ఫస్ట్ లవ్-2

0
13

[శ్రీ ఎం. వెంకటేశ్వరరావు రచించిన ‘ఫస్ట్ లవ్’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[హైదరాబాద్ నగరం. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన కార్తీక్ ఆఫీసుకు బయల్దేరి ట్రాఫిక్‍లో ఇరుక్కుంటాడు. కొద్దిసేపటి తర్వాత వాహనలు కదిలేసరికి, నెమ్మదిగా రద్దీని తప్పించుకుని ఆఫీసుకి చేరతాడు. పార్కింగ్ వద్ద కొలీగ్స్ అభిరాం, విఘ్నేష్ కలుస్తారు. ఫైకి వెళ్దామనుకునే సరికి లిఫ్ట్ కిందకి వస్తున్నట్టు ఇండికేటర్ ద్వారా తెలుస్తుంది. మరో కొలీగ్ మీనాక్షి కంగారుగా లిఫ్ట్ లోంచి బయటకి వస్తుంది. ఏంటంత కంగారు అని కార్తీక్ అడిగితే, సెల్ ఫోన్ మోపెడ్‍లో మర్చిపోయానని చెప్తూ బండి దగ్గరకి వెళ్తుంది. ఆమెకేసే చూస్తుండిపోతాడు అభిరాం. అతడిని హెచ్చరిస్తాడు కార్తీక్. సిగరెట్ తాగేందుకు స్మోక్ ఏరియాకి వెళ్తారు. ఇంతలో ముకుందన్ వచ్చి కలుస్తాడు. అతడికి అర్థం అవకూడదని అతడి గురించి తెలుగులో మాట్లాడుకుంటూంటారు. ఏంటి తెలుగులో మాట్లాడుకుంటున్నారని ముకుందన్ అడిగితే, అతను ఇష్టపడే శశికాంత డ్రెస్సింగ్ గురించి అంటారు. అందరూ ఆఫీసులోకి వెళ్తారు. హెచ్.ఆర్. హారిక వచ్చి కార్తీక్‍ని పలకరిస్తుంది, తనకి కొనిస్తానన్న పెర్ఫ్యూమ్ గురించి అడుగుతుంది. కాస్త రేటెక్కువగా ఉందని, ఒక్కోటి మూడు వేలని చెబితే, నీదీ కూడా డబ్బే కదా, వద్దులే అని అంటుంది. నీ కోసం కొనిస్తానని చెప్తాడు కార్తీక్. సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు ఓ డౌన్‍లో టర్నింగ్ తీసుకుంటుంటే, పక్కగా వెళ్తున్న ఓలా క్యాబ్‌ని తప్పించబోయిన ఓ మోపెడ్ వేగంగా వచ్చి బైక్‌ని గుద్దేస్తుంది. మోపెడ్‌తో సహా కింద పడిపోయిన అమ్మాయి దగ్గరికి వెళ్ళి మోపెడ్ తీసి నిలబెట్టి, ఆమెకి చెయ్యందించి లేపుతాడు. ఆమెకి చిన్న చిన్న దెబ్బలు తగిలితే, దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయిస్తాడు. ఆమె థాంక్స్ చెప్పి తన పేరు మేఘన అనీ, జె.పి. మోర్గాన్‍లో పని చేస్తున్నాని చెప్తుంది. కార్తీక్ తన గురించి చెప్తాడు. తన ఫోన్ నెంబర్ ఇచ్చి, మిస్డ్ కాల్ ఇవ్వమని చెప్తుంది మేఘన. రాత్రి పదవుతుంది. తన ఇంట్లో కార్తీక్ కాల్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది మేఘన. తాను ఎన్ని సార్లు చేసినా అతను ఫోన్ ఎత్తడు. నిద్రపోయే ముందు మరొకసారి ప్రయత్నిస్తుంది. ఫోన్ తీస్తాడు కార్తీక్. చాలా సార్లు ఫోన్ చేశానని మేఘన అంటే, బిజీగా ఉన్నాననీ, ఓ షార్ట్ ఫిలింకి మ్యూజిక్ చేస్తున్నానని చెప్తాడు. ఆమె ఇంకా ఏదో మాట్లాడబోతుంటే, నిద్ర వస్తోందని ఫోన్ పెట్టేస్తాడు. వారం తర్వాత కార్తీక్ ఓ స్ట్రీట్ ఫుడ్ దగ్గర బండివద్ద మిత్రులతో కలిసి పానీపూరి తింటుంటే మరో మిత్రుడు చైతన్య అక్కడికి వస్తాడు. తినడానికి పిలిస్తే, అంత హైజీనిక్‍గా ఉండదు, వద్దులే అంటాడు చైతన్య. అప్పుడా పానీపూరి బండి నడుపుతున్న రామకృష్ణ గురించి చెప్తాడు. అతను పోస్ట్ గ్రాడ్యుయేట్ అనీ, ఫుడ్ ఇండస్ట్రీలో స్టార్టప్‍లా దీన్ని నిర్వహిస్తున్నాడని చెప్తాడు. చైతన్య తినకుండా వెళ్ళిపోతాడు. ఇంతలో అక్కడికి మేఘన వచ్చి కార్తీక్‍ని పలకరిస్తుంది. ఆమెకి కూడా పానీపూరి ఆఫర్ చేస్తాడు. ఆమె కూడా తినడానికి సంశయిస్తుంది. రామకృష్ణ గురించి చెప్పి అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చెయ్యాలంటాడు కార్తీక్. నాకూ కొంచెం టైమివ్వండి అని మేఘన అంటే, సమయం వచ్చినప్పుడు తప్పకుండా కలుద్దాం అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక చదవండి.]

