Jam (잠): హారర్ సినిమాకు కొత్త గ్రామర్ నేర్పించిన కొరియన్ సినిమా

4
14

[‘జామ్’ అనే కొరియన్ సినిమాని సమీక్షిస్తున్నారు శ్రీ వేదాల గీతాచార్య.]

[dropcap]B[/dropcap]ong Joon-ho అంటే ప్రపంచ సినిమా ప్రియులకు ఆస్కార్ అవార్డులు పొందిన కొరియన్ సినిమా పారాసైట్ దర్శకుడిగా బాగా పరిచయం. నాకు మాత్రం అతని సినిమాల్లో ఓక్జా అనే ఒక అద్భుత పంది కథ చాలా ఇష్టం. ఒక జెనెటికల్ మాడిఫికేషన్ వల్ల పుట్టిన సూపర్ పిగ్, దాన్ని పెంచుకుంటూ వచ్చిన ఒక అమాయక బాలిక మిజా, వారి అనుబంధం, ఆ పందిని సృష్టించిన కార్పొరేట్లు దాన్ని బలవంతంగా అమెరికాకు తీసుకుని వెళితే మిజా అక్కడకు వెళ్ళి తన నేస్తాన్ని విడిపించుకు రావటం కథ.

పర్యావరణం ఎదుర్కొంటున్న సమస్యల నుంచీ, genetic alterations, cloning, cruelty towards animals ఇలా ఎన్నో వేడిగా వాడైన డిస్కషన్లకు దారి తీసే సబ్జక్టులను, బ్రిటిష్ జానపద కథల లాంటి సెట్టింగ్‌లో కొరియన్ల ఎమోషనల్ బాండింగ్‌ను, సహజ సిద్ధంగా కొద్దిపాటి వైలెన్స్‌ను కలిపి తీసిన ఈ సినిమా అమెరికన్-కొరియన్ నిర్మాణ సంస్థలు అందించిన Netflix Special.

Tilda Swinton, Jake Gyllenhaal, Lily Collin’s లాంటి అంతర్జాతీయ తారలతో పోటీ పడుతూ కొరియన్ బాలనటి ఆన్ స్యో-హ్యున్ (Ahn Seo-hyun) నటించిన ఈ సినిమాలో ఎడిటింగ్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది.

ఎవరా అని అప్పట్లోనే ఆరాతీశాను. అవటానికి Yang Jin-mo అని ఉన్నా, అసలు పనిలో ప్రధాన పాత్ర పోషించింది ఆ సినిమాకు సహాయ దర్శకుడిగా పని చేసిన Jason Yu.

పారాసైట్‌లో క్రీపీగా అనిపించే కొన్ని సన్నివేశాలను డిజైన్ చేయటంలో సహాయపడటమే కాకుండా, దానికి కూడా ఎడిటింగ్‌లో సహకారం అందించిన ఈ జాసన్ యూ తీసిన black comedy horror thriller సినిమానే ఈ జామ్.

అంతర్జాతీయంగా కాన్ ఫిలిమ్ ఫెస్టివల్‌లో అరంగేట్రం చేశాక మొన్న సెప్టెంబరు 6న కొరియాలో విడుదలైంది. జామ్ అంటే మనం అనుకునే జామ్ కాదు.

Slumber అని, eye-shut (కన్నుమూత) అనీ అర్థం వచ్చే కొరియన్ పదం. కాన్లో Sleep అనే పేరుతో పరిచయం చేశారు. తెలుగులో నిద్రాణ స్థితి అనుకోవచ్చు. సినిమాకు సరిగ్గా సరిపోయే టైటిల్ మటుకూ అదే. Slumber.

ఆ కొరియన్ పదానికి ఎన్ని అంతరార్థాలు ఉన్నాయో అన్ని లేయర్లు ఈ సినిమా కథనంలో ఉన్నాయి.

