గాయం

0
6

[box type=’note’ fontsize=’16’] భారత పాకిస్తాన్ విభజన నేపథ్యం ఇతివృత్తంగా పంజాబీలో కుల్వంత్ సింగ్ విర్క్ రాసిన కథని తెలుగులో అందిస్తున్నారు మౌద్గల్యస. [/box]

[dropcap]ఇ[/dropcap]ది పాకిస్తాన్ కథ. ఆ దేశం విభజన తర్వాత కొత్తగా ఏర్పాటయి మూడు నాలుగు నెలలయి ఉడింది.

అంతా కలగాపులగంగా గాందరగోళంగా ఉంది. పోలీసు స్టేషన్లు, చిన్న చిన్న పోలీసు అవుట్ పోస్టులు కుర్చీలు, సోఫాలు, మంచాలు, ఫోటోలు, ఇతరత్రా చెత్తా చెదారంతా నిండిపోయాయి.

ఇంట్లో ఎంతో విలువయినవి, అనుభూతుల్ని నింపిన ఈ వస్తువులు ఇక్కడ ఇలా ఉండడమేమిటని చూసిన వాళ్లెవరికయినా అనిపించి తీరుతుంది.

అవన్నీ గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి.

ప్రభుత్వ కార్యాలయాల ముందర వంట సామాన్లున్న కప్ బోర్డులు చెల్లా చెదురుగా కనిపిస్తున్నాయి.

వాటినెవరూ తాకిన పాపాన పోలేదు.

అసలు ఎన్ని అలా పడి ఉన్నాయన్న లెక్క కూడా లేదు.

అసలు పాకిస్తాన్‌లో అంతా చెల్లా చెదురుగా దేశమంతా స్థానభ్రంశం అయినట్టుగా తయారైంది. పశువులు తమ యజమానుల ఆలనాపాలనా నుంచి దూరమై దిక్కు మొక్కూ లేకుండా ఉన్నాయి.

పిసరంత గడ్డి పెట్టి సంరక్షించే నాథుడి కోసం అవి ఆశగా ఎదురుచూస్తున్నాయి.

ఒక్క భూమి మినహా అన్ని జీవరాశులూ తమ ఉనికి కోసం పోరాడుతున్నట్టు ఉన్నాయి.

వందలాది మంది శరణార్థులు ఈ భూమండలం పైన తాము నివాసం ఏర్పరచుకోగల జాగా కోసం తాపత్రయపడుతున్నారు.

‘వాఘా’ సరిహద్దులో మేజర్ క్యాంపు నుంచి ఈ దురదృష్టవంతులంతా…. కాలి నడకకి, రైళ్లను ఆశ్రయించి గ్రామాలను వదులుతున్నారు. జిల్లాలు దాటుతున్నారు.

కాసింత చోటు కోసం గుండెలు చిక్కపట్టకుని వెతుకులాడుతున్నారు.

ఈ శరణార్థుల బాధలు ఏమని చెప్పటం…? ఒకప్పుడు స్థిరంగా సాగుతున్న వారి జీవనం ఛిన్నాభిన్నమైపోయింది.

కులం, జాతి, వర్గం అన్న తేడా లేకుండా అంతా చెల్లా చెదురైపోయారు. అన్న, చెల్లి, తమ్ముడు, స్నేహితుడు…. ఇలా అన్ని బంధాలకు దురమైపోయారు.

యజమాని, పనివాడు అన్న భేదాలు సమసిపోయి ఒకరికొకరు ఎవరెక్కడున్నారో తెలియని పరిస్థితి ఏర్పడింది.

పాత వాళ్ల స్థానంలో అందరూ కొత్తవారు చేరారు. ఈ కొత్త వారంతా కనీసం ఒకరికొకరు పలకరించుకోలేకపోతున్నారు.

‘సలాం వాలేకుం’ అని అవతల వారు నోరు తెరిచి పలకించినా బిత్తర చూపులు చూస్తూ ఉండిపోతున్నారు తప్ప…. వాళ్ళలో ఎలాంటి ప్రతిస్పందన కనిపించటం లేదు. నిజం చెప్పాలంటే వాళ్లు ఈ గ్రామాల మూలాలనే కుకటివేళ్లతో పెకిలించి వేశారు.

