ఇది నా కలం-14 : వెంకటేష్ పువ్వాడ

0
8

[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షికలో రచయితలు తమ రచనల వివరాలు, తామెందుకు రచనలు చేస్తున్నారు, తమ లక్ష్యం ఏమిటి వంటి విషయాలను వివరిస్తూ తమని తాము పరిచయం చేసుకుంటారు. [/box]

వెంకటేష్ పువ్వాడ

[dropcap]న[/dropcap]మస్కారం!

నా పేరు వెంకటేష్ పువ్వాడ. చిన్నా పెద్దా అందరూ చదివేలా రాయడమే సాహిత్య సేవ అని నా అభిప్రాయం. ఇప్పుడు ఆ పనిలోనే ఉన్నాను. చిన్నప్పటి నుంచీ సహజంగా కవిత్వం రాయడం అలవాటు. పనిగట్టుకొని స్పందించి రాసిన కవిత్వం కంటే సహజ స్పందన లోంచి వచ్చే కవిత్వంలో తీవ్రత ఎక్కువగా ఉంటుందని నమ్ముతాను. నేను ఆ రెండో కోవలోని వాణ్ణి. బహుశా అందుకే చాలా తక్కువ రాసానని నా అభిప్రాయం. చలం నాకిష్టమైన రచయిత. ఆయన రాసిన మ్యూజింగ్స్ ఇష్టమైన పుస్తకం. మహాప్రస్థానానికి ఆయన రాసిన ముందు మాట కూడా చాలా ఇష్టం. ఇష్టమైన కథ చాగంటి సోమయాజులు గారి “బొండు మల్లెలు.”

మద్యలో కొన్ని కారణాలతో కవిత్వం రాయలేదు. సెకండ్ ఇన్నింగ్స్ అనాలో ఏమో తెలీదు గానీ లాక్‌డౌన్ నుంచి తిరిగి రాయడం ప్రారంభించాను. మునపటికన్నా ఇప్పుడు రాస్తుంది పరిణితి చెందినట్లుగా అనిపిస్తుంది. కొంతమందిని నా కవిత్వం ఆలోచింపచేస్తుంది. ఇది చాలా ఆనందం.

ఈమధ్య కాలంలో తానా వారు నిర్వహించిన ఫోటోగ్రపీ కవితల పోటీలో ప్రత్యేక బహుమతి గెలుచుకోవడం చాలా ఆనందాన్నిచ్చింది. ఆ తర్వాత ది న్యూ ఇండియా అస్యూరెన్సు, ఉపాధ్యాయ 2020 కవితల పోటీలు, స్నేహ కళాసాహితి, బెనారస్ తెలుగు యూనివర్సిటీ, ములుగు రేంజ్ తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వారు ఓజోన్ డే కవితల పోటీ, నాన్న పై నేటినిజం వారి కవితల పోటీ ఇలా ఇంకా కొన్నిటిలో బహుమతులు వచ్చాయి. అయితే మంచి కవిత్వానికి బహుమతులు ప్రామాణికం కాదని నా అభిప్రాయం. పోటీలో గెలుపు ఉత్సాహాన్నిస్తుంది. అంతే!

అన్నిటికన్నా సంతృప్తికర విషయమేమంటే నా రచనల్ని పత్రికల్లో చదవడం. ప్రముఖ పత్రికల్లో నా కవిత్వం వస్తుంది. ఈమధ్య వివిధలో వచ్చిన “అన్నా నువ్వు చీకటిని మింగిన చంద్రుడివే!” కవితకి ఊహించని స్పందన వచ్చింది. ఒక్కరోజే వందమంది కాల్స్ చేసారు. “సాహిత్యం సుప్తావస్థలో ఉన్న వ్యవస్థల్ని, వ్యక్తుల్ని గిచ్చి లేపేలా ఉండాలి”. ఆ విధంగానే రాయడానికి ప్రయత్నం చేస్తాను.

అప్పుడప్పుడు కవిత్వం రాసే నేను ఇప్పుడు నిత్యం కవిత్వం గురించి ఆలోచిస్తున్నాను రాస్తున్నాను. కారణం తపన రచయితల కర్మాగారం ఫేస్ బుక్ గ్రూప్ వలనే అని చెప్పాలి. గ్రూప్ అడ్మిన్స్ కిరణ్ విభావరి గారు, అనీలా గారు నాలాంటి రచయితల్ని ఎంతోమందిని ప్రోత్సహిస్తున్నారు. అలాగే సుష్మా, రవికాంత్ శర్మ, స్వప్న మేకల, శ్రావణి గుమ్మరాజు గారు ఇలా గ్రూప్‌గా చేరి ఎప్పటికప్పుడు చర్చించుకుంటాము.

కవిత్వం పలానా వాళ్లే రాయలనేది కాదు, ఎవరైనా సరే “కడుపు మండినోడు కాలే కవిత్వం”, “కళ్ళకి గులాబీలు పూచినోడు ప్రేమ కవిత్వం” రాస్తారు. మనం స్వాగతించాలి అని నా భావన.

puvvadavenkatesh99@gmail.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here