Soo-jin (సు-జిన్) ఒక కంపెనీలో executive గా పని చేస్తుంటుంది. Hyeon-soo (హ్యున్-సూ) పేరున్న నటుడు. ఆమె అతడికి అభిమాని. ఆ అభిమానం వారు కలిసే దాకా వచ్చి, ఒకరికి ఒకరు నచ్చి, వివాహం చేసుకుంటారు. అందరు కొత్త జంటలలాగనే ఎన్నెన్నో కలలతో కొత్త కాపురం పెడతారు. Superstar Krishna లాగా కాపురం కొత్త కాపురం.. అని duets పాడుకున్నారో లేదో మనకు తెలియదు. ఎందుకంటే..

సినిమా టైటిల్‌కు తగినట్లే మన హీరో గారు హ్యున్-సూ మాంఛి నిద్రలో ఉంటారు. సన్నగా గురక కూడా వినిపిస్తుంటుంది. Thus starts the film.

అయితే అసలు సమస్య మన మలయాళ సినిమాల్లో లాగా గురక కాదు. ఆ గురకను ఒక మెటాఫర్‌గా వాడతాడు దర్శకుడు యూ. పగలు మామూలుగా ఉన్న హ్యున్-సూ ఒకరోజు నిద్రలేచి చూసే సరికి మొహమంతా రక్త గాయాలతో ఉంటుంది. అది చూసి సు-జిన్ కంగారు పడుతుంది. గోళ్ళతో రక్కినట్లు, మొహమంతా ఎవరో పీకినట్లు ఉంటుంది.

కొంత సమయం గడిచాక సు-జిన్ గర్భవతి అవుతుంది. ఈలోగా హ్యున్-సూ సమస్య అధికం అవుతుంది. నిద్రలో తెలియకుండా గాయాలు చేసుకోవటం కాకుండా నిద్రలో నడక కూడా మొదలౌతుంది. ఈ సన్నివేశాలను చాలా చులాగ్గా చూపిస్తాడు దర్శకుడు. ఇక్కడ వచ్చే ఎడిటింగ్ కూడా మనకు ఠారెత్తే విధంగా ఉంటుంది.

సమస్య రోజు రోజుకూ ఎక్కువ కావటంతో డాక్టర్‌ను సంప్రదిస్తారు. ఫలితం ఉండదు. ఎందుకంటే ఇది హరర్ సినిమా కూడా కదా. అందుకు. గర్భవతి అయిన తన కూతురు సు-జిన్ సమస్యలో ఉండటంతో ఆమె తల్లి వస్తుంది. అందరు పెద్దవాళ్ళ లాగానే సమస్యకు పరిష్కారం చేయాలనుకుంటుంది.

డాక్టర్ మన హ్యున్-సూ కు REM Sleep Disorder ఉందని చెప్పి మెడికేషన్ ప్రారంభిస్తాడు. అదే సమయంలో సు-జిన్ తల్లి ఒక Spirit specialist సహాయం అర్థిస్తుంది. ఆ Spirit Specialist కనుక్కునేది ఏమిటంటే సు-జిన్ ఉంటున్న ఆ ఇంట్లో ఆమె భర్త కాకుండా మరొక పురుషుడు కూడా ఉంటున్నాడని, కానీ అతను బతికి ఉండే అవకాశం ఏ కోశానా లేదని బాంబు పేలుస్తుంది.

ఇక్కడి నుంచీ కథనం మరింత చిక్కబడుతుంది.

ఎంత వైద్యం చేసినా హ్యున్-సూ కు నయం కాదు. ఒక అర్థరాత్రి నిద్రలో పచ్చి మాంసం పీక్కు తింటుంటాడు. అది చూసిన సు-జిన్ తన బిడ్డకు ఎక్కడ ప్రాణాపాయమో అని కంగారు పడుతుంది. భర్తను ఆ స్థితిలో వదలలేదు. పుట్టబోయే బిడ్డ క్షేమం చూసుకోకుండా ఉండలేదు. అప్పటి వరకు చాలా optimist గా కనిపించిన ఆమెలో భయాలు ఒక్కసారిగా తన్నుకు వస్తాయి. She becomes so paranoidal that she loses her sleeping ability.

తరువాత ఏమి జరుగుతుందనేది మిగిలిన కథ.

