత్తతో చాలా మంది ముందుగానే ఎన్నో మందుల్ని కొని ఇంట్లో పెట్టుకుంటున్నారు. అంతే కాక ఏదైనా బాధతో హాస్పిటల్‌కు వెళ్ళినపుడు రాసిచ్చిన మందులు తెచ్చుకుంటారు. వారం రోజుల కోర్సులో నాలుగు రోజులకే తగ్గిపోయినపుడు మిగతా మందులు ఇంట్లో అలాగే వృథాగా ఇలా ఎన్నో రకాలుగా ఇంట్లో చేరిన మందులు ఎక్స్‌పైర్ అయిపోతుంటాయి. డేట్ అయిపోయిన మందుల్ని చెత్త కుప్పలో పారేయాల్సిందే. ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిన మందుల్ని ఒక డబ్బాలో వేసుకుని దాచుకోండి. వాటితో ఎన్నో రకాల బొమ్మల్ని తయారు చేసుకోవచ్చు. ఒక జాగ్రత్త అండీ, పిల్లలకు అందకుండా చూడండి.

మా ఇంట్లో ఎక్స్‌పైర్ అయిపోయిన మందులు చాలా ఉన్నాయి ఎందుకంటే మాది హాస్పిటల్ కాబట్టి. మెడికల్ షాపులో ఎక్స్‌పైర్ అయిన మందులన్నీ తెచ్చి ఇంట్లో దాస్తాను. వేరుశనక్కాయలు వలిచి పప్పులు దాచుకున్నట్లుగా నేను మందుల స్ట్రిప్పులు వలిచి టాబ్లెట్లు కాప్స్యూల్స్ డబ్బాలో పోసుకుంటాను. ఇక వాటితో బొమ్మలు చేయడమే ఆలస్యం.

నాకసలే హాస్పిటల్ వేస్ట్‌తో బొమ్మలు చేయడం ఇష్టం. ఇప్పటి దాకా దాదాపు ఐదు వేలకు పైగా బొమ్మలు చేశాను. దానికో వరల్డ్ రికార్డు కూడా తెచ్చుకున్నాను. కళ్ళ మీద నాకున్న ఇష్టమే ఇలా ఇన్ని బొమ్మలు చేయిస్తుంది. ఇప్పుడు ఒక పూల కొమ్మ చేద్దాం. చూడండి నేనెలా చూశానో.

ఏదైనా వ్యాధి వచ్చి మందులు మింగేటప్పుడు తెలియదు గానీ బొమ్మలు వేద్దామని టాబ్లెట్స్‌ను పరిశీలిస్తే ఎన్ని రంగులో కదా అనిపించింది. ఇన్ని రంగులు కళ్ళరింపుగా కనపడితే నాలాంటి ఆర్టిస్ట్ చెయ్యి ఊరుకుంటుందా! ఈ ఫోటోలో గమనించండి ఎన్ని రంగులున్నాయో! పూల కుండీని కాఫీ రంగు టాబ్లెట్లతో తయారు చేశాను మనిషికి రక్తాన్ని ఇచ్చే ఐరన్ టాబ్లెట్లు ఇవి. పూల కొమ్మగా పొడుగ్గా మెరిసిపోతూ గొట్టాల ఆకారంలో ఉన్న టాబ్లెట్లను వాడాను. ఇవి సపోటా రంగులో ఉండి మెరిసిపోతూ ఉన్నాయి. ఆకుల కోసం ఆకుపచ్చ రంగులో ఉన్న టాబ్లెట్లను తీసుకున్నాను. పువ్వులు పెట్టాలి ఏం చేద్దామా అనుకున్నా. పసుపురంగులో గుండ్రంగా తీర్చిదిద్దినట్లున్న టాబ్లెట్లు కనిపించాయి ఇవి విరోచనాలు టాబ్లెట్లు అట. ఏదైతేనేం మనం పువ్వుల్ని చేసేశాం. వాటి మధ్యలో గలాబీ రంగులో ఉండే టాబ్లెట్లను పెట్టాను. చూడoడి పూల కుండి కుండీ ఎంత బాగుందో! పూలు, ఆకులు, కొమ్మలతో కళకళలాడి పోతూ ఉన్నది.

