గణపతి చవితి

0
15

[2024 సెప్టెంబర్ 07 వినాయక చవితి పర్వదినం సందర్భంగా – ‘గణపతి చవితి’ అనే కవితని అందిస్తున్నారు శ్రీ శంకరప్రసాద్.]

[dropcap]న[/dropcap]లుగు నుండి వచ్చినావు
అమ్మ ఊపిరి పోయగ నీకు
ముద్దు బాలుడిగ అవతరించి
జనని ఆనను శిరసావహించి

లోక జనకుని ఎదిరించినావు
శిరసు తెగి కింద పడినా
అమ్మ మాటను నిలిపిన నీవు
ఆదర్శ పుత్రుడవు గణనాయకా

కరి వదనము తెచ్చి పెట్టగ నీవు
ముద్దుగ గజాననుడవయినావు
మాతా పితరుల సేవ చేయుచు
గణనాథుడిగా గెలుపొందినావు

విఘ్నములకు రాజువు నీవే
వినాయకా మోదకములు చూడ
మోదము కలుగు నీకు ఉమాపుత్రా
ప్రసన్న వదనముతో విరాజిల్లెదవు

భక్తుల కోర్కెలు తీర్చు వరదుడవు
చవితి దినమున నిను అర్చించి
ఫలాహారములు పెట్టిన చాలు
కరుణించి కటాక్షించి కాచెదవు

ఓ గణనాథా నీకు మ్రొక్కెదన్
మము కావుము దేవా విఘ్నపతీ
భరతమాత బిడ్డలను చల్లగ చూచి
ధర్మ రక్షకులను నీవే రక్షించు స్వామీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here