సినిమాలో ప్రధానంగా మాట్లాడుకోవాల్సినది దర్శకుడి పనితనం గురించి.

లాంగ్ ఐలెండ్ యూనివర్సిటీకి చెందిన రిసెర్చ్ స్కాలర్ Michelle Park రాసిన The Aesthetics and Psychology Behind Horror Films అనే పేపర్‌లో ఈ విధంగా అంటుంది.

<<<అందరికీ భయమంటే భయమే. దాని వల్ల మనం నెగటివ్‌గా affect అవుతాము. మనకు మూడ్ ఖరాబ్ అవుతుంది. గుండె వేగం పెరుగుతుంది. తట్టుకోలేని భావోద్వేగాలు కలుగుతాయి. శరీరంలో విడుదల కాకూడని రసాయనాలు ఉత్పన్నమవుతాయి. అయినా మనం ఆ భయాన్ని ఆస్వాదిస్తాం. ఆశ్చర్యంగా ఉందా? మనకు సంతోషాన్ని కలిగించేవాటికన్నా భయాన్ని కలిగించే వాటినే ఎక్కువ మన ఆలోచనల్లో నింపుకుంటాం. కారణం మనలో మనకు తెలియకుండా భయాన్ని ఆస్వాదించే గుణం ఉంటుంది. అందుకే భయం కలిగించే కథలు చదువుతాం. సినిమాలు చూస్తాం.>>>

సరిగ్గా సు-జిన్ పాత్ర విషయంలో వాడతాడు దర్శకుడు యూ. కనీసం తనకు కాన్పు అయ్యేదాకా అయినా భర్తకు దూరంగా ఉండే వెసులుబాటు ఉంటుంది. అయినా ఆమె వెళ్ళదు. భర్తను వదలలేను అనుకుంటుంది. అలా అని అక్కడ ప్రశాంతంగా ఉండలేదు. బిడ్డకు ఏ హాని జరుగుతుందో అనే భయం. అసలు ఆ భయాన్ని ఆస్వాదిస్తూనే ఆమె అక్కడ ఉంటుంది. This isn’t revealed through dialogues. Sharp and innovative editing techniques are used to convey the message.

సినిమా అంతా చాలా వరకూ ఒక ఇంట్లోనే జరుగుతుంది. మధ్య మధ్యలో క్లినిక్, కాసేపు ఇంటి బయట తప్ప వేరే లొకేషన్లు ఉండవు. అయినా మనకు చాలా చోట్ల కథ నడిచింది అనే భావం కలుగుతుంది.

స్త్రీలు గర్భంతో ఉన్నప్పుడు వారి మానసిక స్థితి చాలా సున్నితంగా ఉంటుంది. వారి ఎమోషన్లు ఏ ఏ పరిస్థితుల్లో ఏ ఏ విధంగా ఉంటాయో ఆ యా విధంగా డిజైన్ చేసి మరీ సు-జిన్ పాత్రను మలచాడు. ఎంత ధైర్యం ఉన్న అమ్మాయి అయినా, ఎంత తెగువ ఉన్నా, ఆశావహ దృక్పథం ఉన్నా, ఎవరైనా భయాన్ని ఎంత వరకూ తట్టుకోగలరు? ఈ విషయాన్ని నొక్కి చూపిస్తాడు. ఈ పాత్రను వేసిన Jung Yu-mi కూడా పాత్రలో ఇమిడిపోయింది.

Time and Tension, Theme and Tension, and Character and Tension (Space and Tension) సాధారణంగా ఉంపయోగించే narrative techniques. ఈ సినిమాలో మూడింటినీ తారాస్థాయికి తీసుకు వెళ్తాడు దర్శకుడు జాసన్ యూ. కొన్నిచోట్ల జరుగుతున్న పరిణామాలను చూస్తే మనకు పొట్ట పగిలేంత నవ్వు వస్తుంది. కానీ తెర మీద దృశ్యం చూస్తే భయంతో గడ్డకట్టుకు పోతాము. Public speech ఇచ్చేటప్పుడు constipation సమస్య వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మన పరిస్థితి.