[dropcap]“హ[/dropcap]లో! కార్తీక్!” ఫోన్లో ఫ్రెండ్ సిద్ధార్థ.

“ఆ చెప్పు సిద్దూ!”

“నాలుగు రోజులు ఆఫీస్‌కి లీవ్ పెట్టగలవా?”

“ఎందుకు?”

“ఓ ఫ్రెండ్ చిన్న బడ్జెట్లో మూవీకి డైరెక్షన్ చేస్తున్నాడు. పేరు రాఘవ. ఇంజనీరింగ్ మన కాలేజీనే. మనకి సూపర్ సీనియర్. మన గ్రూప్ కొంచెం కోపరేట్ చేద్దాం. సాంగ్స్‌కి ట్యూన్స్ అతని దగ్గర ఉన్నాయి. ఆర్కెస్ట్రైజేషన్, బి.జి.ఎం.లో నువ్వు కీబోర్డు ప్లే చేయాలి. మూవీ సక్సెస్ అయితే మనందరికీ అవకాశాలు వస్తాయి. ఏమంటావ్?”

“నువ్వు చెప్పాక ఏమంటాను.. ఓ.కే.. అంటాను. నేను ఇప్పుడు రావాలో, ఎక్కడికి రావాలో చెప్పు”

“రాఘవ నా పక్కనే ఉన్నాడు మాట్లాడతావా!”

“ఇవ్వు”

“హలో రాఘవ గారూ! నమస్తే! ఐ యాం కార్తీక్.”

“కార్తీక్! మీ గరించి సిధ్ధూ చెప్పాడు. థాంక్యూ ఫర్ యువర్ కోపరేషన్. ఫ్యూచర్ ప్రాజెక్టులో మనందరం కలిసి పని చేద్దాం”

“ష్యూర్”

“ఓ.కే. మీట్ యు సూన్”

ఫోన్ కట్ అయింది. కార్తీక్ ఆఫీస్‌కి బయలుదేరాడు.

***

వారం తర్వాత కార్తీక్ ఫ్రెండ్స్‌తో పానీ పూరీ స్టాల్ దగ్గరకు వచ్చాడు.