ఇక కొన్నాళ్లుగా అక్కడే నివాసం ఉంటున్న వారు తమ గ్రామ స్వరూపం, పుట్టి పెరిగిన ఉరు పూర్తిగా మారిపోయిందని, తాము పరాయి వాళ్లమైపోయామని కలత చెందటం మొదలు పెట్టారు. అక్కడున్న వాగులు, వంకలు కూడా తమకి సంబంధించనివిగా మారిపోయాయి. వాటికి దగ్గిరగా వెళ్లటానికే వారు జంకుతున్నారు.

చాలా రోజుల వరకూ వాటిల్లో మృతకళేబరాలు. మానవ శరీరాల్లా ఛిద్రమైన అవయవాలు తేలియాడుతుండేవి. నీరు ఎర్రటి ద్రావకంగా మారిపోయింది. తమ శత్రువులు కూడా అందులో అడుగుపెట్టేందుకు అభ్యయంతర పెట్టేదిగా పరిస్థితి మారిపోయింది. కానీ ప్రతి వస్తువు తమ పూర్వరూపం సంతరించుకోవటానికి విశ్వప్రయత్నం చేస్తున్నాయి. సృష్టిలో దేనికైనా పునర్వికాశం, పునర్నిర్మాణం తప్పనిసరి కదా…

“ఈ దేశమంతా బీభత్సంగా తయారైంది…” చుట్టూ ఉన్న చెత్తా చెదారాన్ని, చెల్లా చెదురైన వాతావరణాన్నిచూస్తూ జాట్… ఒకరు తన ముసలి తండ్రితో చెప్పాడు.

“నువ్వు చెప్పింది నిజమే. అయితే దేముడి దయవల్ల అందరూ జీవించటానికి అనువైన పరిస్థితులు ఏర్పడితే అంతా సర్దుకుంటుంది” భవిష్యత్తు పైన కొండంత నమ్మకంతో చెప్పాడాయన.

“ఇదంతా వృధా ప్రసంగమే. ఈ పేదలు, నిర్భాగ్యులు ఎక్కడని ఉంటారు. వారికి పిడికెడు ముద్దయినా పెట్టే వాళ్లు లేరు కదా…” నిరాశగా అన్నాడు, ముసలాయన మాటల్ని తేలిగ్గా కొట్టి పారేస్తూ…

“అదే కాదు” అంటూ అయన చెప్పటం ప్రారంభించాడు.

“ఒక సారి పొలంలో పెరిగే ఆ కలుపు మొక్కల వంక చూడు. మాములు వాటికి ఆ పిచ్చి మొక్కలకి తేడా గ్రహించటం కష్టం. వాటిని పెరికి బయట పడేసినా, పది పన్నెండు రోజుల తర్వాత తిరిగి మొలకెత్తుతాయి. ఓ నెల తర్వాత చూస్తే అసలు అక్క పొలం సాగు చేశారా అన్న అనుమానం కలుగుతుంది ఎవరికైనా.”

ఆ ముసలాయన మాటల్లో నిజం లేకపోలేదు. పొలం దక్కించుకున్న వాళ్లు జీవితంలో స్థిరపడుతున్నారు. ఆ పొలం తమకు శాశ్వతంగా దక్కకపోయినా, దాని యజమాన్యం తాత్కాలికమైనదే అయినా ఆ భూమి వారి మనసులకు ఉపశమనం కలిగిస్తోంది. పొలం చుట్టు పక్కల చిన్న చిన్న గోతులు తవ్వి అందులో పశువుల పేడ భద్రపరుస్తారు. అవసరాన్ని బట్టి పిడకలు చేసుకుంటారు. ఈ పిడికల్నే హుక్కా తాగటానికి వాడుకుంటున్నారు.

పశువులు కూడా వాళ్ల సంరక్షణలో భద్రంగా ఉంటున్నాయి. అవి చెట్ల దగ్గిరకు వెళ్లి తమ శరీరాలను వాటి కేసి రుద్దుకుంటున్నాయి. ఒక్క సారి గోడల పక్క కెళ్లి ఒకదానికొకటి ముచ్చట్లాడుకుంటున్నట్టుగా కనిపిస్తున్నాయి.

