[డా. కోగంటి విజయ్ రచించిన ‘జల్లికట్లు’ అనే కవితని అందిస్తున్నాము.]
~
[dropcap]ము[/dropcap]సిరే రంగుల మధ్య
కేకలూ అరుపుల మధ్య
అరుస్తూ పరిగెడుతూ వుంది
బాగా బలిసి మదించి
ఓ రంగుల కొమ్ముల పోట్లగిత్త
ఉరకలువేస్తూ
దుమ్ము రేపుతూ
కొమ్ము విసురుతూ
ఎత్తిపడేస్తూ
కాలు దువ్వుతూ
కసిరి కుమ్ముతూ
అడ్డూ ఆపూ లేకుండా
పశువైన దాన్ని
తాగించి కవ్విస్తోందీ మనుషులే
వెంటాడి పరిగెత్తిస్తోందీ మనుషులే
పట్టబోయి గాయాల పాలై
చనిపోతోందీ
సరదా పడుతున్న మనుషులే
ఎన్ని జల్లికట్లు చూడట్లేదు మనం
కొన్ని కవ్వించి బలౌతున్నవి
కొన్ని మనకు సంబంధం లేకుండానే జరుగుతున్నవి
కొన్నిట్లోనైతే మనుషులే పశువులుగా ఆటగా పరిగెడుతూ చేస్తున్నవీ..