‘ఇన్ అదర్ వర్డ్స్’ తెలుగు పదాలలో -1

2
8

[box type=’note’ fontsize=’16’] ప్రసిద్ధ హిందీ/ఉర్దూ కవి, సినీ గీత రచయిత శ్రీ జావేద్ అఖ్తర్ కవితల సంపుటి ‘ఇన్ అదర్ వర్డ్స్’ లోని కవితలను సంచిక పాఠకులకు తెలుగులో అందిస్తున్నారు శ్రీ వారాల ఆనంద్. [/box]

Tata Literature Live! The Mumbai Litfest 2020 Announces Javed Akhtar As Poet Laureate.

Nationally and internationally renowned poet, lyricist and screenwriter Javed Akhtar has been announced as the Poet Laureate of the 11th Tata Literature Live! The Mumbai LitFest 2020.

***

అస్థిరత్వం

[dropcap]ల[/dropcap]క్షల ముఖాలు
వాటిని అనుసరిస్తూ మరిన్ని
లక్షలాది ముఖాలు

అవి దారులా
కందిరీగల గూళ్ళా

ఈ భూమంతా
దేహాలతో నిండిపోయింది
నడవడానికి కాదు గదా
ముక్కు చీదే తందుకూ చోటు లేదు
ఇదంతా చూస్తూ
నేననుకుంటాను

నేను ఉన్న చోట ఉండడమే మంచిదని
కానీ ఏంచేయను

నేను ఆగితే
నా వెనకాలున్న జనం
నన్ను తొక్కేస్తారు నలిపేస్తారు

అందుకే ఇప్పుడు నేను నడుస్తాను
నా పాదాల కింద ఎవరిదో చాతీ
మరెవరిదో చేయీ, ముఖం
నేను నడవాలంటే
ఇతరులను తోక్కాల్సిందే

నేను ఆగితే
అణచివేతకు గురి కావాల్సిందే

నీ న్యాయశీలత పై నీకు గర్వంకదా
ఓ అంతరాత్మా
నీ నిర్ణయం ఏమిటో చెప్పు
కొంచెం వింటాను

మూలం: జావేద్ అఖ్తర్
తెలుగు: వారాల ఆనంద్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here