హాస్యరంజని-9

0
11

[dropcap]వి[/dropcap]షయ తీవ్రతను తగ్గించేది విషాన్ని సైతం అమృతంగా మార్చేది ‘హాస్యరసం’. ఇది మనందరికీ అవసరం. ఆరోగ్యానికి హాస్యమే ఆహారం. ఆరోగ్యమే మహా సంపద. ‘సాహిత్య శ్రీ’ కొండూరి కాశీవిశ్వేశ్వరరావు గారు అందిస్తున్న హాస్యరంజని (నవ్వుల శతకం) ఆస్వాదించండి.

81. మంచి మాటలు

టీచర్: ఆంగ్లము నందు రక్తసంబంధము గూర్చి ఒక మంచి మాట చెప్పుము.

రాజేష్: Blood is thicker than water. Water is costlier than wine.

82. వంట – ముగ్గులు

ఇంద్రజ: అదేమిటే, నిన్నటి వరకూ రమేష్‌తో కలిసి తిరిగావు కదా! మళ్ళీ బాయ్‌ఫ్రెండ్‌ని మార్చేశావేమిటి?

రజని: రమేష్‍కి వంట చేయటం, ముగ్గులేయటం రాదు. అందుకనే!

83. ఎన్నికల బరి

నాయకుడు: ఏమిటయ్యా! కంగారుగా వెతుకుతున్నావ్?

పుల్లయ్య: ‘ఎన్నికల బరి’ ఎక్కడుందా అని!

నాయకుడు: ఓహో నిన్న నేనే కదా, వెంటనే ఎన్నికల బరిలోకి దిగమని చెప్పాను.

పుల్లయ్య: అందుకే నేను వెతుకుతున్నాను.

84. దశనామాబాద్

టీచర్: హైదరాబాద్‌కి ఎన్ని పేర్లు ఉన్నాయో చెప్పండి.

ఆదిత్య: హైదరాబాద్‍ని ‘దశనామాబాద్’ అంటారు సార్!

టీచర్: ఇదేమిటిరా కొత్తగా చెపుతున్నావ్? సరేలే! అవి ఏమిటో చెప్పు మరి!

ఆదిత్య: హైదరాబాద్, సికింద్రాబాద్, భాగ్యనగరం, ముత్యాల నగరం, వజ్రాల నగరం, బిర్యానీ సిటీ, ఈవెంట్స్ సిటీ, గ్రేటర్ సిటీ, హైటెక్ సిటీ, సైబరాబాద్.

85. తాళం కప్ప

వ్యాపారి: ఏం కావాలండీ మీకు?

వెంగళప్ప:  నాకు ఒక తాళం కప్ప కావాలి.

వ్యాపారి: దేనికి వేస్తారు తాళం?

వెంగళప్ప: నేను కొనుక్కున్న సెల్‍ఫోన్‌కి. తాళం వేయకపోతే నా ఫోన్ నుండీ వేరే వాళ్ళు ఫోను చేసేసుకుంటారటగా!

86. కండబలం

మాస్టారు: పర్సనాలిటీ డెవెలప్‍మెంట్ అంటే ఏమిటిరా?

ప్రభాస్: వ్యాయామశాలకి వెళ్ళి కండలు పెంచుకోవటాన్నే ‘పర్సనాలిటీ డెవెలప్‍మెంట్’ అంటారు సార్!

87. శుద్ధ దండగ

భర్త: ఏమేవ్ మనం కూడా ఒక ఇంటివాళ్ళం కాబోతున్నాం.

భార్య: ఇప్పుడు కొత్తగా అయ్యేది ఏముంది? ఇరవై సంవత్సరాల క్రిందే ఒక ఇంటి వాళ్ళం అయ్యాముగా!

భర్త: అది కాదే, మన కల నిజమయ్యింది. కోటి రూపాయలు పెట్టి ఈ ఫ్లాటు కొన్నాను. చూడు.

భార్య: మీరు ఇది కోటి రూపాయలు పెట్టి కొన్నా, శుద్ధ దండుగ పనే మరి!

భర్త: అదేమిటి అలా అశుభ వాక్యాలు పలుకుతున్నావ్?

భార్య: కోటి రూపాయలు తగలేసి కొన్నా, ఇంటి ముందు ముగ్గు వేయలేం, బట్టలు ఆరేసుకోలేం, కనీసం వడియాలు కూడా ఎండబెట్టుకోలేమండీ!

భర్త: అంటే నన్నేం చేయమంటావు?

భార్య: ఇక నుండీ ఏ పని చేసినా నన్ను అడిగి మరీ చేయండి! నాకు పనుంది వస్తా!

88. ప్రేమ పూజారి

మృదుల: పూజారి.. పూజారి అంటూ పలవరిస్తున్నావు ఎవరు?

రంజని: నా ప్రియుడు

మృదుల: ఎక్కడుంటాడు?

రంజని: నా గుండెల్లో గుడి కట్టుకున్నాడు, ఆ గుడిలో పూజారియై నన్ను ఆరాధిస్తున్నాడు.

89. లక్కీ నెంబర్

లాయర్: బ్యాంకులో కోటి రూపాయలుండగా, కేవలం యాభై లక్షలే దొంగతనం చేశావు, ఎందుకని?

భుజంగ: ఐదు నా లక్కీ నెంబర్ సార్!

90. తమాషా

టీచర్: ఈనాటి మోరల్ క్లాస్‍లో ఎవరైనా ఒక తమాషా విషయమును చెప్పుము.

గౌరవ్: రేడియోలో ట్రాన్‍సిస్టర్ ఉంటుంది కానీ ట్రాన్‌సిస్టర్‍లో రేడియో ఉండదు సార్.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here