అక్కడ పరిసరాలు అంతకు ముందు కంటే భిన్నంగా ఉన్నాయి. ‘పోస్టు గ్రాడ్యుయేట్ పానీ పూరి స్టాల్’ అని బోర్డు కూడా ఉంది. ఇంకో బోర్డు మీద రేట్ల వివరాలు ఉన్నాయి. బండి సమీపంలో క్రోటన్స్ మొక్కలు పెట్టాడు. కూర్చోవడానికి చేర్స్ కూడా వేశాడు.

“రేయ్! ఓ రేంజ్‌లో ఉంది కదా! టోటల్ ఎన్విరాన్మెంట్ మార్చేశాడు రామకృష్ణ” అన్నాడు అభిరాం.

“నాదేం లేదు సార్! అంతా కార్తీక్ గారి ఐడియానే” అన్నాడు రామకృష్ణ.

అంతలో అటుగా వెళ్తున్న చైతన్య కూడా బైక్ ఆపాడు.

అతనితో ఉన్న ఫ్రెండ్‌ని కూడా తీసుకొచ్చాడు.

“రామకృష్ణ గారూ! మాకు కూడా పానీపూరి ఇవ్వండి” అనేసరికి..

“మిస్టర్ ఓ.సి.డి.లో ఎంత మార్పురా?” అన్నాడు సురేష్.

“ఎంజాయ్ బ్రో! నాకు పని ఉంది వెళ్తాను” అని బయలుదేరాడు కార్తీక్.

***

“హలో మేఘన గారూ! నేను కార్తీక్‌ని.”

అంతే! అతనే ఫోన్ చేయటంతో ఆశ్చర్యపోయి, టైం చూసింది. అర్ధరాత్రి 12 గంటలు. నోట మాట రానట్టు

“కార్తీక్ గారూ! మీరు ఫోన్ చేశారా? ఇది మీ నిద్ర టైం కదా!” అంది.

“చిన్న పని ఉంది మేఘన గారూ!”

“అబ్బా! ఈ ‘గారు’ తీసేయ్యండి”

“కొన్ని కొన్ని ఉంటేనే బాగుంటాయి.”

“సరే! చెప్పండి. చిన్న పనైనా, పెద్ద పనైనా పర్లేదు. నిర్మొహమాటంగా చెప్పండి”

“మీ కంపెనీలో రీసెంట్‌గా ‘పాడుతా తీయగా’ ప్రోగ్రాంలో పాడుతున్న సౌమ్య అనే సింగర్ ఉంది. ఆమె ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు. వీలుంటే, మీకు తెలిస్తే ఆమె నంబర్ నాకు ఇవ్వగలరా! డైరెక్టర్ కొత్త వాళ్ళ చేత ట్రై చేద్దామన్నారు”

“వావ్! గ్రేట్.. ఆమె గురించి విన్నాను. కానీ నాకు పరిచయం లేదు. టుమారో లెట్ యు నో..”

“థాంక్స్ అండి! సారీ! మీకు శ్రమ ఇస్తున్నందుకు”

“శ్రమ ఇవ్వనందుకు ఫీల్ అవ్వండి” అంది.

“రేపు మీ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తుంటాను. బై. గుడ్ నైట్..” ఫోన్ కట్ అయింది.

***

ఉదయం 6 గంటలు:

మేఘన ఫోన్ చేసి “హలో గుడ్ మార్నింగ్ కార్తీక్! నిద్ర లేచారా?” అంది.

“ఆ చెప్పండి.” అన్నాడు బద్దకంగా.

“మా ఫ్రెండ్‌ని అడిగి సౌమ్య నంబర్ తీసుకున్నాను. మీకు మేసేజ్ చేశాను. తనతో ఇప్పుడే మాట్లాడాను. మీరు టైం చూసుకుని తనకి కాల్ చెయ్యండి” అంది.

“గ్రేట్.. మేఘన గారూ మీరు! థాంక్యూ! ఆమెతో మాట్లాడిన తర్వత మీకు కాల్ చేస్తా” అన్నాడు.

