[dropcap]ప్ర[/dropcap]కృతితోనూ, పెంపుడు జంతువులతోనూ ప్రత్యేక ఇష్టం ఏర్పర్చుకున్న తుమ్మేటి రఘోత్తమరెడ్ది గారు తన ప్రియనేస్తం ‘గూఫి’ పేరుతో 83 ఎపిసోడ్లు సీరియల్ రాశారు. వాటి సంకలనం ఈ పుస్తకం.
“మనిషీ, పెంపుడు జంతువుల మధ్య అనుబంధాన్ని, ఒకరి దృష్టిలో మరొకరిపై ఉన్న మమకారాన్ని తెలిపే అద్భుత సాహిత్యం” అని ‘మేలు కాంక్షించే గూఫి’ అన్న పరిచయ వాక్యాల్లో డా. యడ్లవల్లి వేంకటేశ్వరరావు అభిప్రాయపడ్డారు.
“ఈ గూఫి సీరియల్ రాస్తున్న క్రమంలో గూఫి నేనై… నేనే గూఫి అయి… నా మనసంతా కుక్కల ప్రపంచం ఆక్రమించింది. మనుషుల ప్రపంచం చిన్నదయింది” అని ‘కృతజ్ఞతలు’లో రచయిత తెలియజేశారు.
“గూఫి ఒక అపూర్వమైన పుస్తకం. జాగ్రత్తగా చదవండి, చర్చించండి” అని రాశారు డా. కె. సత్యప్రసాద్.
“తెలుగు సాహిత్యంలోనే కాదు, ప్రపంచ సాహిత్యంలోనే ఇలాంటి ప్రయత్నం ఇదే మొదటిదనుకుంటాను” అంటారు ‘మై ఫ్రెండ్ గూఫి’ అన్న పరచయ మాటల్లో జి. క్రాంతి.
జంతుప్రేమికులే కాదు, మానవత్వం అంటే తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ఇది.
***
గూఫి (ది డాగ్)
రచన: తుమ్మేటి రఘోత్తమరెడ్డి
ప్రచురణ: రైతు నేస్తం పబ్లికేషన్స్,
పుటలు: 344
వెల: ₹ 200/-
ప్రతులకు:
రైతు నేస్తం పబ్లికేషన్స్,
6-2-959, దక్షిణ భారత హిందీ ప్రచార సభ కాంప్లెక్స్,
ఖైరతాబాద్, హైదరాబాద్ 500004
ఫోన్: 040-23395979
డో. నెం. 8-198, పుల్లడి గుంట దగ్గర, కొర్నెపాడు పోస్ట్, వట్టి చెరకూరు మండలం, గుంటూరు జిల్లా 522017. ఆంధ్రప్రదేశ్. ఫోన్: 0863-228255