ఈ కొత్త గ్రామాలకు ఏ తహశిల్దారో వచ్చినపుడు.. గ్రామ పెద్దల్లా వారు సమస్యలను ఏకరువు పెడుతున్నారు. ఈ రకంగా వార్లు నాయకత్వ బాధ్యతల్ని తలకెత్తుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడున్న అందర్ని వరుసలో నిలుచోబెట్టటం, ఒకరు తర్వాత మరొకరు మాట్లాడవలసిందని చెప్పడం లాంటి చిన్న చిన్న పనులతో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. విభజన గాయాల నుంచి తాము ఇంకా కోలుకోలేదని అందరితో చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు.

బీభత్సం నుంచి కోలుకుంటున్న ఈ పాకిస్తాన్ దేశంలో నేను భారత ప్రభుత్వం తరఫున అనుసంధాన అధికారి (లయజన్ ఆఫీసర్)గా నియమితుడయ్యాను. నా ఉద్యోగం ఏమిటంటే… అపహరణకు గురైన లేదా చెరపట్టి బడిన మహిళలను సంరక్షించటం, నిర్భంధంగా ఇస్లాం మతాంతీకరణకు గురైన వారిని గుర్తించి భద్రంగా మన దేశానికి తిరిగి పంపిచటం. ఈ బాధ్యతలు నిర్వర్తించటానికి భారత సైనికులు కొందరు, పాకిస్తాన్ ప్రత్యేక పోలీసు దళం వారు నాకు సాయంగా ఉన్నారు.

మిగతా అన్ని విషయాల మాదిరిగానే తప్పిపోయిన ఆడపిల్లలను వెతకడం సులువైనది. కొన్ని సందర్భాల్లో అత్యంత కష్టమైనది కూడ. ఎంత ప్రయత్నించినా వార్లు దొరికే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి.

నిజానికి పాకిస్తాన్ పోలీసు దళం తలుచుకుంటే ఇదేమంత కష్టమైన పని కాదు. తక్కువ సందర్భాల్లో వార్లు బాధితుల ఆచూకీ గురించి బయలు పెట్టేవారు. ఈ కార్యక్రమాన్ని వారు రికవరీ(గుర్తించటం)గా వ్యవహరించేవారు.

ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటనలో పోలీసు స్టేషన్ ఇన్‌చార్జి బాధితురాల వివరాలు చెప్పటమే కాదు ఆమెను కలవటానికి నా వెంట వచ్చారు కూడా. అదే పోలీసు స్టేషను పరిధిలో ఉన్న ఓ గ్రామానికి చెందిన పెద్ద ఒకరి కుమార్తెగా ఆమె గురించి నాకు చెప్పుకొచ్చారు.

తారు రోడ్డను దాటి దూరం గతుకుల బాటలో ప్రయాణిస్తే గానీ, ప్రాంతాన్ని చేరుకోలేక పోయాం. గ్రామానికి చెందిన పెద్ద మనుషులంతా అక్కడ గుమిగూడి ఉన్నారు. మేముక్కడికి వెళ్లగానే పోలీసుస్టేషన్ ఇన్‌చార్చి… ఆ మాహిళ గురించి వాకబు చేశారు. వాళ్లు అక్కడున్న ఇంటి పై భాగాన్ని చూపారు. నేనొక్కడినే మెట్లిక్కి నడుచుకుంటూ పైకి దారి తీశాను. మిగిలిన వాళ్లంతా కిందే నిలబడిపోయారు.

అది శ్లాబ్ పైనున్న చిన్న గది. మెటల్ ట్రేలర్‌తో దాన్ని రూపొందించారు… ఆ గదిలో ఓ మూల బెడ్డింగు, పక్కన చెక్క బీరువా… దాని పైన ఏవో చెత్తాచెదారం పడి ఉన్నాయి.

ఆ మహిళ మంచం మీద ముడుచుకుని పడుకుని ఉంది. ఆమె ఒక చేతికి బ్యాండేజి. బహుశా చేతికి తీవ్రమైన గాయమై చీము కారుతున్నట్లుగా అనిపించింది. ఆమె బలహీనంగా ఉంది. చాలా కాలంగా తీవ్ర అనారోగ్యం పాలయినట్టు చూడగానే అర్థమయ్యేలా ఉంది. నేను ఆమె పక్కన మంచం పైన కూర్చుని సంభాషణ ప్రారంభించాను.

