Special Interview with Mr. Hansda Sowvendra Shekhar

0
13

[Mrs.V.B.Sowmya interviewed Mr. Hansda Sowvendra Shekhar author of the short story collection ‘The Adivasi Will Not Dance’ (some of the stories from the book are going to be translated for publication  in Sanchika) for Sanchika]

[dropcap]H[/dropcap]ansda Sowvendra Shekhar is an English novelist, essayist and a short story writer. He is also an accomplished translator, and has translated Santali, Hindi, and Bengali writings into English. He won the Sahitya Akademi’s Yuva Puraskar in 2015 for his debut novel “The Mysterious Ailment of Rupi Baskey”. His collection of short stories “Adivasi will not dance” was shortlisted for the 2016 Hindu literary prize. He also wrote books for young readers. He is an ethnic Santhali, and a lot of his work portrays and explores the life and culture of the Santhal people. Three of his short stories appeared in Telugu translation in Sanchika web magazine.

~

Sowmya: Namaskaram, Hansda Sowvendra Shekhar!

Sowvendra: Namaskaram Sowmya!

Q 1. Can you tell us a little bit about your childhood and background?

A: In my childhood, I was into books and reading. But unfortunately I ended up disappointing a lot of people and I regret that.

Q2. How did you get interested in writing?

A: I think maybe because I read, I began writing. I wrote okayish essays in English exams and assumed that I could write longer stuff.

Q3. Who do you write for?

A: I am not sure I have identified my audience. I think that would be so limiting.

Q4. You wrote short stories, novels, children’s books, essays, and you also did a lot of translations. What motivates you to explore these various forms? What do you like doing the most?

A: I enjoy doing all of it. I get quite invested in whatever I do but I am never quite satisfied.

Q5. I know you translated poetry, but do you also write your own poems?

A: Long ago, two poems of mine were published in The Sunday Statesman newspaper that is published out of Kolkata. Later on, those poems embarrassed me so much that I decided to not write any more poems.

Q6. How did you get into Children’s books?

A: That too, I think, just happened. The Jwala Kumar story came to my mind and I felt that it would be good as a book for children and so I wrote it. Also, I love the illustrations in children’s books. I was delighted to have my writing placed alongside the artwork by Krishna Bala Shenoi (Jwala Kumar and the Gift of Fire), Anupama Ajinkya Apte (Who’s There?), and Joanna Mendes (Sumi Budhi and Sugi). Also, a shout out to the three talented artists I collaborated with on Comixense magazine: Priyanka Purty and Neha Alice Kerketta in Comixense, Vol. 1, No. 2; and Partha Banik in Comixense, Vol. 1, No. 4.

Q7. How did you find your first publisher?

A: I submitted The Mysterious Ailment of Rupi Baskey to Aleph and received an email from them that they would publish my book.

 

Q8. How important is it for you to write about Santali culture and people? I remember listening to an interview where you said you don’t want to be labeled as an Adivasi writer.

A: Writing about Santal people is important to me because I am a Santal. It is my own lived experience so I find it easy to write about. However, I do not want to limit myself to writing only about Santals. I may write about androids. Or I may write a book set in a forest or a zoo told through the PoV of a porcupine. So that is why I prefer to not be labeled an Adivasi writer.

Q9. Why did you start translating? What is your perspective on translations?

Because I have enjoyed reading translations and believe that translations can open up a book to newer audiences.

Q10. In 2022, you published translations of a few Santali poems in the Sangam House website’s poetry section. The formatting you chose for some of the poems, especially, “Edel” and “I will follow you” [Edel, really!] made me very curious about the original. Can you tell us more about these translations?

A: The Santali poem “Edel” is by Chinmayee Hansdah-Marandi, and the Santali poem “I Will Follow You” (original Santali title: “Paanjaa Miyan Aam”) is by Parimal Hansda. I think you are intrigued by the layout of the lines in the English translations. Actually, I felt like experimenting — or playing, rather — with the layout of the lines. Edel is a tree, the Silk Cotton tree, also known as Semul. That is why, in my English translation, I placed the lines in the form of a tree. “I Will Follow You” has a feeling of movement in its lines. So I decided to lay the lines in a zigzag form to present a sense of movement.

Q11. What kind of books do you normally read?

A: I am enjoying short novels right now. I loved Claire Keegan’s Small Things Like These. I have The Notebook by Nicholas Sparks waiting to be read. I am discovering the pleasure of reading long form.

