గాలి కోసం

0
11

[శ్రీ వశిష్ఠ సోమేపల్లి గారు రచించిన ‘గాలి కోసం’ అనే కవితని అందిస్తున్నాము.]

[dropcap]ఉ[/dropcap]క్క పోస్తుంది
పిడికిలి తెరవాలని వుంటుంది
కానీ వేళ్ళు కదలవు

గుప్పిట్లో రహస్యాలేం లేవు
అరచేయికి ఊపిరినివ్వాలనే వుంది

ముందు, వంగిన వేళ్ళకు పదునుగా నిలబడడం నేర్పాలి
విశ్వమంత గాలితో చేగీతల్ని ఉక్కిరిబిక్కిరి చేయాలి
తెరలు జరిపి కొద్దిగా నవ్వాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here