సినిమా మూడు చాప్టర్లుగా ఉంటుంది. మొదట సమస్యకు సాక్ష్యాలను చూపిస్తాడు. తరువాత సమస్య ఫలితాలను చూపిస్తాడు. ఆ పైన సమస్య ఏమిటన్నది వినూత్నమైన రీతిలో రివీల్ చేస్తాడు. పరిష్కారం?

ఒక్కొక్క చాప్టర్ నడుస్తున్న కొద్దీ tension factor పెరుగుతుంది. Urgency to solve the issue కూడా. రెండవ చాప్టర్ చివర జరిగే ఊహించలేని shocking incident తరువాత కథ కీలకమైన క్లైమాక్స్ కు చేరుతుంది.

ఇక్కడిదాకా చాలా బాగా నడిపించిన దర్శకుడు ఇక్కడే కాస్త తడబడ్డాడు. Ambiguous ending was deliberate అనిపిస్తుంది.

అక్కడ supernatural element ఉన్నదా లేదా అన్నదాన్ని ఎంత అద్భుతంగా రివీల్ చేస్తాడో, చివర ఇచ్చిన రిజల్యూషన్ అంత పేలవంగా ఉంటుంది. సినిమా చూశాక ఒకరకమైన అసంతృప్తితో మిగిలిపోతాము.

అయినా సరే ఇది చూసి తీరాల్సిన సినిమా (for movie buffs of all kinds, and genre lovers). ఇంతవరకూ చూడని హరర్ ఎలిమెంట్స్ సినిమాలో వాడి చాలా కొత్త అనుభూతి కలిగిస్తాడు యూ. టే సూ-కిమ్ సినిమాటోగ్రఫీ, మీ యోన్-హన్ ఎడిటింగ్, Chang Hyuk-jin, Chang Yong-jin ల సంగీతం దర్శకుడి విజన్‌ను ఎలివేట్ చేసేలా ఉంటాయి. ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితనం మెచ్చుకోకుండా ఉండటం కష్టం. ఆ చివరలో వచ్చే claustrophobic feel కు బాగా దోహదపడింది.

హైలైట్ సన్నివేశాలు:

  1. ప్రారంభం
  2. సమస్య హీరోయిన్‌కు అర్థమయ్యే సన్నివేశం
  3. చివరలో ఆ సూపర్ నేచురల్ ఎలిమెంట్‌ను ఎలా పారద్రోలాలో గోడల మీద నోట్స్ లాగా రాస్తుంది సు-జిన్. ఆ తర్వాత హీరోకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తుంది. ఆ టైమ్‌లో ఆమె డెలీరియమ్‌లో ఉంటుంది. <<<కొన్నిచోట్ల జరుగుతున్న పరిణామాలను చూస్తే మనకు పొట్ట పగిలేంత నవ్వు వస్తుంది. కానీ తెర మీద దృశ్యం చూస్తే భయంతో గడ్డకట్టుకు పోతాము. Public speech ఇచ్చేటప్పుడు constipation సమస్య వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మన పరిస్థితి. >>> చూసి తీరాల్సిందే.
  4. హీరోయిన్ తల్లిని మొదటిసారి తెర మీద హీరో చూసే టైమ్‌లో
  5. For those who can stomach it, meat eating bit.

మంచి రివ్యూలు వచ్చినా, చూసిన వాళ్ళు బాగుంది అని చెప్పినా సినిమా ఒక మాదిరిగానే ఆడుతోంది. అది పక్కన పెడితే.. Jam (in Korean) or Sleep (in English) రాబోయే కాలంలో క్లాసిక్‌గా మారబోయే సినిమా.

కొన్నాళ్ళకు ఏదోక ఓటీటీలో వస్తుంది. చూసేయండి. You may love it. Or hate it. But you’ll never forget it. జీవితంలో ఇంత ఎప్పుడూ నవ్వలేదు అనే సీన్స్, ఇంత subconscious లో భయపెట్టిన సన్నివేశం వేరేది లేదు అనిపించే సన్నివేశాలు మనకు బోనస్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here