Q12. What do you know about Telugu literature and publishing? [I am just asking to get an idea of what non-Telugus know about Telugu literature]

A: Not much, I am afraid, and also a bit ashamed. But we had Palagummi Padmaraju’s story, “Cyclone”, in our ICSE syllabus, and it has to be one of the most touching stories I have read. In February this year, I read The Life and Times of Komuram Bheem by Bhoopal, translated from the Telugu by P. A. Kumar, and published by SouthSide Books, the new imprint from Hyderabad Book Trust, dedicated to publishing English translations of Telugu books. I read The Liberation of Sita by Volga, translated from the Telugu by T. Vijay Kumar and C. Vijayasree, some years ago.

Q13. Can you tell us briefly about Santali literature and its availability in English or Indian language translations? 

A: I will be honest here. Even though I have translated from Santali to English, I am not really in sync with the goings-on in the Santali literary sphere. So I am not qualified to answer this question.

Q14. What are you currently working on?

A: I am about 70 pages away from finishing translating Nalini Bera’s Bengali novel, Subarnarenu Subarnarekha, into English. Also, I am anxious about I Named My Sister Silence, my translation of the Hindi novel, Kaale Adhyaay, by Manoj Rupda. I Named My Sister Silence will be published in June 2023 by Eka, an imprint of Westland Books.

Q15. What are your future plans?

A: There is no plan.

I have a few questions on your writing process before I end my list of questions:

Q16. What is your writing routine like? How do you find time to write as a practicing doctor?

A: I do not have a routine. I try to take time out from my schedule.

Q17. How much self-editing do you do? Sometimes, when I chat with a few young Telugu writers wanting to publish in English, the issue of lack of editing support comes up repeatedly. I am sure they are not the only ones facing that issue. I face it as a translator too. How should we address this challenge, and how can one hone their writing skills over time?

A: I treat my writing as the worst thing in the world and I am often not sure of what I am writing and where my writing is going. That is why I go on revising and editing. I request my friends to read my drafts and I work on their pointers. I am thankful to my friends who are my beta readers.

Q18. Any parting advice for new (Indian) writers wanting to tell their stories in English, or for translators looking for venues to publish?

A: I am sorry I am not in a position to advise anyone. I am still learning.

sowmya: Thank you very much for taking time out for Sanchika . Thank you.


ప్రముఖ ఆంగ్ల రచయిత హన్స్దా సొవేంద్ర శేఖర్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ

(సంచిక పాఠకుల కోసం శ్రీమతి వి. బి. సౌమ్య – ప్రఖ్యాత రచయిత హన్స్దా సొవేంద్ర శేఖర్ గారితో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ)

హన్స్దా సొవేంద్ర శేఖర్ ఆంగ్ల నవలా రచయిత, వ్యాసకర్త, కథా రచయిత. ఆయన నిపుణులైన అనువాదకులు కూడా. సంతాలీ, హిందీ, బెంగాలీ రచనలను ఆంగ్లంలోకి అనువదించారు. తన మొదటి నవల ‘The Mysterious Ailment of Rupi Baskey’ కి గాను 2015లో సాహిత్య అకాడెమీ వారి యువ పురస్కారం గెలుచుకున్నారు. ఆయన కథాసంపుటి ‘The Adivasi will not dance’ 2016 హిందూ లిటరరీ ప్రైజ్‍కు షార్ట్‌లిస్ట్ అయింది. ఆయన చిన్నారి పాఠకుల కోసం కూడా పుస్తకాలు రాశారు. సంతాలీ తెగకు చెందిన సొవేంద్ర, తన రచనలో సంతాలీ ప్రజల జీవితాన్ని, సంస్కృతిని ఆవిష్కరిస్తారు. ఆయన వ్రాసిన మూడు కథల అనువాదలు సంచికలో ప్రచురితమయ్యాయి.

సౌమ్యః నమస్కారం హన్స్దా సొవేంద్ర శేఖర్.

హన్స్దా: నమస్కారం సౌమ్య!

ప్రశ్న 1: మీ బాల్యం గురించి, మీ నేపథ్యం గురించి కాస్త వివరిస్తారా?

జవాబు: నా బాల్యంలో నేను పుస్తకాలను ఇష్టపడేవాడిని, బాగా చదివేవాడిని. కానీ చాలామందిని నేను నిరాశపరిచాను. అందుకు పశ్చాత్తాపపడుతుంటాను.

