గోలి మధు మినీ కవితలు-18

0
7

[శ్రీ గోలి మధు రచించిన నాలుగు మినీ కవితలను పాఠకులకు అందిస్తున్నాము.]

1. వికాసం

మాట మౌనం
కవలలు
విశ్వ వికాస
కలువలు..!

~

2. జ్ఞానం

తనని తాను దర్శిస్తూ
మేధస్సును తనువును
త్యాగం చేసేది!

~

3. నవ భారతం

దూషణలు ఆర్థిక నేరాలు
చెరసాలల చిరునామాలు
పద్దెనిమిదేళ్లు నిండిన
యువ ఓటరు ముందుకు

నవ భారత నిర్మాణానికి

~

4. కలత

జాతి మతం కులం
వర్గీకరణలన్నీ
ఐదేళ్లకో మారు
బ్యాలెట్ సాక్షిగా
ఐక్యత చాటుతుంటే
కలల భారతం చెదిరిపోతుంది!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here