గందరగోళం

0
8

[dropcap]క[/dropcap]వి కలం కలవరపడుతోంది-
కల్లోలమైన సమాజాన్ని
అక్షరీకరించలేని అశక్తతతో..!

అక్షరం అల్లాడుతోంది,
అతుకుల బొంతల
అనుబంధ బాంధవ్యాలను
అర్థం చేసుకోజాలక!!

కవిత తికమక పడుతోంది,
సామాన్యుడి కష్టాలకు
అసలైన అర్థాలు వెతకలేక..!

విమర్శకుల నోళ్లు మూతపడ్డాయి
విషం చిమ్మే అధికార వ్యవస్థల
అదుపులేని ఆగడాలతో!!

అర్థవంతమైన రచనలతో,
సమాజానికి దశ, దిశ చూపే,
రచయితలు సైతం..
స్పందనలేని సమాజాన్ని వీక్షించి,
విరక్తితో నవ్వుతున్నారు!!

ఇదే నేటి సమాజ పయనం..
గమ్యం తెలియని…
గందరగోళ రాజ్యం!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here