ప్రశ్న 2: మీకు రచనల పట్ల ఆసక్తి ఎలా కలిగింది?

జవాబు: బహుశా, బాగా చదవడం వల్లే రాయడం మొదలుపెట్టాను. ఇంగ్లీషు పరీక్షలలో నేను వ్రాసిన వ్యాసాలు బానే ఉన్నాయనిపించడంతో – నేను సుదీర్ఘ రచనలు కూడా చేయగలనని భావించాను.

ప్రశ్న3: మీరు ఎవరి కోసం రాస్తారు?

నేను నా పాఠకులను గుర్తించానని ఖచ్చితంగా చెప్పలేను. పైగా అలా చేయడం పరిమితులు విధించుకోడమేనని నా అభిప్రాయం.

ప్రశ్న4: మీరు కథలు, నవలలు, పిల్లల పుస్తకాలు, వ్యాసాలు రాశారు. ఇంకా ఎన్నో అనువాదాలు చేశారు. ఇలా పలు రకాల ప్రక్రియలు చేపట్టడంలో మీకు ప్రేరణ ఏది? వీటిల్లో మీకు ఏది బాగా ఇష్టం?
జవాబు: ఇవన్నీ నాకిష్టమే. నేను చేసే ప్రతి పని మనసు పెట్టి చేస్తాను, కానీ దేనిలోనూ పూర్తిగా సంతృప్తి చెందను.

ప్రశ్న5: మీరు కవితలు అనువదించారని నాకు తెలుసు. అయితే మీరు సొంత కవితలను రాస్తారా?

జవాబు: చాలా కాలం క్రితం నేను రాసిన రెండు కవితలు కొల్‍కతా నుంచి వెలువడే ది సండే స్టేట్స్‌మన్ దినపత్రికలో ప్రచురితమయ్యాయి. తర్వాతి కాలంలో ఆ కవితలు నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించాయి, అందువల్ల ఇక కవితలు రాయకూడని నిశ్చయించుకున్నాను.

ప్రశ్న6: బాలసాహిత్యంలోకి ఎలా ప్రవేశించారు?

జవాబు: అది యాదృచ్ఛికంగా జరిగింది. జ్వాలాకుమార్ కథ నా మనసుకి తట్టింది, అది పిల్లలకి మంచి పుస్తకం అవుతుందని అనిపించింది, అందుకే దాన్ని రాశాను. పైగా పిల్లల పుస్తకాలలో ఉండే బొమ్మలంటే నాకెంతో ఇష్టం. నా రచనలకు కృష్ణ బాల షెనాయ్ (జ్వాలా కుమార్ అండ్ ది గిఫ్ట్ ఆఫ్ పైర్), అనుపమ అజింక్యా ఆప్టే (హూ యీజ్ దేర్?), జోన్నా మెండెస్ (సుమి బుధి అండ్ సుగి) బొమ్మలు గీయడం నాకెంతో సంతోషాన్నిచ్చింది. ఈ ముగ్గురు ప్రతిభావంతులతోనే కాకుండా, కామిక్సెన్స్ మ్యాగజైన్‍కి చెందిన ప్రియాంక పుర్తి, నేహా అలిస్ కెర్కెట్టా లతో కామిక్సెన్స్ వాల్యూమ్ 1, నెంబర్ 2 కి పని చేశాను. వాల్యూమ్ 1 నెంబర్ 4కి పార్థా బానిక్‍తో పనిచేశాను.

ప్రశ్న7: మీ మొదటి పబ్లిషర్‍ని ఎలా సాధించారు?

జవాబు: నేను ‘The Mysterious Ailment of Rupi Baskey’ నవలని అలెప్‍కి పంపాను. వాళ్ళ దగ్గర నుండి పుస్తకాన్ని ప్రచురిస్తున్నామని ఈమెయిల్ వచ్చింది.

ప్రశ్న8: సంతాలీ ప్రజల గురించి, వారి సంస్కృతి గురించి రాయడం మీకెంత ముఖ్యం? ఆదీవాసీ రచయిత అని ముద్ర వేయించుకోవడం మీకిష్టం లేదని ఓ ఇంటర్వ్యూలో విన్నాను.