“ఓ.కే. అండీ! హేవ్ ఎ గుడ్ డే”

“థాంక్యూ”

***

ఉదయం 7 గంటలు:

ఫోన్ మోగుతుంటే కార్తీక్ “హలో” అన్నాడు.

“గుడ్ మార్నింగ్ సార్! నా పేరు సౌమ్య. మేఘన గారు మీ రిఫరెన్స్ ఇచ్చారు.”

“హలో! గుడ్ మార్నింగ్ సౌమ్య గారూ! మీ పాట ‘పాడుతా తీయగా’లో విన్నాను. నేను షార్ట్ ఫిలింకి మ్యూజిక్ డైరెక్టర్‌గా చేస్తాను. మా ఫ్రెండ్ లో-బడ్జెట్ మూవీ తీస్తున్నాడు. కొత్త సింగర్ కావాలన్నాడు. నాకు వెంటనే మీరు గుర్తొచ్చారు”

“థాంక్యూ సార్!” అంది ఎక్సైటింగ్‌గా.

“ఈ రోజు మీరు ఫ్రీ అయితే, ఎక్కడికి రావాలో నేను కన్ఫర్మ్ చేసి, మీకు 10 గంటల తర్వాత కాల్ చేస్తాను”

“ష్యూర్! సార్! థాంక్స్ ఒన్స్ ఎగైన్”

“అదేం లేదండి! మీ వాయిస్ చాలా బాగుంటుంది. ఒ.కే.. బై”

***

ఆ రోజు రాత్రి 7:00 గంటలకి మేఘనకి ఫోన్ చేసింది సౌమ్య.

“థాంక్స్ అండీ! ఈరోజు అభేరి స్టూడియోకి రమ్మన్నారు. సాంగ్ బాగా వచ్చిందని అప్రిషియేట్ చేశారు. మీరు జె.పి మోర్గాన్ లోనే కదా! రేపు కలుద్దాం” అంది.

“థాంక్స్ నాకు కాదు. కార్తీక్ గారికి చెప్పండి”

“చెప్పాను. ఆయనేమో మీకు చెప్పమన్నారు”

“రేపు మీరు ఆఫీసుకి వచ్చాక కాల్ చేయండి. కలుద్దాం. కంగ్రాట్యులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్” అంది మేఘన

వెంటనే కార్తీక్ కి కాల్ చేసింది మేఘన.

“హలో!”

“థాంక్స్ కార్తీక్ గారూ! సౌమ్యకి ఛాన్స్ ఇప్పించినందుకు” అంది.

“అయ్యో! ఆమెకు టాలెంట్ ఉంది. అవకాశం వచ్చింది.”

“ఏది ఏమైనా! గుర్తుపెట్టుకుని అవకాశం ఇచ్చారు కదా!”

“ఆమె నెంబర్ ఇచ్చి మాట్లాడించింది మీరే కదా! నేనే మీకు థాంక్స్ చెప్పాలి. ఆమె పాట చాలా బాగుంది”

“ఎప్పుడు వినిపిస్తారు?”

“ఆడియో రిలీజ్ అయ్యాక”

“మీరు పార్టీ ఇవ్వాలి”

“కచ్చితంగా.. ప్లేసు,టైము మీరే ఫిక్స్ చేసి చెప్పండి”

“పోస్ట్ గ్రాడ్యుయేట్ పానీ పూరి సెంటర్” అంది.

“నిజమా! మీరు అక్కడికి వస్తారా! మీరు ఎక్కడపడితే, అక్కడ తినరు కదా!”

“లేదు మొన్న మా ఫ్రెండ్‌తో వెళ్లాను. మీ ప్రోత్సాహంతో రామకృష్ణ చాలా మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశాడు. కస్టమర్స్ కూడా బాగా వస్తున్నారని చెప్పాడు”

“ఓ.కే సౌమ్య గారిని కూడా తీసుకురండి”

“నేను ఒక్కదాన్నే వస్తే రానివ్వరా”

“తినబోయేదీ.. తినాల్సిందీ మీరు” అన్నాడు.

