గతుకు

4
8

[dropcap]”ఇం[/dropcap]గ సాలు వచ్చి గతుకరా” మూలింట్లా నింకా కోపముగా
అనె అవ్వ.

“నువ్వు నక్కే (తినే)” ఇంగా కోపముగా నట్టింట్లానింకా అనె తాత.

“మషాణానికి పోయే వొయిసులా కూడా మీకు జగడాలు కావాలనా?”
అంటా ఆడికి వచ్చె కాకన్న తాత.

“రేయ్! కాకా, నేను రేపే మషాణానికి పోయినా పర్వాలేదురా, ఇంగో
తరంతరము (తరం) నా సుద్ది చెప్పుకొంటుందిరా” మీసం నీవతా తాత అనె.

“గతికేకి కూడు లేకుంటే పోని, పోయినంక బతుకు గురించి
సుద్దులంటా, సుద్దులు” అదో రాగము తీసే అవ్వ.

“నేను చెప్పేది రవంత యినే. కుక్కా గతుకుతుంది, నక్కా గతుకుతుంది
ఏమి ఫలము. మనిషిగా పుట్టినింకా వాడు పోయినబుడే వాన్ని మరిచి
పోయేట్ల బతుకు బతకూడదు. పోయిన వాన్ని తలుసుకొని జనం
శానాళ్లు మాట్లాడుకోవాల. అట్లా బతుకు బతకాలా” బోగొప్పగా
అనె తాత.

“ఇంగ సాలు నిలుపు నీ పుంగ పురాణము. బతకాలంటే గతకాల
వచ్చి గతుకు” బలేగా అనె అవ్వ.

“లచ్చలంత మాట చెప్పితివిమా” అంటా కాకన్నా కిసకస నగె.

కాకన్నని గురగుర చూస్తా సంగటి ముద్ద గతికే సురువు చేసే తాత.

***

గతుకు = తిను

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here