[శ్రీ గోలి మధు రచించిన నాలుగు మినీ కవితలను పాఠకులకు అందిస్తున్నాము.]
1. యుద్ధం
బుద్ధిని
అవసరాన్ని
అనుసరించి
~
2. మతం
అతీత భావన నుంచి
ప్రదేశాన్ని అనుసరించి
సందర్భాన్ని తలచి
లోక కళ్యాణానికి పుట్టి
కుత్తుకలు కత్తిరించే దిశగా
వక్రీకరణకు గురైంది
~
3. డబ్బు
అవసరానికి
ఆదుకునే అమ్మ
అవధి దాటితే
కన్నీటి చెమ్మ!
~
4. చిత్తు
ఓటు
మత్తుకు
దేశం..!