“అయితే రేపు సాయంత్రం కలుద్దాం”అంది.

“ఓ.కే.”

***

కార్తీక్ శ్రీనగర్ కాలనీలో ఉన్న సినిమా ఆఫీస్‌కి వెళ్ళాడు.

“రా! కార్తీక్! సాంగ్ ఎక్స్‌లెంట్‌గా వచ్చింది. డైరెక్టర్ చాలా హ్యాపీగా ఉన్నాడు.” అన్నాడు సిద్దూ.

“అంతా నీ ఎంకరేజ్మెంట్ వల్లే సిద్ధూ!”

“ఈ సాంగ్ కంపోజింగ్, ఆర్కెస్ట్రైజేషన్ లోఎక్కువ ఇన్వాల్వ్ అయింది నువ్వే. రాఘవ పార్టీ ఇస్తానంటున్నాడు. నువ్వు ఓ.కే అంటే..” అన్నాడు సిద్దు

“రేపు నాకు పని ఉంది”

అంతలోలో రాఘవ వచ్చాడు. సిద్దు, కార్తిక్ విష్ చేశారు.

“కార్తీక్ నీకు యాక్టింగ్‌లో ఇంట్రెస్ట్ ఉందా?” అన్నాడు రాఘవ.

“ఎప్పుడూ అనుకోలేదు. మ్యూజిక్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్”

“ఎప్పటినుంచో ఓ షార్ట్ ఫిలిం చేయాలనుకుంటున్నాను. రెండే క్యారెక్టర్లు. టైటిల్ ‘నువ్వెవరో – నేనెవరో’ క్యూట్ లవ్ స్టోరీ. నువ్వైతే ఆ క్యారెక్టర్‌కి బాగుంటుందనిపిస్తోంది. నువ్వు చేస్తానంటే త్వరలో పనులు ప్రారంభిద్దాం.” అన్నాడు.

“సార్! మీరు మూవీ చేస్తూ మళ్ళీ షార్ట్ ఫిల్మ్ ఏంటి?” అన్నాడు సిద్దు.

“బిర్యానీ తిన్నామని ముద్దపప్పు, ఆవకాయ మర్చిపోతామా? నన్ను మూవీ డైరెక్టర్‌ని చేసిందే నేను తీసిన షార్ట్ ఫిలిం” అన్నాడు రాఘవ.

“రేపు చెప్తాను. సార్!” అన్నాడు కార్తీక్.

“ఈ రోజు సాయంత్రం చిన్న గెట్ టు గెదర్. ప్రొడ్యూసర్ కూడా వస్తున్నాడు. ప్లీజ్ కం”

“ఓ.కే సార్! నాకు పని ఉంది వెళ్తాను. సాయంత్రం కలుద్దాం” అని బయలుదేరాడు కార్తీక్.

***

మరుసటి రోజు సాయంత్రం:

పోస్ట్ గ్రాడ్యుయేట్ పానీ పూరి సెంటర్ దగ్గరికి 5 గంటలకు వచ్చింది మేఘన. అప్పటికి కార్తీక్ రాలేదు.

కార్తీక్‌కి ఫోన్ చేసింది.

“ఐ యాం ఆన్ ది వే” అన్నాడు.

పది నిమిషాల తర్వాత వచ్చాడు కార్తీక్.

కార్తీక్‌ని చూడగానే “హలో! ఏంటి లేటు?”

“లేడీస్ ఫస్ట్ కదా! మీ కంటే ముందు వస్తే బాగుండదని”

“కావాలని రీజన్స్ చెప్తున్నట్టుంది”

బైక్ పార్క్ చేసి “అదేం లేదు. ట్రాఫిక్ ఎక్కువగా ఉంది.” అన్నాడు.

“ఏంటి ఇక్కడ పర్యావరణం పరిశుభ్రంగా మారిపోయింది”

“మీరు పానీపూరి తినటానికి వస్తున్నారని, ఈ రామకృష్ణ గారికి చెప్పాను. అంతే! ఎంతో వినయంగా పరిసరాలను పరిశుభ్రం చేశాడు”

మేఘన నవ్వింది.