“ఎలా ఉన్నావు?” పరామర్శస్తున్నట్టుగా అడాగను.

“గత కొన్ని రోజులుగా తీవ్రంగా జ్వర పడ్డాను.”

“మరి నీకు సాయంగా తోటి ఆడవాళ్లు ఎవరూ లేరా?”

“లేరు.”

ఆమెను చూడగానే నాకు హృదయం ద్రవించింది. ఇంతకు ముందు నేను చూసిన మహిళల పరిస్థితికీ ఆమెకు చాలా తేడా ఉంది. ఆమె చుట్టు ఉన్న వాతావరణం కూడా భిన్నంగా కనిపించింది.

మిగతా మహిళల సంబంధీకులు మగ వాళ్లే, ఆడవాళ్లు ఎవరొ ఒకరు సంరక్షణ అక్కడండేది. ఇక్కడ ఆమె చెప్పుకోటానికి నా అనే వ్యక్తులు లేరు. చాలా కాలంగా ఆమె ఇలానే ఒంటరిగా జీవిస్తున్నట్లుగా నాకు అనిపించింది.

ఆమెను ఎవరో తీసుకొచ్చి టెర్రస్ పైన పడేసి, ఆమె బతుకుని ఖర్మానికి వదిలేశారని నాకు అనిపించింది. ఆమె నివసించిన గ్రామం మొత్తం ఆ కుటుంబంతో సహా బీభత్సకాండలో మరణించారని ఇంతకు ముందు విని ఉన్నాను. దాని గురించి మళ్లీ ప్రస్తావించటం అనవసరమనిపించింది. ఇప్పుడు నాకు కావలసింది ఆమె ప్రస్తుత పరిస్థితి గురించి మాత్రమే.

“ఎంత కాలంగా నువ్వుక్కడ ఉన్నావు” అడిగాను.

“మా గ్రామం నాశనమైన దగ్గర్నుంచి” క్లుప్తంగా సమాధానం చెప్పింది.

“ఈ గిన్నెలు బట్టలు నీకెవరు ఇచ్చారు?”

“ఇలాంటి పిచ్చి ప్రశ్న మీరెందుకు వేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు” సూటిగా చెప్పంది.

ఆమె ఇక్కడి ఒంటిరిగా ఉండటం లేదని, ఆ సామాన్లు ఆమె సొత్తు కాదని నాకు అర్థమైంది. ఈ ఇంటి యజమాని ఎవరో ఆలోచించడం మొదలు పెట్టాను.

ఈ అనుభవాన్ని ఇంత తేలిగ్గా ఇక్కడు వివరించగలుగుతున్నాను గానీ నిజానికి ప్రత్యక్షంగా అనుభవించినప్పుడు నేను పడ్డ క్షోభ అంతా యింతా కాదు. ఆ సమయంలో నా శరీరాన్ని, ఆత్మని ఈ సంఘటన నిలువెల్లా కుదిపేసింది. నాదైన రీతిన పోలీసులకు, బాధితులకు నేనందిస్తున్న సహకారం ప్రపంచంలో నేను తెచ్చుకున్న పేరు ప్రఖ్యాతులు నన్ను నిలదీస్తున్నట్టుగా అనిపించాయి. జీవితానికి సంబంధించిన చేదు, విషాదం కళ్ల ముందు ప్రత్యక్షమై నన్ను వెక్కిరిస్తున్నట్టుగా అనుభూతి చెందాను. మనిషి మరో మనిషి పట్ల చూపే అమానుషత్వానికి క్రూరత్వానికి సాక్షీభూతంగా మహిళ దిక్కు లేకుండా ఆ మంచం పైన పడి ఉంది.

ఆమె కులం, మతం, వర్గం… ఆమెకు సంబంధించిన బంధుమిత్రులు ఎవరూ ఆమె బాధను పంచుకునేందుకు లేరు.

