‘ఇన్ అదర్ వర్డ్స్’ తెలుగు పదాలలో-6

3
8

[box type=’note’ fontsize=’16’] ప్రసిద్ధ హిందీ/ఉర్దూ కవి, సినీ గీత రచయిత శ్రీ జావేద్ అఖ్తర్ కవితల సంపుటి ‘ఇన్ అదర్ వర్డ్స్’ లోని కవితలను సంచిక పాఠకులకు తెలుగులో అందిస్తున్నారు శ్రీ వారాల ఆనంద్. [/box]

కాలం (రివ్యు)   

[dropcap]కా[/dropcap]లమంటే ఏమిటి
అలుపూ విరామమూ లేకుండా
సాగి పోతున్నది ఏమిటిది

అట్లా ప్రయాణించకుండా వుండివుంటే
అదేక్కడుండేది
ఎక్కడో ఒక చోట వుండేది కదా

నడిచి పోయింతర్వాత
ఇప్పుడు ఎక్కడుంది
ఎక్కడో ఓ చోట వుండాలి కదా

అది ఎక్కడి నుంచి వచ్చింది
ఎక్కడికి వెళ్ళింది

ఈ ప్రక్రియ ఎక్కడ మొదలయింది
ఎక్కడ ముగుస్తుంది
అసలీ
కాలమంటే ఏమిటి


సంఘటనలు
సందర్భాలూ
సంఘర్షణలు
ప్రతి వేదన
ప్రతి సంతోషం
ప్రతి ఆనందం
ప్రతి నవ్వు
ప్రతి హింస
ప్రతి కన్నీటి బొట్టు
ప్రతి పాట
ప్రతి సువాసన

అది గాయం వాళ్ళ కలిగిన బాధ కావచ్చు
లేదా
సున్నిత స్పర్శ యొక్క మహత్తూ కావచ్చు

తన సొంత గొంతో
లేదా
చుట్టూరా వున్న అనేక గొంతుకలో
మనసుపై దాడి చేస్తున్న
విజయాలో ఓటములో
జాగ్రత్త వల్ల పెల్లుబికిన మార్పో
హృదయం లో చెలరేగిన కల్లోలమో
అన్ని అనుభూతులూ
అన్ని ఉద్వేగాలూ
నీటి ఉపరితలం పై తేలి యాడుతున్న ఆకుల్లా
ఇక్కడా అక్కడా
నీటిలో ఈదుతున్నట్టు
మరోసారి అదృశ్యమయినట్టు
అది ఏరులా ప్రవహిస్తున్నది
ప్రవహించే ఆ నది ఏమిటి
అది ఏ పర్వత సానువుల్లోంచి మొదలయింది
ఏ సముద్రం వైపు తరలి పోతున్నది

కాల మంటే ఏమిటి

కదులుతున్న రైల్లోంచి
బయట చెట్లను చూసినప్పుడు
అవి రైలు గమనానికి వ్యతిరేక దిశలో
పరుగెడుతున్నాయని అనుంటాం

కానీ వాస్తవానికి
చెట్లు స్థిరంగానే వున్నాయి
శతాబ్దాలుగా అవి వరుసగా నిలబడే వున్నాయి

కాలం స్థిరంగా నిలబడే వుందేమో
మనమే ముందుకు నడుస్తున్నామేమో

ఈ క్షణమూ సమస్త క్షణాలూ
అన్ని దశాబ్దాలూ గుప్తంగా ఉన్నాయా

గతం లేదు భవిష్యత్తు లేదు
గడిచిపోయింది ఇప్పుడు జరుగుతున్నదా

ముందు రానున్నది
ఇప్పుడు జర్గుతున్నడా

నాకెంతో ఆశ్చర్యంగా వుంది
ఇది సాధ్యమా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here