గోటరు కప్ప

7
9

[dropcap]”వా[/dropcap]డు చెప్పేదంతా కప్ప శాస్త్రము. వాని మాటలు నువ్వు కట్టుకొంటావా? పని సూడి పోరా కెంచా” అంటా కబ్బాలన్న అనె.

“అది కాదునా”

“ఇంగేం మాట్లాడోద్దురా చెప్పేది వినవా” అంటా వాళ్లిద్రు ఏమో వాదము చేస్తా వుండారు.

నాకి వాళ్ల వాదములా పనిలేదు కాని కప్ప శాస్త్రము అంటే ఏమో తెలుసుకోవాలని బెమ (కోరిక) పుట్టి అట్లే మా తాత తాకి (వద్దకు) పారితిని.

“కప్ప శాస్త్రము అంటే ఏమి తాత?” అంటా అట్లే అడిగితిని.

“బాయిల్లా చెరువుల్లా గోటరు కప్పలు వుంటాయి కదా. వాటినే కప్పలు అనేది. ఇంగ అవి వుండేదే ప్రపంచము, ఇంతే విషయము, ఇదే శాస్త్రము అని నోటికొచ్చినట్ల అంటాయంట. బెకబెకని వొడసుకుంటాయంటా. దీన్నే కప్ప శాస్త్రము అనేది పా” అనేది అనె తాత.

“మడి(మరి) గొప్ప శాస్త్రము ఏమి తాత?”

“నాకి తెలిసింది రవంతే, తెలియాల్సింది శానా వుంది అనే ఏచన, ఆ ఏచనని ఎండిపోనీకుండా వుండే మనిషి ఎన్నమే (మనసే) గొప్ప శాస్త్రము పా” అనె

“సరే! తాత” అంట్ని.

“కానీ పా… ఏచన కానీ పా” అని పాయ తాత.

***

గోటరు కప్ప = కప్ప

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here