ఆమె సంబంధీకులను కలుసుకొనగ లేదు… నాలుగు ఓ దార్పు మాటలు చెప్పేవారు లేరు. ఒక వేళ ఎవరైనా ఆమెకు ఆ మాటలు చెప్పినా తను నమ్మగలిగే ధైర్యసాహసాలు ఎవరికున్నాయి, ఆ విషయం ఆలోచింటం కూడా దండగే.

ఈ సమయంలో ఆమెను ఇక్కడ నుంచి కదపటం కష్టం. ఆమె అనారోగ్యం తీవ్రమై పరిస్థితి చేజారిపోయేటట్టుగా ఉంది. ఇప్పుడు మేం ఆమెను కనుగొన్నాం కాబట్టి గ్రామస్థులు ఆమెను ఇక ఏ మాత్రం దాచి పెట్టలేరు.

“సరే నేను మళ్లీ వస్తాను.”

ఆమెను రక్షించి తీసికెళ్లగలననే నమ్మకం ఇవ్వటానికి చెప్పాను. బహుశా ఆమె కలలో కూడా ఈ విషయం ఊహించి ఉండదు.

“మరిప్పుడే వెళ్లి పోతున్నారా?”

ఆమె మాటల్లో ఏదో చెప్పుకోవాలన్న ఆరాటం కనిపిస్తోంది.

“ఒక్క నిముషం కూర్చుని నేను చెప్పేది తాపీగా వినండి” బతిమాలుతున్నట్టుగా అడిగింది.

నేను మరి కాసేపు కూర్చోక తప్పలేదు.

“మీరు సాయపడదలుచుకంటే… నా విషయాలు కొన్ని వివరించదలుచున్నాను. మీకు అర్జీ పెట్టదలుచుకున్నాను. ”

“దేని గురించి?”

మీరు నా సిక్కు సోదరుడు. నేనూ సిక్కనే. అయితే ఇక్కడ నేను ముస్లింని. ఈ ప్రపంచంలో నాకంటూ ఎవరూ లేరు. ఓదార్చేవారు గానీ, ఆదుకునే వారు గానీ లేని ఈ దుఃఖ సమయంలో చేతులు సాచి మీ సాయం కోరుతున్నాను.

మా వదిన ‘తిక్కి’లో ఉంది. ‘చక్యాలా’ గ్రామంలో కొందరు నిర్బంధంగా ఆమెను ఎత్తుకు పోయారు. మత ఘర్షణలు చెలరేగనన్నది మా పైన దాడి… అప్పుడే ఆమెను ఎత్తుకు పోయారనిపిస్తోంది.

మీరు పవర్‌ఫుల్ (శక్తివంతమైన) స్థానంలో ఉన్నారు. అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. పోలీసులు కూడా మీరు చెప్పిన మాట వింటారు. నా తరుఫున వారికి మనవి చేయండి. నేను వారి సొంత సోదరుని భార్య లాంటి దానిని అనుకోమనండి.

ఆమెను నా చేతులతో సాకాను… ఒక తల్లిగా ఆమె నా దగ్గరికి తిరిగి వస్తే యోగ్యమైన వ్యక్తిని చూసి పెళ్లి చేస్తాను. ఆమె, ఆమె కుటుంబం అందరూ నాకు తోడుగా ఉంటే నాకు బలం, కష్టసుఖాలు పంచుకునేందుకు నా అన్న వాళ్ళున్నారన్న తృప్తి సంతోషం…

“………………..”

ఇంకా ఆమె ఏదేదో చెబుతోంది.

ఆమె చెప్పేది వింటుంటే…

ఇంతకు ముందు ముసలాయన చెప్పిన మాటలు నా చెవుల్లో గింగారుమన్నాయి..

“పొలంలో పెరుగుతున్న ఆ గడ్డిని చూడు. నాగలితో దున్నేటప్పుడు అసలు మొక్కలకి, కలుపు మొక్కలకి ఏ మాత్రం తేడా కనబడదు. కలుపు మొక్కలు పెరికి అవతల పారేస్తాం. అయితే కొన్ని రోజుల తర్వాత అవి యధావిధిగా మొలకెత్తుతాయి.”

పంజాబి మూలం: కుల్వంత్ సింగ్ విర్క్,

అనువాదం: మౌద్గల్యస

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here