ఇది నా కలం-25 : అనూశ్రీ

0
10

[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షికలో రచయితలు తమ రచనల వివరాలు, తామెందుకు రచనలు చేస్తున్నారు, తమ లక్ష్యం ఏమిటి వంటి విషయాలను వివరిస్తూ తమని తాము పరిచయం చేసుకుంటారు. [/box]

అనూశ్రీ గౌరోజు

అందరికీ నమస్కారం. నా పేరు అనూశ్రీ.

కవయిత్రిగా అడుగులు మొదలైనా ఇప్పుడు కథలు-సమీక్షలు కూడా రాస్తున్నాను.

గత ఏడాది ఫిబ్రవరిలో ‘కెరటం’ కవితా సంపుటిని వెలువరించాను.

జూలై 2020లో ‘శ్రీపదాలు’ అనే నూతన లఘుకవితా ప్రక్రియను రూపకల్పన చేసాను. వాట్సప్ వేదికగా ఎంతో మంది కవులు కవయిత్రులు ఈ ప్రక్రియలో తమ సాహిత్యాన్ని పండిస్తున్నారు.

ఏడాది లాక్‌డౌన్ సమయంలో వచన కవితలతో పాటు చిన్నగా ఉంటూ చదవడానికి, వ్రాయడానికి ఆసక్తిని రేకెత్తించేలా మూడు పాదాల్లో తొమ్మిది పదాల్లో పూర్తయ్యే విధంగా, అలాగే మాత్రలు ప్రాసలు అక్షరాల లెక్కలతో కాకుండా పదాలను లెక్కిస్తూ రాసే ఈ చిరుకవితా ప్రక్రియ ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది.

అనేకంగా ఉన్న ప్రయోగాల్లో శ్రీపదాలు ఓ అందమైన సాహితీ ప్రక్రియగా నిలవాలని నా ఆకాంక్ష..!

~

*శ్రీపదాలు*

వేల అక్షరాలను ప్రోదిచేసాను
కాగితపు గగనాన మెరిసేలా
తళుకుతారకలుగా అందంగా పేర్చాలని..!

anuakhigdk@gmail.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here