ఐరన్ లేడీ థాచర్

0
11

[box type=’note’ fontsize=’16’] “రాజకీయాల్లో మాటలు కావాలనుకుంటే మగాళ్ళను అడగండి, పనులు కావాలంటే మహిళలను అడగండి” అని ఓ ఎన్నికల ప్రచారంలో చెప్పి, తాను చెప్పిన మాటలను నిజం చేసి చూపిన మార్గరెట్ థాచర్ గురించి “ఐరన్ లేడీ థాచర్” పేరిట వ్యాసాన్ని అందిస్తున్నారు ఎన్.వి.ఎస్.ఎస్. ప్రకాశరావు. [/box]

[dropcap]భా[/dropcap]రత ప్రదాని శ్రీ మోడి ఓ సాధారణ టీ కొట్టు యజమానిగా తన తొలి జీవితాన్ని మొదలుపెట్టారు. అంచెలంచెలుగా భారత ప్రధాని స్థాయికి చేరి కీర్తిని గడించారని ప్రెక్కు పత్రికలు శ్లాఘించాయి.

కానీ 1925లో బ్రిటన్‌లో ఓ మారుమూల ‘గ్రాంథామ్’ గ్రామములో కిరాణా దుకాణం నడిపే ఓ సాధారణ ఆసామి కూతురుగా జన్మించిన ‘థాచర్’ బ్రిటన్ రాచరికపు ప్రభుత్వంలో ప్రధాని పదవిని అలంకరించడం ప్రపంచ దేశాలలో 8వ వింతగా చెప్పుకోవచ్చు. ఆమె ప్రపంచంలోని గొప్ప నేతలు ఎందరికో మార్గదర్శకం అయ్యారంటే దాని వెనుక గల అనితర సాధ్యమైన ఆమె కృషి ఎంతటిదో చెప్పటం కష్టసాధ్యం. అయితే ఓ బాటలో నడుస్తున్నప్పుడు ఎన్ని ముళ్ళు గుచ్చుకున్నాయో! అన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తే తెలుస్తుంది.

ఒక కొత్త మార్గం సుగమం చెయ్యాలంటే రోడ్డుకు ఇరువైపుల వున్న వృక్షాలను కూల్చాలి. వాటిని పెకలించేటప్పుడు ఎన్నో సాధక భాదకాలు ఎదురై మనిషిని కృంగదీస్తాయి. అందునా మొక్కవోని ధైర్యం అచంచల విశ్వాసం, నిగూఢమైన ఆత్మస్థైర్యం కావాలి. ముఖ్యంగా ఎందరిదో మద్దతు, సహాయ సహకారాలు అవసరం. ఒకప్పుడు తన బాటలో ఇతరుల మద్దతు లభించకపోవచ్చు అయినా కార్యసాధన కోసం, లక్ష్య దీక్షలో ఏటికి ఎదురీదగల మనో నిబ్బరం కావాలి. అవన్నీ సమృద్ధిగా ఉంటేనే ఆ కొత్త మార్గం సుగమం అవుతుంది. అప్పుడు వారు వారధి కాగలరు. స్త్రీని వంటింటికే పరిమితం చేసే ఈ చాదస్తపు నుడికారంలో ఈ పై గుణగణాలు వున్న స్త్రీ మూర్తులు ప్రపంచంలో ఒకళ్ళో ఇద్దరో. వారిలో ‘థాచర్’… ఒకరు.

ఆమె గ్రేట్ బ్రిటన్ దేశానికి తొలి మహిళా ప్రధాని. 1979లో ఆమె అధికారాన్ని హస్తగతం చేసుకునే నాటికి బ్రిటన్ ఎన్నో అస్తవ్యస్త పరిస్థితులను ఎదుర్కుంటోంది. కార్మిక ఆశాంతి బాగా హెచ్చురిల్లిపోయింది. బ్రిటన్‌లో రెండే ప్రధానమైన రాజకీయ పార్టీలు ఉన్నాయి. అవి ‘కన్సర్వేటివ్’ పార్టీ, ‘లేబర్ పార్టీ’లు. థాచర్ ప్రధాని అయ్యే నాటికే కార్మిక ఆశాంతి బాగా పెరిగి తారాస్థాయికి చేరింది.

కన్సర్వేటివ్ పార్టీ నాయకురాలిగా ఆమె దేశంలో ఎలాంటి సంస్కరణలు తీసుకురావాలో ఆలోచించారు. కన్సర్వేటివ్ పార్టీ కూడా సంక్షోభంలో పడి వుంటే తాను ఎలాంటి మార్పులు చెయ్యాలో ఆలోచించారు. అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్న చాంధస విధానాలనే ముళ్లకంచెలను నరకటం మెదలు పెట్టారు. తొలుత ఈ కంచెల నిర్మూలన కార్యక్రమంలో ఎందరెందరి నుంచో వ్యతికేకత ఎదురైనది. అయినా తన బుధ్ది కుశలతతో ముందుకు సాగారు. దాని తరువాత ఆమెను అందరూ “ఉక్కమహిళ” గా అభివర్ణించారు. 1980 దశకంలో ఆమె ప్రవేశపెట్టిన సంస్కరణలలో చాలా భాగం తరువాత వచ్చిన లేబర్ ప్రభుత్వాలు అనుసరించాయి.