ఇద్దరూ పానిపూరి తిన్నాక

“ఎంత టేస్టీగా ఉందో చూశారా! ఇటువైపు వచ్చినప్పుడు ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్‌ని ఎంకరేజ్ చేయండి. ఈసారి మీరు వచ్చేసరికి వెరైటీ, వెరైటీ దోసెలు కూడా దొరుకుతాయి” అన్నాడు.

“మీ వాలకం చూస్తే మీరే ఇక్కడ పానీపూరి, దోశలు అమ్మే ‘కార్తీక్ ఫుడ్ సెంటర్’ (KFC) ఓపెన్ చేసేలా ఉన్నారు”

“తప్పేం లేదు మేడం. కల్నల్ ల్యాండ్ శాండర్స్ మొదట్లో రోడ్ సైడ్ రెస్టారెంట్ తెరిచి ఉండకపోతే మనం ఈరోజు KFC చూసే వాళ్ళమా! ఆస్వాదిస్తూ తినేవాళ్ళమా?”

“అర్థమైంది కార్తీక్ గారూ! వినండి. ఈ పీ.జీ ఫుడ్ స్టాల్‌కి ఇహ నుండీ మేమూ కస్టమర్లమే. అంతేకాదండోయ్! మీరు నాకు పార్టనర్‌షిప్ ఇవ్వాలి” అంది.

“తప్పకుండా!”

కార్తీకి డైరెక్టర్ రాఘవ దగ్గర్నుంచి ఫోన్ కాల్ వచ్చింది.

“సరే! మేఘన గారూ! నేను అర్జెంటుగా వెళ్లి, డైరెక్టర్ని కలవాలి. తర్వాత కలుద్దాం” అని రామకృష్ణకి బిల్ గూగుల్ పే చేసాడు.

“ఓకే! ఆల్ ద బెస్ట్ బై” అని మేఘన కూడా వెళ్ళింది.

***

ఆ రోజు ఆఫీసులో మేనేజర్ కార్తీక్ తో “యూ.ఎస్. వెళ్లే ప్రాజెక్టుకి నిన్ను సెలెక్ట్ చేశారు. వెళ్ళాలి” అన్నాడు.

మరొకరు అయితే ఎగిరి గంతేసేవాళ్ళు.

“సర్ ఐ హావ్ పర్సనల్ కన్‌స్ట్రెయిన్స్”

“ఏంటవి?”

“పర్సనల్ వర్క్ సార్! బట్ ఐ విల్ టేక్ కేర్ థింగ్స్ హియర్”

“సీ! థిస్ ఈజ్ ఎ గుడ్ ఆపర్చూనిటీ. ఆలోచించుకొని చెప్పు”

“లేదు సార్! నాకు వీలుపడదు.”

“ఇటీజ్ అప్ టు యు” అన్నాడు మేనేజరు

బయటికి రాగానే సురేష్ అడిగాడు – “ఏమైందిరా? ఓకే అన్నావా?”

“లేదురా! నాకు సినిమా ప్రాజెక్ట్ ఉంది. నాకు యూ. ఎస్. వెళ్లడం కంటే నాకు ఇష్టమైన మ్యూజిక్‌లో డెవలప్ అవ్వాలని ఉంది. ఇప్పుడు నేను వెళితే సినిమా ఛాన్స్ పోతుంది.”

“శేఖర్‌ని సజెస్ట్ చెయ్యి. వాడికి ఇంట్రెస్ట్ కూడా” అన్నాడు.

“ఏంట్రా! ఇది.. యూ.ఎస్ ఛాన్స్ వస్తే ఎందుకు వదులుకుంటావు? అక్కడినుంచి మ్యూజిక్..” అంటుంటే..

“లీవిట్ రా! ఎవరి టేస్ట్ వాళ్ళది” అని బయటికి వచ్చాడు కార్తీక్..

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here