హిమాచల్ యాత్రానుభవాలు-3

    0
    9

    [box type=’note’ fontsize=’16’] “హిమాచల్ యాత్రానుభవాలు” అనే ఈ యాత్రాకథనంలో మనాలిలోని మాల్ రోడ్‍ గురించి, హిడింబి ఆలయం గురించి వివరిస్తూ, ఈ యాత్రలో తాము పొందిన అనుభూతిని పాఠకులతో పంచుకుంటున్నారు డి. చాముండేశ్వరి. [/box]

    [dropcap]బి[/dropcap]యాస్ నది గురించి విన్నాక ధన్యవాదాలు తెలిపి అక్కడ నుండి మనాలి మాల్ రోడ్‌కి వెళ్ళాము. ఉత్తర భారతంలోని హిల్ స్టేషన్స్‌లో మెయిన్ మార్కెట్ ఏరియాని మాల్ రోడ్ అంటారు.

    లోకల్ షాపింగ్ ఏరియా. ఉన్ని దుస్తులు, హస్త కళ వస్తువులు, హోటల్స్, బస్ స్టాండ్, టాక్సీ స్టాండ్,ఇతర నిత్యావసర వస్తువులు, బైక్స్ అద్దెకి ఇచ్చే షాప్స్, మనాలి పర్యటక ఏజెంట్స్ ఉంటారు.

    మనాలికి చక్కటి హిమాలయ మంచు కప్పిన పర్వతాల వ్యూ ఎటుతిరిగిన కన్నుల విందుగా ఉంటుంది. ఒక్కసారి ఆ హిమగిరులను చూస్తే  పెద్ద ఎన్.టి.ఆర్. సినిమాలోని లోని పాట గుర్తుకు వచ్చి నిజమే అనిపిస్తుంది. మా వరకు మేము గత నాలుగేళ్ళుగా వేసవి విడిదిగా హిమాలయ పర్వత ప్రాంతాలను దర్శిస్తూ అలవి కాని ఆనందం పొందుతున్నాము.

    మాల్ రోడ్‌లో హిమాచల్ పర్యాటక కార్యాలయం ఉంది. అక్కడ నుండి వారు దగ్గరలోని ప్రాంతాలకు తీసుకువెళ్తారు.

    రోహతాంగ్ కనుమలు,లేహ్ లడాక్.

    మాల్ రోడ్‌లో ఆటో స్టాండ్‌లో 80 రూపాయలకి ఆటో మాట్లాడుకుని హిడింబి దేవి ఆలయానికి వెళ్ళాము. ఆ సన్నని దారి వెంట పైకి వెళుతుంటే చక్కని వ్యూ తో పాటు చల్లని గాలి మనసును ఆహ్లాదకరంగా వుంటుంది.

    మహా భారతంలో ప్రస్తావించిన భీముని భార్య రాక్షస పత్ని హిడింబి గుడి అది.

    హిమాలయ పాద సానువులను… ఫుట్ హిల్స్… శివాలిక్స్ అంటారు. దేవదారు వృక్షాల నీడలో పెద్ద రాతిపై చెక్కిన 4 అంగుళాల చిన్న విగ్రహాన్ని దేవతగా కొలుస్తారు.

    దేశమంతటా దసరా వేడుకల్లో శక్తిని వివిధ రూపాల్లో పూజిస్తే ఇక్కడ ప్రాంత ప్రజలు హిడింబి మాతను దేవిగా కొలిచి పూజిస్తారు. పొడవాటి క్యూ లు ఉంటాయి దర్శించుకోవటానికి.

    పాండవుల వనవాసం తరువాత హస్తినపురానికి తిరిగి వెళ్లినప్పుడు వారితో హిడింబి తన కుమారుడు ఘటోత్కచుడితో వెళ్ళలేదు. ఇక్కడే ఉండి తపస్సు చేసిందట.

    అక్కడికి దగ్గరలో ఆమె కుమారుని గుడిని కూడా చూడవచ్చు.

     

    మాల్ రోడ్‌కి గుడికి దగ్గరలో పెద్ద అరణ్య పార్క్ ఉంది. ఇక్కడ మనకు ఉన్ని దుస్తులు, వారి లోకల్ వస్త్రధారణ దుస్తులతో ఫోటో తీస్తారు. లోకల్ కుందేళ్లు ఎంతో పెద్దవిగా బొద్దుగా ఉంటాయి. వాటిని ఫోటో కోసం అద్దెకి ఇస్తారు. జడల బఱ్ఱె అదేనండీ, ఆంగ్లంలో యాక్… ఎక్కి ఫోటో దిగవచ్చు ‘యముండ’లా.

    చూస్తుందంగానే పొద్దుపోయింది. తిరిగి మేమున్న హోటల్ దారి పెట్టాం. లంచ్ లోకల్ ఫుడ్ దాల్ రోటీ తిన్నాం. తెలుగు భోజనాలయం ఉంది. మేము లోకల్ ఫుడ్ తినాలనుకున్నాం.

     

    బస్‌లో హోటల్ చేరేటప్పటికి సూర్యాస్తమయం అవుతున్నది. డే లో టెంపరేచర్ 22 డిగ్రీలు. రాత్రి 12, 16 డిగ్రీల మధ్య ఉంటుంది. చక్కని వాతావరణం. రూమ్ బాల్కనీలో కూర్చుని నదిని, అడవిని చూస్తూ మౌనంగా ఆనందించాము. ‘మౌనమే నీ భాష ఓ మూగ మనసా’.

    ఇంటర్నెట్ ఉన్నా టీవీ ఉన్నా వాడకుండా, ప్రకృతి ఒడిలో సేదతీరటం ఆనందాన్ని ఇచ్చింది.

    (ఇంకా ఉంది)

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here