బ్రిటన్‌ను రక్షించిన మహిళగా అందరూ పొగిడారు. తన కన్సర్వేటివ్ పార్టీని చిక్కులలోంచి రక్షించడంతో బాటు దేశ ఆర్థిక వ్యవస్థను సమస్యల నుండి గట్టెక్కించారు. నయా వుదారవాద విదానాలను అమలు చేయడంలో తన తర్వాతనే ఎవరైనా అని అనిపించుకున్నారు. ఆమె అభిమానుల నుండే గాక ఆమె వ్యతిరేకుల నుండి గూడా “ఉక్కు మహిళ” అనే ప్రశంసలనందుకున్నారు. ఒక్క బ్రిటన్‌లోనే కాదు ప్రపంచ రాజకీయ చరిత్రలో ఆమె సుస్థిరస్థానము సముపార్జించుకున్నారు.

గత బ్రిటన్ రాజకీయ పుటలు తిరగేస్తే థాచర్ రంగప్రవేశం చేయక మునుపు కన్సర్వేటివ్ పార్టీలో గాని లేబర్ పార్టీలో గాని పేరు గన్న మహిళా నేతలు చాలా తక్కువే! పురుషాధిక్యత అధికంగా వున్న సమయంలో ఓ జాతీయపార్టీ నాయకత్వం స్వీకరించడం, దానిని సమర్ధవంతంగా నిర్వహించడం ఆప్పట్లో విశేష ప్రాముఖ్యం సంతరిచుకున్నది.

థాచర్ ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్రం అభ్యసించినా తనలోని వాధనా పటిమ సార్ధకత చేసుకోవాలనే కాంక్షతో తర్వాత న్యాయశాస్త్రాన్ని కూడా అభ్యసించి లాయర్‌గా కూడా ప్రాక్టీస్ చేసారు.

1951లో డెనిస్ థాచర్ అనే వ్యాపారితో వివాహం జరిగిన తర్వాత క్రమంగా రాజకీయాలపై ఆమె దృష్టి మళ్ళించారు.

అప్పుడు రెండు ప్రధాన రాజకీయ పార్టీలలో మహిళల సంఖ్య అతి తక్కువగా వుండేది. కన్సర్వేటివ్ పార్టీ విధానాల పట్ల ఆసక్తురాలై థాచర్ ఆ పార్టీలో చేరిన అనతికాలంలోనే ఉత్తర లండన్‌లోని ‘ఫించ్‌లే’ నుంచి పోటీ చేసి 1959లో తొలిసారి ఎం.పి. అయ్యారు. అప్పటి నుండి 1992 దాకా అదే స్థానం నుండి పోటీ చేస్తూ విజయం సాధించారు. తొలుత థాచర్ విద్యాశాఖా మంత్రిగా చేసినా తర్వాత 1979 నుండి 1990 దాకా వరుసగా 3 పర్యాయములు ప్రధాని కావడమే గాకుండా బ్రిటన్‌కు సుధీర్ఘ కాలం ప్రధానిగా ఉన్న ఘనతను సైతం దక్కించుకున్నారు. గత 150 సంవత్సరాలు బ్రిటీష్ చరిత్రలో ఒక ప్రధాని వరుసగా మూడు పర్యాయములు ఆ పీఠం అధిష్టించటమే గాకుండా వరుసగా మూడు పర్యాయములు పార్టీని గెలిపించడం కూడా దేశ చరిత్రలో ఆదే ప్రథమం కావడంతో ఇంటా బయటా ఆమె కీర్తి ప్రతిష్ఠలు బహుముఖంగా విస్తరించాయి.

బ్రిటన్ రాచరికపు రాణి ముందు ప్రధాని పదవి ఓ ముఖ్య నేత మాత్రమే! అటువంటి నామమాత్రపు హోదాతో ప్రధాని పదవిని అత్యంత శక్తివంతం చేసిన ఘనత ‘థాచర్’ దే! సాధారణంగా ఐదు సంవత్సరాల కాలానికి ఎన్నిక అయినా, రాణి గారికి నచ్చకపోతే రాణి ప్రధానిని తరచుగా తొలగించిన సందర్భాలు బ్రిటన్ చరిత్రలో కోకోల్లులు. కాని థాచర్ ప్రధాని అయిన పిదప ప్రపంచ వ్యాప్తంగా లభించిన కీర్తి ప్రతిష్ఠలు ఆమెను ఆ పదవిలో పదకొండు సంవత్సరాలు కొనసాగేలా చేశాయి.

