జన్మదిన కానుక

0
9

[ప్రొఫెసర్ పంజాల నరసయ్య గారు రచించిన ‘జన్మదిన కానుక’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]కొ[/dropcap]ల్లాయి చుట్టితే నేమి
మన గాంధీ గుజరాత్‌లో
కోమటై పుట్టితే నేమి

మాతృమూర్తి దాస్య శృంఖలాలు
తెంచ పాదయాత్ర చేసాడు
ఆసేతు హిమాచలం
జన సమీకరణ చేయ

తండోప తండాలుగా తరలి వచ్చారు
భారతీయులు తమ మద్దతు తెలుప
ఇచ్చారు ధన వస్తు సంపద
స్వాతంత్ర సంగ్రామం కోసం

ఆజానుబాహుడు కాదు
సమ్మోహన ఆకారం కాదు
బక్క పలుచని శరీరం
ఒంటిని సగం కప్పు
వస్త్ర ధారణ

సాధారణ వేషధారణ
చూసి అయ్యారు
అవాక్కు
మమేకమయ్యారు
ఖద్దరు ధారితో
ఆబాల గోపాలం

మూడు చెరువుల నీళ్లు
తాగించాడు ఆక్రమణ దారుల
మాతృమూర్తిని చెరపట్టిన
ముష్కర మూకల

సూర్యుడు అస్తమించని బ్రిటిష్
సామ్రాజ్యం గాంధీని చూసి
గడగడలాడింది
గాలికి ఎగిరి పోయే
మనిషి నిద్ర లేకుండా చేస్తుంటే
దిక్కు తోచక లబోదిబో మన్నది

శాంతి, అహింస, సత్యాగ్రహం
అన్నింటికీ మించి ప్రజల మద్దతు
అతని ఆయుధాలు

వీటి ముందు వారి
సుశిక్షితులైన సైనికులు
అధునాతన ఆయుధాలు
తుస్సుమన్నవి

ఆర్థిక స్వాతంత్రం
సామాజిక స్వాతంత్రం
సమ న్యాయం
సమాన అవకాశాలు
అందని ద్రాక్ష పండ్లు
అయ్యాయి నేటి భారతంలో

ఓ బాపూ ! నువ్వు మళ్ళీ పుట్టు
మా బతుకులు బాగు చేయ
అంటే సిగ్గుచేటు

అందరి క్షేమం కోసం
అందరం కలసి
ముందడుగేద్దాం
ఇదే మనమిచ్చే
జన్మదిన కానుక
బాపూకు, మహాత్మకు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here