గోలి మధు మినీ కవితలు-27

0
13

[శ్రీ గోలి మధు రచించిన నాలుగు మినీ కవితలను పాఠకులకు అందిస్తున్నాము.]

1. కల్పవల్లి

ఆడ పిల్లంటే
ఈడ పిల్లే
నా పిల్లకు తల్లిలా
మానవ జాతికి
కల్పవల్లిలా!

~

2. ప్రేమ

తల్లి పొత్తిళ్లలో మినహా
భౌతిక అవసరాలకు
ఆత్మభావనకు కుప్పకూలే
సౌధం

~

3. స్త్రీ

బరువు బాధ్యతల
రెక్కలు చాపి
తిరిగి తిరిగి

తిరిగి
పంజారాన్ని చేరే
పక్షి!

~

4. ఆవిష్కరణ

ఫలితం కన్నా
ప్రయత్నం గొప్పదనే
మనసే
ఆవిష్కరణల కేంద్రం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here