హనుమాన్ చాలీసా మొగ్గలు ఆవిష్కరణ ప్రెస్ నోట్

0
10

[dropcap]పా[/dropcap]లమూరు జిల్లాకు చెందిన కె.పాండురంగ విఠల్ మొగ్గలు ప్రక్రియలో రచించిన ‘హనుమాన్ చాలీసా’ను ప్రముఖ కవి, రచయిత కమలేకర్ డాగోజిరావు ఆవిష్కరించారు. మే 25 న  హనుమాన్ జయంతిని పురస్కరించుకుని పాలమూరు పట్టణంలో గల ధనలక్ష్మి కాలనీలోని అభయాంజనేయస్వామి దేవాలయంలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన ఆవిష్కర్తగా విచ్చేసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హనుమంతుని లేని గ్రామం దేశంలో ఎక్కడా ఉండదన్నారు. అలాగే ప్రతిరోజూ హనుమాన్ చాలీసా ప్రతి ఒక్కరూ పఠిస్తుంటారన్నారు. హిందీలో గోస్వామి తులసీదాసు రచించిన ‘రామచరితమానస్’ పుస్తకంలో హనుమాన్ చాలీసా ఉంటుందన్నారు. ఈ హనుమాన్ చాలీసా ప్రాముఖ్యత చాలా గొప్పదన్నారు. ఇది ఒక మంత్రంగా అందరికీ కనిపిస్తున్నా ప్రతి అక్షరంలో బీజాక్షరాలుంటాయన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏలినాటి శనిదశ ఉంటుందని, దాని నివారణ కోసం ఈ హనుమాన్ చాలీసాను పఠిస్తారన్నారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాలమూరు సాహితి అధ్యక్షులు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ మొగ్గల ప్రక్రియలో హనుమాన్ చాలీసాను పాండురంగ విఠల్ రాయడం గొప్ప విషయమన్నారు. నిరంతరం రచనలు చేస్తున్న పాండురంగ విఠల్ రామాయణాన్ని కూడా మొగ్గల ప్రక్రియలో రచించడం విశేషమన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన వార్డు కౌన్సిలర్ పుల్ల నీరజా విఠల్ రెడ్డి మాట్లాడుతూ తమ కాలనీలోని అభయాంజనేయస్వామి దేవాలయంలో హనుమాన్ చాలీసా పుస్తకాన్ని ఆవిష్కరించడం గొప్ప విషయమన్నారు.

ఈ కార్యక్రమంలో అభయాంజనేయస్వామి కమిటీ సభ్యులు బుచ్చిరెడ్డి, బాస రామస్వామి, బాస విజయలక్ష్మి, ప్రముఖ కవులు విరజాజి రామిరెడ్డి, కమలేకర్ శ్యాంప్రసాద్ రావు, బోల యాదయ్య, సృజామి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here