జవాబు: నేను సంతాలీని కాబట్టి సంతాలీ ప్రజల గురించి, వారి సంస్కృతి గురించి రాయడం నాకు ముఖ్యమే. కానీ, అయితే సంతాలీల గురించి రాయడానికే పరిమితమైపోవడం నాకు ఇష్టం లేదు. యాండ్రాయిడ్స్ గురించి రాస్తానేమో. లేదా అరణ్యం లేదా జూ నేపథ్యంలో ఓ ముళ్ళపంది దృక్కోణం  రాస్తానేమో. అందుకే ఆదీవాసీ రచయిత అని ముద్ర వేయించుకోవడం నాకిష్టం లేదు.

ప్రశ్న9: అనువాదాలు ఎందుకు మొదలుపెట్టారు? అనువాదాలపై మీ దృక్పథం ఏమిటి?

జవాబు: ఎందుకంటే నాకు అనువాదాలు చదవడం ఆసక్తి. అనువాదాలు ఓ పుస్తకానికి కొత్త పాఠకులను తెస్తాయని నమ్ముతాను.

ప్రశ్న10: 2022లో మీరు సంగం హౌస్ వెబ్‍సైట్‍లో కవిత్వం విభాగంలో కొన్ని సంతాలీ కవితలను అనువదించారు. కొన్ని కవితలకు మీరు చేపట్టిన ఫార్మాటింగ్ ఉదాహరణకి Edel‘, ‘I will follow you‘ కవితల ఫార్మాటింగ్ నాకు మూల కవిత పట్ల ఆసక్తిని కలిగించింది. ఈ అనువాదాల గురించి మరికొంత చెప్పండి.

జవాబు: సంతాలీ కవిత ‘Edel’ ను చిన్మయి హన్స్దా మరాండీ రాశారు. మరో సంతాలీ కవిత ‘I will follow you’ ను పరిమళ్ హన్స్దా రాశారు (మూల కవిత పేరు పాంజా మియాన్ ఆమ్). బహుశా మీకు ఆంగ్ల అనువాదంలోని లైన్ల లేఅవుట్‍ నచ్చినట్లుంది. వాస్తవానికి నేను ఆంగ్ల ఆనువాదపు లైన్లతో ప్రయోగం చేశాను, లేదా ఆడుకున్నాను అనుకోవచ్చు. Edel అంటే చెట్టు, సెముల్ అని అంటారు, సిల్క్ కాటన్ చెట్టు. అందుకే ఆంగ్ల అనువాదంలో నా లైను చెట్టు ఆకారంలో ఉంటాయి. ‘I will follow you’ కవితానువాదంలో పంక్తులలో చలనం ఉన్నట్లు తోస్తుంది. అందుకని లైన్లని జిగ్‍జాగ్ పద్ధతిలో కదలికని సూచించేలా అమర్చాను.

ప్రశ్న11: సాధారణంగా మీరు ఎటువంటి పుస్తకాలు చదువుతారు?

జవాబు: ప్రస్తుతం చిన్న నవలలని చదవడం ఆస్వాదిస్తున్నాను. క్లెయిర్ కీగన్ రచించిన ‘స్మాల్ థింగ్స్ లైక్ దీస్’ బాగా నచ్చింది. నికోలస్ స్పార్క్స్ రాసిన ‘ది నోట్‍బుక్’ చదవాల్సి ఉంది. అధిక నిడివి గల రచనలు చదవడంలోని ఆనందాన్ని గ్రహిస్తున్నాను.

ప్రశ్న12: తెలుగు సాహిత్యం గురించి, ప్రచురణల గురించి మీకేం తెలుసు? (తెలుగేతరులకు తెలుగు సాహిత్యం గురించి ఏం తెలుసో తెలుసుకుందామని మాత్రమే అడుగుతున్నాను)

జవాబు: పెద్దగా తెలియదని చెప్పడానికి భయంగా ఉంది. కాస్త సిగ్గుగా కూడా ఉంది. అయితే మాకు ఐసిఎస్‍ఇ సిలబస్‍లో భాగంగా పాలగుమ్మి పద్మరాజు గారి ‘Cyclone’ (తెలుగులో గాలివాన) కథ ఉండేది. నేను చదివిన అత్యంత హృద్యమైన కథలలో అది ఒకటి. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో భూపాల్ గారి రచనకు పి.ఎ. కుమార్ ఆంగ్లానువాదం ‘The Life and Times of Komuram Bheem’ చదివాను. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారి అనుబంధ సంస్థ, తెలుగు పుస్తకాలను ఆంగ్లంలో వెలువరించే ‘సౌత్‍సైడ్ బుక్స్’ దీన్ని ప్రచురించింది. కొన్నేళ్ళ క్రితం టి. విజయ్ కుమార్, సి. విజయశ్రీలు తెలుగు నుంచి అనువదించిన ఓల్గా గారి ‘The Liberation of Sita’ చదివాను.

