మహాత్ముని 150వ జయంతి సందర్భంగా “ప్రకృతి వ్యవసాయం – మన జీవన విధానం” అనే నినాదంతో ఆంధ్ర ప్రదేశ్ స్మారక నిధి విజయనగరం జిల్లా శాఖ 25 సెప్టెంబరు 2018 తేదీన ఉదయం 10 గంటలకు 400 మహాత్మా గాంధీ విగ్రహాల ఆవిష్కరణ మహోత్సవం జరిపింది.
ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ ఉప సభాపతి గౌరవనీయులు మండలి బుద్ధ ప్రసాద్ గారు, మంత్రివర్యులు రావు వెంకట సుజయ్ కృష్ణ రంగారావు గారు, పార్లమెంటు సభ్యులు పూసపాటి అశోక్ గజపతి రాజు గారు, విజయనగరం జిల్లా కలెక్టర్ హరి జవహర్లాల్, విజయనగరం జిల్లా ఎస్.పి. పాల రాజు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శోభారాణి మొదలగు ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
 
      
 
మహాత్మా గాంధీ స్వాతంత్ర్యానికి పూర్వం ఒకరోజు విజయనగరంలో బస చేశారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని వారు బస చేసిన అశోక్ గజపతిరాజు గారి బంగళానుండి విజయనగరం పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ వరకు పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో వంద మంది విద్యార్థులు మహాత్మా గాంధీ వేషధారణతో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
  
  
   
 
 అనంతరం ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ గారు 400 విగ్రహాలను ఉచితంగా పంచిపెట్టారు. ఈ విగ్రహాలను పాఠశాలల్లోనూ, గ్రంథాలయాల లోను, రోడ్ల కూడలిలోనూ, పార్కుల్లోనూ ప్రతిష్ఠించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.
అనంతరం ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ గారు 400 విగ్రహాలను ఉచితంగా పంచిపెట్టారు. ఈ విగ్రహాలను పాఠశాలల్లోనూ, గ్రంథాలయాల లోను, రోడ్ల కూడలిలోనూ, పార్కుల్లోనూ ప్రతిష్ఠించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.
ఎవరైనా విగ్రహాలు కావలసిన వాళ్లు ఆంధ్రప్రదేశ్ గాంధీ స్మారక నిధి వారిని సంప్రదించవచ్చని కోరారు. విజయనగరం శాఖలో ధవళ సర్వేశ్వరావు, పారినాయుడుగారు ఈ విగ్రహాలను ఉచితంగా అందచేస్తారు.
ఎన్.కె.బాబు

