‘ఇన్ అదర్ వర్డ్స్’ తెలుగు పదాలలో-8

0
12

[box type=’note’ fontsize=’16’] ప్రసిద్ధ హిందీ/ఉర్దూ కవి, సినీ గీత రచయిత శ్రీ జావేద్ అఖ్తర్ కవితల సంపుటి ‘ఇన్ అదర్ వర్డ్స్’ లోని కవితలను సంచిక పాఠకులకు తెలుగులో అందిస్తున్నారు శ్రీ వారాల ఆనంద్. [/box]

షబానా     

[dropcap]ఈ[/dropcap] రోజువారీ ఆటంకాలూ
నిరంతర ప్రయాణాలూ
అటూ ఇటూ పరుగెత్తడాలూ
అతన్ని కలవడం ఇతన్ని కలవడం

మనం గడిపే
అన్ని ‘క్షణాలూ’
స్టేషన్లో రైలు బయల్దేరేముందు
తమ బోగీ కోసం ఆగమాగంగా వెతికే
ప్రయాణీకుల్లా అనిపిస్తున్నాయి
అప్పుడు వాళ్లకు శ్వాస తీసుకోవడానికీ
సమయం వుండదు కదా

ఒక్కోసారి అనిపిస్తుంది
నిన్ను నేను, నన్ను నువ్వు
కలవాలనే ఆలోచన వచ్చెందుకయినా
తీరికలేదేమోనని

అయినప్పటికీ
ఈ కరుణ లేని లోకం నా హృదయాన్ని
గాయం చేసినప్పుడు

ఎప్పుడయినా ఓ ఆశ దరిచేరుతూ
ముఖం చాటేసినప్పుడూ

లేదా ఎప్పుడయినా నాలో
ఓ ఆనంద పుష్పం విచ్చుకున్నప్పుడూ
ఎప్పుడయినా నాలో
ఓ ఆలోచన మొలకకెత్తినప్పుడూ

ఎప్పుడయినా ఓ కోరిక నెరవేరి
నా హృదయం ఖాళీ అయినప్పుడు

ఎప్పుడయినా బాధ ముత్యాల్లాంటి కన్నీటితో
నా కనుపాపల్ని కుట్టేసినప్పుడు
అప్పుడు నాకు తెలుస్తుంది

సంతోషం, దుఃఖం, ఆశ్చర్యం లేదా
మరో భావోద్వేగ మేదయినా మలుపు తిరిగినప్పుడు

అక్కడ ఓ క్షణం సమస్త ప్రపంచం
వెనక బడిపోతుంది

అక్కడ ఓ క్షణం తోలుబోమ్మలాంటి
జీవితాన్ని ఆడించే దారాలు తెగిపోయినప్పుడు
అప్పుడు ఆ మలుపు దగ్గర
నేవ్వే అవసరమవుతావు ఆసరా అవుతావు

కానీ
ఈ జీవితంలో అందమయిన వాస్తవం చెప్పనా
అక్కడ అలాంటి ప్రతి మలుపులో
నువ్వు నా పక్కనే నాతోనే నడుస్తూ ఉంటావు

మూలం: జావేద్ అఖ్తర్
తెలుగు: వారాల ఆనంద్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here