ప్రశ్న 13: సంతాలీ సాహిత్యం గురించి క్లుప్తంగా చెప్తారా? ఆంగ్లం లేదా ఇతర భారతీయ భాషలలో సంతాలీ సాహిత్యం ఎంతవరకు అందుబాటులో ఉంది?

జవాబు: నేనిక్కడ నిజాయితీగా ఉంటాను. సంతాలీ నుంచి ఆంగ్లంలోకి అనువాదాలు చేసినప్పటికీ, సంతాలీ సాహిత్యరంగంలో ఏం జరుగుతోందనేది నాకు పెద్దగా అవగాహన లేదు. అందువల్ల ఈ ప్రశ్నకి నేను జవాబు చెప్పలేను.

ప్రశ్న14: ప్రస్తుతం మీరే పుస్తకం మీద పని చేస్తున్నారు?

నళిని బేరా గారి బెంగాలీ నవల ‘Subarnarenu Subarnarekha’ ఆంగ్లానువాదం ఇంక 70 పేజీలు మిగిలి ఉంది. మనోజ్ రూప్దా గారి హిందీ నవల ‘కాలే అధ్యాయ్’ని ‘I Named My Sister Silence’ అనే పేరుతో అనువదించాను. వెస్ట్‌లాండ్ వారి అనుబంధ సంస్థ Eka ‘I Named My Sister Silence’ని జూన్ 2023లో ప్రచురిస్తోంది.

ప్రశ్న15: మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి?

జవాబు: నాకు ప్రణాళిక లేదు.

ఇంటర్వ్యూని ముగించే ముందు మీ రచనా ప్రక్రియ గురించి కొన్ని ప్రశ్నలు:

ప్రశ్న16: మీ దినచర్య ఎలా ఉంటుంది? వైద్యుడైన మీరు రచనలకి సమయం ఎలా కేటాయించుకుంటారు?

జవాబు: నాకు దినచర్య అంటూ లేదు. నా షెడ్యూల్ నుంచి కాస్త సమయం చేసుకుంటాను.

ప్రశ్న17: మీరు ఎంత మేర సెల్ఫ్-ఎడిటింగ్ చేసుకుంటారు? కొన్నిసార్లు నేను ఆంగ్లంలో రాయలని కోరుకునే తెలుగు యువ రచయితలతో మాట్లాడినప్పుడు – ఎడిటింగ్‍లో మద్దతు లేదనే ఫిర్యాదు తరచూ వినబడుతుంది. నా ఉద్దేశంలో ఈ సమస్య వాళ్ళకి కాదు, ఓ అనువాదకురాలిగా నాకూ ఎదురవుతుంది. ఈ సవాలుని ఎదుర్కోవడం ఎలా? కాలానుగుణంగా నైపుణ్యాలను పెంచుకోవడం ఎలా?

జవాబు: నా రచనని ప్రపంచంలోనే అత్యంత చెత్త రచనగా పరిగణిస్తాను, పైగా నేనేం రాస్తున్నానో, నా రచన ఎటువైపు సాగుతుందో నాకు ఖచ్చితంగా తెలియదు. అందుకే మళ్ళీ మళ్ళీ సవరిస్తూంటాను, ఎడిట్ చేస్తూ ఉంటాను. నా రచనలను ముందుగా నా స్నేహితులని చదవమని, వాళ్ళ సూచనల మేరకు సవరిస్తాను. నా తొలి పాఠకులైన నా మిత్రులకి నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి.

ప్రశ్న18: ఆంగ్లంలో రచనలు చేయాలనుకునే కొత్త (భారతీయ) రచయితలకి లేదా తమ రచనలను అనువదింప చేసి ప్రచురించానుకునే వారికి మీరేదైనా సలహా ఇస్తారా?

జవాబు: క్షమించండి. ఎవరికీ సలహాలు ఇచ్చే స్థితిలో నేను లేను. నేనింకా నేర్చుకునే దశలోనే ఉన్నాను.

సౌమ్య: సంచిక కోసం మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మీ అభిప్రాయాల్ని తెలిపినందుకు ధన్యవాదాలు.

 

(తెలుగు అనువాదం సంచిక టీమ్)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here