ఇప్పుడు మరో బొమ్మను చేద్దాం! తెనెటీగను చేద్దామనుకున్నాను కష్టపడి, శ్రమించి పువ్వు పువ్వు దగ్గరకు పోయి మకరoదాన్ని సేకరించి తేనెగా మార్చే తెనెటీగ కష్టించి పనిచేసే జీవులకు ఉదాహరణ అటువంటి తేనె టీగను రంగుల టాబ్లెట్లతో అలంకరిద్దామా! ముందుగా తేనెటీగ శరీరాన్ని పెద్దగా బూరెల్లాగా ఉన్న పింకీ రంగు టాబ్లెట్లతో తయారు చేశాను. దాని తలమీద ఉండే శృంగాలను పొడుగు టాబ్లెట్లతో అలంకరించాను. మొహంలో కళ్ళు ముక్కు కోసం చింతగింజల్ని వాడుకున్నాను. నీరు కోసం ఎర్రని బుల్లి టాబ్లెట్లను పెట్టాను. పిల్లల్లో వచ్చే ఫిట్స్‌కు సంబధించిన టాబ్లెట్లు ఇవి. శరీరాన్ని రంగు రంగుల టాబ్లెట్లతో వరసల వారీగా అలంకరించాను. వరసల మధ్యలో పసుపురంగు గుండ్రటి టాబ్లెట్లను అమర్చాను. తేనెటీగ శరీరం లోని ఖండితాలను రంగుల్లో ముంచెత్తాను. ఇక రెక్కల్ని గోధుమ రంగు పొడుగు టాబ్లెట్లతో తయారు చేశాను. రెక్కల్లో రంగురంగుల టాబ్లెట్లను నింపాను. టాబ్లెట్లతో పాటు గొట్టాలను కూడా ఉపయోగించాను. ఎంత అందంగా వచ్చిందో! మకరందాన్ని తెచ్చి తేనెగా మార్చే తెనెటీగను వ్యాధుల పని బట్టే టాబ్లెట్లతో తయారు చేశాను.

మరో బొమ్మను చేద్దాం. ఇళ్ళు, చెట్లు, సూరీడు, ఆడుకునే పిల్లలు, ముగ్గులు వేసే బాలిక, ఆకాశంలో ఎగిరే పక్షులు ఇలా ఒక సీనరీని సృష్టించాను ఇలాంటి ప్రకృతి దృశ్యాన్ని సైతం టాబ్లెట్లతో మలిచాను. లేత టిస్కెట్ రంగులో ఉండే టాబ్లెట్లతో ఇల్లు కట్టాను. ఈ టాబ్లెట్లు శరీరానికి బలాన్నిచ్చే టాబ్లెట్లట. మరి అందుకే పడిపోకుండా బలంగా ఉటుందని ఇళ్ళు కట్టేశాను. ఆ తర్వాత పెద్ద చెట్టును కూడా నాటాను, హరితహారం అని ఇంట్లో చెట్లను నాటమంటున్నారు కదా! అయినా మన పూర్వీకులు ఇళ్ళల్లో వేప, రావి చెట్లను నాటుకునేవారు. మన పెద్దల మాట చద్ది మూట గదా అని ఒక వృక్షాన్ని నాటేశాను. అదేమి వృక్షమో మీరే చెప్పాలి. సకల జీవజాతికి వెలుగు నిచ్చి ప్రాణాలు నిలిపే సూర్యుడ్ని పెట్టాను. ఎప్పుడూ కొండల్లో నుంచి ఉదయించే సూర్యుడ్నే చిత్రిస్తాను, కానీ ఇక్కడ పూర్తిగా ఉదయించిన సూర్యుడ్నే వేశాను. ఆకారంలోని కాకుల కోసం నల్లని గొట్టాలను ఉపయోగించాను ఇంటిముందు ముగ్గులు పెట్టాను. నాకున్న ముగ్గుల కోరికను ఇలా కూడా తీర్చుకున్నాను. ఇంటి ముందు ఆడుకునే పిల్లల్ని టాబ్లెట్లతో చిత్రించాను. నేను ఏది చేసిన పిల్లలు లేకుండా చెయ్యను కదా! పూర్తి పల్లెటూరి వాతావరణాన్ని ఎక్స్‌పైర్ అయిపోయిన టాబ్లెట్లతో చిత్రంచాను.