అయితే 1990లో పార్టీలో అంతర్గత విభేధాలు మళ్ళీ తీవ్ర స్థాయికి చేరడంతో ఆమె తన పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోయారే గాని రాణి తోలగించలేదు. కన్సర్వేటివ్ పార్టీ చాలా సంక్షోభం ఎదుర్కుంటున్న సమయంలో తిరిగి పార్టీ పగ్గాలు చేప్పటి తిరిగి పార్టీని అధికారములోకి తెచ్చారు.

ధాచర్‌ను పదికాలపాటు గుర్తుచేసేవి ఆమె అనుసరించిన నియోలిబరల్(నయా ఉదారవాద) ఆర్థిక విధానాలు. అవే ఆమెను 20వ శతాబ్ధంలో అత్యంత ప్రభావవంతమైన నాయకులలో ఒకరిగానే గాక సరళీకృత ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపచేసిన ప్రపంచ చాంపియన్‌ను చేశాయి.

సోవియట్ యూనియన్ విధానాలను తిప్పికొడుతూ, బ్రిటన్‌ను కొత్త పంథాలో నడిపిస్తానంటూ ప్రతిజ్ఞ చేసిన ఆమె అమెరికాతో కలిసి నిజంగానే అప్పట్లో కొత్తపుంతలు తొక్కారు. నయాఉదారవాద విధానాలు అమలు చేస్తున్న అమెరికా వైపు మొగ్గి అప్పటి అమెరికా అధ్యక్షడైన రోనాల్ట్ రీగన్‌తో కలసి ఆమె చాలా ఆర్థిక ప్రతిపాదనలనే చేశారు. ఆర్థిక ప్రపంచాన్ని నడిపించాలనే విషయంలో ఇద్దరిది ఒకే దారి. కార్మిక ఉద్యమాలను అణిచి వేయడం ఎంతో వివాదస్పదమైన పన్ను విధానాలలో ఆమె చేసిన సంస్కరణలు తరువాత ఆమెకు అనుకూల వాతావరణం సృష్టించాయి. పారిశ్రామిక రంగంలో ప్రైవేటికరణను ప్రోత్సహించి కొత్త ఆర్థిక విప్లవానికి ఆమె ద్వారాలు తెరిచారు. అయితే ‘పోల్ టాక్స్’ అనే పన్ను విధానం మాత్రం అమె కీర్తికి కొంత మేర ప్రతిబంధకం అయిందని చెప్పచ్చు.

సంపన్నులు మాత్రమే ఆస్తి పన్ను చెల్లించాలనడం భావ్యం కాదని అందరూ సమానంగా పన్ను చెలించాలని అంటూ కమ్యూనిటీ టాక్స్‌ను థాచర్ ప్రవేశపెట్టారు. నిరుపేదలకు కొంత మినహయింపు ఇచ్చినా కనీసం 20 శాతం పన్ను చెల్లించాలనే నిబంధన విధించడంతో ఆదే ఆమె పట్ల చాలా వ్యతిరేకతను పెంచింది. దానేనే ‘పోల్ టాక్స్’ అని కూడా అంటారు. అటు వంటి కొన్ని విధానాలు ఆమె పట్ల వ్యతిరేకత పెంచినా, మొండి మనిషిగా పిలిపించుకున్నా సరే అనుకొన్నారుగానీ ఆమె వెనక్కి మాత్రం తగ్గలేదు. ఆమె విధానాలు ఆ తర్వాత పార్టీలో కూడా కొంత వ్యతిరేకత పెంచాయి. చివరికి అదే బలవంతంగా ఆమె వైదొలగేట్టు చేశాయి.

“రాజకీయాల్లో మాటలు కావాలనుకుంటే మగాళ్ళను అడగండి, పనులు కావాలంటే మహిళలను అడగండి” అని 1965లోనే ఒక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రసంగంలో ఆమె వక్కాణించారు. ప్రధాని పదవి నుంచి వైదొలగేదాకా ఆచరణలో దాన్ని నిరూపించారు. క్రొత్త దోవ వేయడానికి ఆమె ఎన్నో చిక్కుదారుల్లో వెళ్ళారు. వెళ్ళడమేగాక క్రొత్త బాట వేశారు. అది ఇవాళ బ్రిటన్‌నే గాక అనేక ఇతర దేశాలను కూడా ఆర్థికంగా కొత్త పుంతలు తొక్కిస్తోంది. అందుకే థాచర్ లాంటి ప్రధానమంత్రులు అరుదుగా వస్తూంటారు. కాలగతిలో అటువంటి మహనీయులు కలకాలం గుర్తుంటారు.

అందుకే త్యాగయ్య మాటలలో “ఎందరో మహానుభావులు అందరికీ వందనములు” అంటాను.

ఓ బ్రిటీష్ సినిమా కంపెనీవారు ఆమె స్వీయ చరిత్ర ఆధారంగా ఓ ఇంగ్లీషు సినిమా తీసి ఆమె కీర్తిని వేనోళ్ళ చాటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here