ఇవి చాలు

2
7

[dropcap]ను[/dropcap]వ్వేం చేయనక్కరలేదు
కొన్ని సంతోషపు క్షణాలను
మంచు ముక్కల్లా ఘనీభవింపచేస్తే చాలు

నాతో కొన్ని
మాటలనూ నవ్వులనూ పంచి
కొన్ని ఆనందబాష్పాలను చిగిరింప చేస్తే చాలు

ఈ చిన్ని గుండెను
బెలూనులా వూది
కాసేపు ఎగిరింపచేస్తే చాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here