ఇప్పుడొక క్యారెట్‌ను తయారు చేద్దాం. ఆరెంజ్ రంగులో కళ్ళ కింపుగా ఉండె క్యారెట్ దుంపను టాబ్లెట్లతో తయారు చేద్దామా! పిల్లలకు రక్తవృద్ధిని కలిగించే క్యారెట్‌ను టాబ్లెట్ల నుంచి తవ్వుదాం! ఆరెంజ్ రంగులో ఉండే గుండ్రటి టాబ్లెట్లను ఉపయోగించి క్యారెట్‌ను పండించాను. ఆకుల కోసం ఆకుపచ్చని టాబ్లెట్లను వాడాను. క్యారెట్ లోపల కూడా టాబ్లెట్లతో నింపేశాను. మరి తాజాగా ఉన్న కార్యట్ ను తినేద్దామా? అయ్యో నిజంగా తినేయకండి. అవి ఎక్స్‌పైర్ అయిన టాబ్లెట్లు!

పొడుగు మెడతో చెట్ల చిటారు కొమ్మనున్న ఆకుల్ని సైతం తినేసే జిరాఫీని తయారు చేద్దాం. ఎప్పుడూ అడవుల్లో జూపార్కుల్లో కనిపించే జిరాఫీని మనింట్లో కట్టేసుకుందాం! లేత గోధుమరంగు పొడుగ్గా అచ్చువేసినట్లుగా ఉన్న టాబ్లెట్లతో జిరాఫీ శరీరాన్ని తయారు చేశాను. నల్లగా ఉండే గొట్టాలతో జిరాఫీ మూతిని తయారు చేశాను. సిల్కీగా మెరుస్తూ ఉండే ఈ నల్లని గొట్టాలు మల్టీ విటమిన్ గొట్టాలు. వీటిని ఇంకా చెవుల కోసం మరియు తోక కుచ్చుల కోసం కూడా పొందాను. రెండు కళ్ళను పెట్టాను. శరీరాన్నంతా రంగురుగుల టాబ్లెట్లతో నింపాను. టాబ్లెట్ల జిరాఫీ బాగుందా?

ఇప్పుడొక చేప బొమ్మను చేద్దామా! నీళ్ళలో ఉండే చేపను మనింటికి తెచ్చకుందామా! కూర వండుకోవటానికి కాదు. మనింట్లో అందంగా అలంకరించు కోవడానికి మాత్రమేనండోయ్! నొప్పులు, జబ్బులు, మానసిక రోగాలు, మెదడు వ్యాధులకు వాడే రకరకాల టాట్లెట్లతో ఈ చేపను తయారు చేశాను. పసుపు, గులాబీ, అరేంజ్, గోధుమరంగు, ఎరుపు నలుపు, కాఫీ రంగు, బిస్కెట్ రంగు, ఆకుపచ్చ రంగులతో ఇక్కడ ఇంద్రధనస్సే పూస్తోంది. చేప అందాలు మరింత మెరుగయ్యాయి.

ఇంట్లో మిగిలిపోయిన టాబ్లెట్లుతో ఇలా చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here